2024లో వచ్చిన ఎన్నడూ మర్చిపోకూడని ఎలక్ట్రిక్ టూవీలర్స్! ఈ ఏడాది చాలా స్పెషల్ గురూ..!

కాలం వేగంగా మారిపోతుంది. కళ్లు మూసి తెరిచిలోపే ఊహించలేనంత ఫాస్ట్‌గా రోజులన్నీ గడిచిపోతున్నాయి. 2024 ఏడాది మొన్ననే వచ్చినట్లు అనిపించే లోపు 12 నెలలు అప్పుడే అయిపోవడానికి వచ్చాయి. చూస్తూ ఉండగానే 2025 ఏడాది వచ్చేస్తుంది. ప్రతిసారి కొత్త ఏడాదికి ముందు పాత ఏడాదిలో జరిగిన విషయాలు తలుచుకుంటాం. ఈ 12 నెలల్లో ఆటోమొబైల్(Automobile) రంగంలో చాలా మార్పులు వచ్చాయి. వాహన పరిశ్రమ అభివృద్ధి బాగా పుంజుకుంది. ప్రపంచదేశాల్లో లేని వ్యాపార వృద్ధికి ఉన్న సానుకూలతలన్ని ఇండియాలో ఉండటం కారణంగా అంతర్జాతీయంగా పేరు కలిగిన చాలా వాహన సంస్థలు తమ పెట్టుబడులను భారత్‌లో పెట్టాయి. మేక్ ఇన్ ఇండియా(Make in india)కు అనుగుణంగా చాలా కంపెనీలు తమ కార్లు, బైకులను ఇక్కడే లోకల్‌గానే తయారు చేసి ఇక్కడే విక్రయించడంతో పాటు, అంతర్జాతీయంగా ఇతర దేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల(EV) మార్కెట్ ఇండియాలో వేగంగా విస్తరిస్తుంది.

పెట్రోల్, డీజిల్, cng వాహనాలను తయారుచేసే కంపెనీలు ఈవీలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ గతంలో కంటే 2024 ఏడాదిలో భారీగా ఊపందుకుంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాలు ఈ ఏడాదిలో హైలెట్‌గా ఉన్నాయి. తయారీ కంపెనీలు పోటీ పడి మరి అధునాతన ఫీచర్లు, అదిరిపోయే డిజైన్లతో కూడిన ఈవీ బైక్స్, స్కూటర్స్‌ను లాంచ్ చేశాయి. సేల్స్ పరంగా కూడా ఇవి ఇప్పుడు దూసుకుపోతున్నాయి.

Electric Two Wheelers Launched In 2024

ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కంపెనీలకు 2024 ఏడాది ఎప్పుడు కూడా గుర్తుండి పోతుంది. ఎందుకంటే దేశంలో పెట్రోల్, డీజిల్, cng వాహనాలతో పాటు పోటీగా ఈవీలు కూడా సేల్స్‌ను సాధించాయి. ఈ ఏడాదిలో లాంచ్ అయిన ప్రతి మోడల్ కూడా సరికొత్త డిజైన్‌తో, మెరుగైన బ్యాటరీ, రేంజ్‌తో వచ్చినవే. సాధారణ ఇంధన టూవీలర్లతో పాటే ఈవీ బైక్స్, స్కూటర్స్ ప్రజల నుంచి మంచి ఆదరణ సంపాదించాయి.

2024 ఏడాదిలో లాంచ్ అయి ప్రజల నుంచి డిమాండ్‌ను సాధించిన కొన్ని ఎలక్ట్రిక్ టూవీలర్ల వివరాలను చూసినట్లయితే, జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఓలా ఎలక్ట్రిక్ దేశీయ ఈవీ టూవీలర్ విభాగంలో ఎక్కువ వాటాను సాధించింది. ఈ ఏడాదిలో ఓలా కంపెనీ నుంచి అదిరిపోయే ఈవీ టూవీలర్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి. ఓలా ఈవీ గిగ్(Ola Ev Gig), S1 Z ఈ ఏడాదిలో వచ్చిన ముఖ్యమైన మోడల్స్.

Top Electric Two Wheelers In 2024

వీటిలో గిగ్ మోడల్ మాత్రం పూర్తిగా డెలివరీ సేవల కోసం ఉద్దేశించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ నుంచి వచ్చే వాటిని డెలివరీ చేయడానికి అనువుగా ఉంటుంది. ఇది Gig, Gig+ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే, S1 Z మోడల్ కూడా S1 Z, S1 Z+ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది సాధారణ రైడింగ్‌తో పాటు డెలివరీ సేవల కోసం కూడా అనుకూలంగా ఉంటుంది.

స్కూటర్ల విభాగంలో తన సత్తాను చూపించిన ఓలా ఎలక్ట్రిక్ ఈ ఏడాది రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది. ఇది రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో, రోడ్‌స్టర్ ఎక్స్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి డెలివరీలు ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం బుకింగ్స్ మాత్రం జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, ఓలాకు పోటీ అయిన ఏథర్ (Ather) కంపెనీ 2024 ఏడాదిలో సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్టా(Rizta)ను విడుదల చేసింది.

అలాగే, BMW ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో పోటీ ఇవ్వడానికి ఈ ఏడాది BMW CE 02, BMW CE 04 అనే రెండు ఎలక్ట్రిక్ టూవీలర్లను విడుదల చేసింది. ఇవి ధరలు ఎక్కువగా ఉన్నాయి. వీటి డిజైన్ సరికొత్తగా ఉంటుంది. రివోల్ట్(Revolt) కంపెనీ ఆర్‌వీ1 (RV1), ఆర్‌వీ400 బీఆర్‌జెడ్ (RV 400 BRZ)మోడల్స్‌ను, కోమాకి(Komaki) ప్రైమ్, ఏస్, ఫ్లోరా, బజాజ్ చేతక్ 35 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ను విడుదల చేసింది.

More from DriveSpark

Article Published On: Thursday, December 26, 2024, 10:30 [IST]
English summary
India top electric two wheelers launched in 2024 here details
Read more on: #year ender 2024 #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+