ఇలా చేస్తే 'సలార్ బైక్' మీ సొంతం.. మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం!
డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన బైక్ చాలామంది ఆటోమొబైల్ ప్రేమికులను తెగ ఆకర్శించేసింది. ఇప్పుడు ఈ బైక్ గెలుగుకునే అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.700 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఇది పార్ట్1, పార్ట్2 అనే రెండు భాగాలుగా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన పార్ట్1 అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పార్ట్2 షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతోంది. ఇది కూడా త్వరలోనే విడుదలకానున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు విడుదలవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.
సలార్ ఎక్స్(ట్విటర్) ఖాతలో విడుదలైన సమాచారం ప్రకారం.. ఈ రోజు(ఏప్రిల్ 21) సాయంత్రం 5:30 గంటలకు సలార్ మూవీ ప్రసారమవుతుంది. సినిమా ప్లే అయ్యే సమయంలో స్క్రీన్ ఎడమవైపున బైక్ ఫోటో కనిపిస్తుంది. సినిమా పూర్తయ్యే లోపల ఈ బైక్ ఫోటో ఎన్నిసార్లు కనిపిస్తుందో లెక్కించాలి. ఎస్ఎమ్ఎస్ లైన్ ఓపెన్ అయిన తరువాత సలార్ స్పేస్.. స్క్రీన్ మీద బైక్ కనిపించిన సమయం అని టైప్ చేసి పంపించాల్సి ఉంటుంది.
ఏ నెంబర్‌కు ఎస్ఎమ్ఎస్ చేయాలో కూడా సలార్ ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ అవకాశం కేవలం ఈ రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సలార్ బైక్ గెలుచుకోవాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం. అయితే ఎంతమంది విజేతలను ప్రకటించనున్నారు? ఎన్ని బైకులు అందిస్తారనేది ఖచ్చితంగా వెల్లడించలేదు. బహుశా ఒక్కరికే ఈ బైక్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.
సలార్ బైక్ గురించి..
సలార్ సినిమా విడుదలైనప్పటి నుంచి.. ఆ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన బైక్ చాలామందిని ఆకర్శించింది. చూడటానికి చాలా స్టైలిష్ డిజైన్ పొందిన ఈ బైక్ గురించి ఇప్పటికే పలువురు నెటిజన్లు పెద్ద ఎత్తున సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారు. నిజానికి ఇది ఒక కస్టమైజ్డ్ 'రాయల ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350' బైక్. దీనిని హైదరాబాద్ నగరంలోని ఎయిమోర్ కస్టమ్స్ రూపొందించినట్లు సమాచారం.
కస్టమైజ్డ్ రాయల ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350 బైకులో.. కొత్త ఫ్యూయెల్ ట్యాంక్ ఉపయోగించబడినట్లు సమాచారం. అంతే కాకుండా హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, ఫ్రంట్ వీల్స్ మరియు టైర్లు అన్నీ కూడా మార్చినట్లు తెలుస్తోంది. సీటు కూడా కొత్తగా డిజైన్ చేసినది కావడం గమనార్హం. ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా తొలగించబడింది. ఈ బైక్ థండర్‌బర్డ్ 350 బైక్ అయినప్పటికీ.. చూడగానే ఇదో కొత్త బైకు మాదిరిగానే కనిపిస్తుంది.
సైడ్ కవర్లు, ఫ్యానెల్ అన్నీ కూడా కస్టమైజ్ చేశారు. సైడ్ కవర్ మీద మెటల్ కేజ్ ఉండటం చూడవచ్చు. హ్యాండిల్ బార్ కూడా కొత్తగా ఉంది. ఇంజిన్, రిమ్స్ నలుపు రంగులో పూర్తి చేయబడ్డాయి. ఎగ్జాస్ట్ కూడా ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ కావడం గమనార్హం. బైకులో ఎక్కువ భాగం సిల్వర్ కలర్ పొందినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ బైక్ చూడగానే బైక్ ప్రేమికులను తప్పకుండా ఆకర్శించే విధంగా ఉంది.
నిజానికి భారతదేశంలో కస్టమైజ్ వాహనాలు పబ్లిక్ రోడ్డు మీద ఉపయోగించకూడదు. ఒకవేళా కస్టమైజ్ బైకులు ప్రజారహాదారుల్లో ఉపయోగిస్తే భారీ జరిమాణాలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో కస్టమైజ్ బైకులపైన అధికారులు భారీగా జరిమానాలు చెల్లించిన సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ కస్టమైజ్ సలార్ బైక్ సొంతం చేసుకున్నవారు ఆకాంతి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందా? అనేది ఒక ప్రశ్న.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








