బైక్‌ రేసింగ్‌ పండుగ వచ్చేసింది.. తక్కువ ధరకే టికెట్లు, లైవ్‌లో స్టంట్స్‌ చూస్తుంటే ఆ కిక్కే వేరూ!

ఇండియా బైక్ వీక్‌ (India Bike Week) కోసం దేశంలోని మోటార్‌సైకిల్‌ ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు దీనికి సంబంధించిన తేదీలను నిర్వాహకులు ప్రకటించారు. మోటార్‌సైకిల్ షో దేశంలోనే అత్యంత పాపులారిటీని కలిగి ఉంది. ఈ ఈవెంట్‌ సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో జరుగుతుంది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా డిసెంబర్‌లో ఈవెంట్‌ని గోవాలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా కొనసాగుతున్నాయి. భారతదేశంలోనే అత్యంత పాపులారిటీని కలిగిన మోటార్‌సైకిల్స్‌ ఈవెంట్లలో ఒకటైన దీని గురించి మరిన్ని వివరాలు మీకోసం..

భారత్‌లో కొత్త మోటార్ సైకిళ్లను ప్రవేశపెట్టడంతో పాటు మోటార్‌సైకిళ్లపై ఆసక్తిని పెంచేందుకు, రైడింగ్‌ ఔత్సాహికుల కోసం ఇండియా బైక్ వీక్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బైక్ ప్రేమికులు గోవాలో తమ బైక్‌లతో సందడి చేయనున్నారు. ఈ బైక్‌ వీక్‌ పలు రకాల పోటీలతో ఆసక్తిగా కొగసాగుతుంది. ఇందులో పాల్గొనేవారు తమ బైక్స్‌తో స్టంట్స్‌ చచేయవచ్చు. అందుకు తగినట్లుగా ట్రాక్‌ని ఏర్పాటు చేస్తారు.

India Bike Week 2024 Start on December 6

అలాగే ఇందులో ఫాస్ట్‌ రేసింగ్‌ని సైతం నిర్వహిస్తారు. చాలా వరకు ఈ అడ్వెంచర్‌లలో రైడర్లు పాల్గొంటారు. అలాగే బైక్ స్టంట్స్‌ని చూడటానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు మోటార్ సైకిల్ కంపెనీలు సైతం తమ కొత్త బైక్‌లను ఈ ఈవెంట్‌లో ప్రదర్శిస్తారు. ఓ విధంగా ఇది పబ్లిసిటీతో పాటు బైక్‌కి అదనపు క్రేజ్ లభిస్తుంది.

ఒకవేళ ఆ కంపెనీకి చెందిన బైక్ ఈ ఈవెంట్‌లో సత్తా చాటితే రైడింగ్ ఔత్సాహికులు దీనిని ప్రమోట్‌ చేసే అవకాశం ఉంటుంది. పైన చెప్పిన విధంగా ప్రతీ సంవత్సరం డిసెంబర్‌లో ఇండియన్ బైక్ వీక్ జరుగుతుంది. డిసెంబర్ 6, 7 తేదీల్లో గోవాలోని వాకాటాలో ఇండియన్ బైక్ వీక్ 11వ ఎడిషన్ కొనసాగనుంది. ఈ ఈవెంట్‌కి 'ది నెక్ట్స్ చాప్టర్' అని పేరు పెట్టారు.

India Bike Week 2024

ఈ షోకు సంబంధించిన టికెట్‌ బుకింగ్స్ అక్టోబర్ 13 నుంచే ప్రారంభం అయ్యాయి. ముందుగా టికెట్స్‌ కొనుగోలు చేసే వారిపై 2000 టిక్కెట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మొదటి 2,000 టిక్కెట్ల ధరలు రూ.2,499గా ఉన్నాయి. రూ.500 తక్కువ ధరతో రూ.1,999 లకే చెల్లించాల్సి ఉంటుంది.

ఇక రూ.1,999లో రూ.250 విలువైన ఫుడ్ అండ్ బెవరేజ్ కూపన్లు కూడా ఇవ్వనున్నారు. ఈ ఆఫర్‌ కేవలం 2,000 మందికి మాత్రమే కాబట్టి ఇప్పటికే టికెట్లు బుక్‌ అయ్యాయని ఇండియన్ బైక్ వీక్ తెలిపింది. టికెట్‌ ధరల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో సందర్శించండి. ఈ రెండు రోజులు షోకు హాజరు కావాలనుకునే వారు కేవలం రూ.2,999 చెల్లించి వీకెండ్ పాస్ పొందవచ్చు.

India Bike Week 2024

ఇక వీకెండ్ పాస్ పొందిన వారికి రూ.500 విలువైన ఫుడ్ అండ్ సాఫ్ట్ డ్రింక్ కూపన్, స్పెషల్ ఇండియన్ బైక్ వీకెండ్ కిట్ ఇవ్వనున్నారు. ఇండియన్ బైక్ వీక్ నిర్వాహకులు రూ.2,999 విలువైన వాల్యూ ఫర్ మనీ క్లబ్ ప్యాకేజీలను అందించాలని యోచిస్తున్నారు. ఈ ప్యాకేజీలతో ఈవెంట్ ఏరియాలో కొన్ని చోట్ల ప్రత్యేక యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది.

ఇండియన్ బైక్ వీక్ 2024లో హార్లే డేవిడ్‌సన్‌ బైక్ రేసుని ఏర్పాటు చేయనుంది. ఈ రేసింగ్ కోసం బుకింగ్స్ నవంబర్ 15న ప్రారంభం కానున్నాయి. ఈ రేసులో కేవలం 81 మంది పోటీదారులను మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ రేసులో కస్టమైజ్డ్ హార్లే డేవిడ్‌సన్‌ X440 బైక్స్‌ని ప్రదర్శించనున్నారు. మోటార్ సైకిళ్లపై ఆసక్తి ఉన్నవారికి ఇండియన్ బైక్ వీక్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 13, 2024, 10:45 [IST]
English summary
India bike week 2024 will start on december 6 check ticket price and more details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+