ఈ రెండు బైకులు ఇకపై బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లో.. ఎందుకో తెలుసా?
హోండా బైకులకు భారతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ ఎప్పటికప్పుడు లేటెస్ట్ బైక్స్ లేదా అప్డేటెడ్ బైక్స్ లాంచ్ చేస్తూ ఉంది. అయితే హోండా మోటార్‌సైకిల్ కంపెనీ తన బ్రాండ్ బైకులను రెండు డీలర్షిప్స్ ద్వారా విక్రయిస్తుంది. ఒకటి సాధారణ బైక్స్ విక్రయించడానికి సాధారణ డీలర్షిప్, మరొకటి బిగ్‌వింగ్ డీలర్‌షిప్. ఇక్కడ కేవలం ప్రీమియం బైకులను మాత్రమే విక్రయించడం జరుగుతుంది. కానీ కంపెనీ ఇప్పుడు హార్నెట్ 2.0 మరియు సీబీ200ఎక్స్ బైకులను బిగ్‌వింగ్ డీలర్‌షిప్ ద్వారా విక్రయించడానికి సన్నద్ధమైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హోండా యొక్క బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లు సాధారణంగా వారి ప్రీమియం ఆఫర్‌ల కోసం మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయి. కానీ ఇప్పుడు హార్నెట్ 2.0 మరియు సీబీ200ఎక్స్ బైకుల కూడా ఈ డీలర్‌షిప్‌ల ద్వారానే విక్రయించబడతాయి. అంటే ఈ రెండు బైకులు సీబీ200ఎక్స్, సీబీ350, సీబీ350ఆర్ఎస్ మరియు హైనెస్ సీబీ350 బైకులతో పాటు విక్రయిస్తారన్నమాట. ఈ బైకులకు కొనుగోలు చేయాలనుకునే వారు ఇకపై బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో కొనుగోలు చేయవచ్చు.

నిజానికి కంపెనీ బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో బ్రాండ్ అమ్మకాలను పెంచుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డీలర్‌షిప్‌లు అధిక సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లను మాత్రమే విక్రయిస్తాయి. అంతే కాకుండా ఇక్కడ సాధారణ హోండా ద్విచక్ర వాహన డీలర్‌షిప్‌ల కంటే చాలా తక్కువ విక్రయాలు జరుగుటాయి. ధరలు కూడా కొంత ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇవన్నీ ఉత్తమ పనితీరును అందిస్తాయి.
హోండా సీబీ200ఎక్స్ స్ట్రీట్ నేకెడ్ హార్నెట్ 2.0తో దాని అండర్‌పిన్నింగ్‌లను పంచుకుంటుంది. ఈ బైక్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫెయిరింగ్, పొడవాటి విండ్‌స్క్రీన్, నకిల్ గార్డ్‌లు మరియు ప్లాస్టిక్ బెల్లీ పాన్ వంటి అడ్వెంచర్ స్టైల్ ఫీచర్‌ల జోడింపు దీనికి మరింత పటిష్టమైన రూపాన్ని అందిస్తాయి. అయితే ఇది హార్నెట్ 2.0 కంటే పరిమాణంలో కొంత పెద్దదిగా ఉంటుంది.

హోండా హార్నెట్ 2.0 మరియు సీబీ200ఎక్స్ రెండూ కూడా 184సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతాయి. ఈ ఇంజిన్ 8500 rpm వద్ద 17.26 హార్స్ పవర్ మరియు 6000 rpm వద్ద 15.9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తాయి. దేశీయ మార్కెట్లో సీబీ200ఎక్స్ ధర రూ. 1.47 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ), కాగా.. హార్నెట్ 2.0 ధర రూ. 1.39 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా కూడా ఉత్తమ అమ్మకాలను పొందుతోంది. అయితే సాధారణ డీలర్‌షిప్‌తో పోలిస్తే బిగ్‌వింగ్ డీలర్‌షిప్ అమ్మకాలు కొంత తక్కువే. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో అమ్మకాలను మరింత మెరుగుపరుచుకోవడానికి మరో రెండు బైకులను చేర్చినట్లు స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉత్పత్తులను ఇందులో చేరుస్తుందా? లేదా? అనే వివరాలు భవిష్యత్తులో తెలుస్తాయి.
ఇక హార్నెట్ 2.0 మరియు సీబీ200ఎక్స్ రెండు బైకులు ఉత్తమ డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు అత్యుతమ రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి. అయితే కంపెనీ ఈ రెండు బైకులను బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తే ధరలలో ఎటువంటి మార్పు ఉండదని తెలుస్తోంది. కాబట్టి ప్రజలు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదనే తెలుస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








