ఈ తోపు బైకులంటే యూత్‌కు పిచ్చక్రేజ్.. వీటి డిజైన్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. మైలేజ్‌లో కింగ్‌లు
దేశంలో ప్రీమియం బైకుల వినియోగం ఎక్కువగా పెరుగుతుంది. ధర కొంచెం అధికంగా ఉన్నప్పటికీ కూడా వీటిలో ఉండే లగ్జరీ ఫీచర్లు, సరికొత్త డిజైన్ నచ్చి చాలా మంది ఈ బైకులనే ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా యూత్ టాప్ కంపెనీలకు చెందిన లేటెస్ట్ డిజైన్‌తో ఉండే స్పోర్టీ లుక్ బైకులకు ఆకర్షితులవుతున్నారు. దీంతో ప్రీమియం టూవీలర్ అమ్మకాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో మార్కెట్లోకి చాలా కొత్త బైకులు రాగా, వాటిలో ఏ మోడల్‌ను ఎంచుకోవాలో తెలియక చాలా మంది యూత్ సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో ఎక్కువ ఫీచర్లతో అందరినీ ఆకట్టుకునే బజాజ్ పల్సర్ RS 200, హీరో మావ్రిక్ 440, TVS అపాచీ RTR 160 4V, హోండా CB350 వంటి ప్రీమియం బైక్‌ల గురించి ప్రత్యేకంగా క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.
బజాజ్ పల్సర్ RS 200(Bajaj Pulsar RS 200): బజాజ్ కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న బైకులలో పల్సర్ RS 200 మోడల్ ముందు స్థానంలో ఉంటుంది. ఈ బైకు యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. దీని ధర రూ. 1.74 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది 199.5 cc లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.

ఇంజిన్ 24.5 PS హార్స్ పవర్, 18.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోడ్లపై రయ్ మంటూ దూసుకోపోవడానికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను దీనిలో అందించారు. ప్రీమియం బైక్ లీటర్ పెట్రోల్‌కు దాదాపు 35 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ఫీచర్ల విషయానికి వస్తే, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED DRLలు, LED ఇండికేటర్‌లు, డ్యూయల్-ప్రొజెక్టర్ హెడ్‌లైట్, డబుల్ డిస్క్ బ్రేక్ సెటప్ ఉంది.
హీరో మావ్రిక్ 440(Hero Mavrick 440): దిగ్గజ కంపెనీగా ఉన్న హీరో నుంచి వచ్చిన మావ్రిక్ 440 డిజైన్ స్టైలీష్‌గా ఉంటుంది. ధర రూ. 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. దీనిలో 440cc పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ ఉంది. 27.36 PS హార్స్ పవర్, 36 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో వచ్చింది.

మావ్రిక్ లీటర్ పెట్రోల్‌కు దాదాపు 36 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఇంకా LED ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, బైక్ స్కిడ్ కాకుండా చూడటానికి వీల్స్‌కు డబుల్ డిస్క్ బ్రేక్‌లు వంటి వాటిని దీనిలో అమర్చారు.
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ(TVS Apache RTR 160 4V): ఈ మోడల్ బైక్ ఇండియాలో చాలా ఫేమస్. దీని ధర రూ. 1.20 నుండి రూ. 1.37 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది 159. 7 cc పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో లభిస్తుంది. 17.55 హార్స్‌పవర్, 14.73 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు.

మైలేజ్ విషయానికి వస్తే, లీటర్ పెట్రోల్‌కు దాదాపు 41 కి.మీ వరకు ఇస్తుంది. రైడింగ్ సమయంలో స్కిడ్ కాకుండా ఉండటానికి వేగాన్ని కంట్రోల్ చేయడానికి డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను అందించారు. ఫీచర్ల పరంగా ముందు LED హెడ్‌లైట్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి.
హోండా CB350(Honda CB350): దీని ధర రూ. 2.15 నుండి రూ. 2.18 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది 348.36 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇంజిన్ 21 హార్స్‌పవర్, 29.4 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ లీటర్ పెట్రోల్‌కు 42.17 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








