అందం బైక్ రైడ్ చేస్తే ఇలాగే ఉంటుందా? మతిపోగొడుతున్న వీడియో
''ట్రెండ్ ఫాలో అవ్వడం లేదు, సెట్ చేస్తున్నారు'' అనే మాటకు చాలామంది కనెక్ట్ అవుతున్నారు. దీనికి సంబంధించిన చాలా సంఘటనలు ఇప్పటికే చూపరులను ఫిదా చేశాయి. ఇలాంటి మరో సంఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో..

ఒకప్పుడు పెళ్లికూతురు అంటే సిగ్గుపడుతూ.. అందంగా ముస్తాబై, కుటుంబ సభ్యులతో పెళ్లిమండపానికి వస్తుంది. కాలం మారింది. పెళ్లి కుమార్తెలు పెళ్లి మండపాలకు ఒక్కరే బైకుల మీద వచ్చేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక యువతి అందంగా ముస్తాబై.. కెటిఎమ్ బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తోంది. ఈ వీడియోను కాజల్ దత్తా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది.
కాజల్ దత్త ప్రొఫైల్ చూస్తే.. ఈమె వీడియోలు చాలా వరకు బైకులు రైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో కూడా సాంప్రదాయ చీరకట్టులో బైక్స్ రైడ్ చేస్తుండటం చూడవచ్చు. అయితే ఇప్పుడు ఏకంగా పెళ్లికూతురు అవతారంలో బైక్ రైడ్ చేస్తోంది. ఆమె నిజంగా పెళ్లి చేసుకుంటోందా? లేక వీడియో కోసమే ఇలా తయారైందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
కాజల్ దత్తా రైడ్ చేస్తున్న బైక్ కెటిఎమ్ కంపెనీకి చెందిన ఆర్‌సి390 (KTM RC390) స్పోర్ట్స్ బైక్ అని తెలుస్తోంది. చీర కట్టులో కూడా ఈమె చాలా హుందాగా మరియు సౌకర్యవంతంగా బైక్ రైడ్ చేస్తోంది. అయితే వీడియోలో గమనించినట్లయితే ఈమె హెల్మెట్ ధరించకపోవడాన్ని చూడవచ్చు. రైడర్ ముఖాన్ని కవర్ చేయకుండా లేదా మేకప్ చెరిగిపోకుండా ఉండటానికి బహుశా హెల్మెట్ ధరించలేదని అర్థమవుతోంది.
బైక్ రైడ్ చేసే సమయంలో హెల్మెట్ ధరించకపోవడం నేరం మాత్రమే కాదు, అత్యంత ప్రమాదం కూడా. కాజల్ దత్తా వీడియో కోసం ఇలా తయారైందని వీడియోలో తెలుస్తోంది. ఎందుకంటే ఈమె బైక్ రైడ్ చేస్తుంటే.. ఎదురుగా ఎవరో వీడియో తీస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఏది ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయిన అతి తక్కువ కాలంలోనే ఎక్కువమందిని ఆకర్శించింది. ఈ వీడియోకు ఇప్పటికే 50000 కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి.
హెల్మెట్ ధరించకుండా బైక్ రైడ్ చేయడం చాలా ప్రమాదం. ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే.. రైడర్ల తలకు రక్షణ కల్పించడంలో హెల్మెట్ ప్రధాన పాత్ర వహిస్తుంది. హెల్మెట్ ధరించకపోతే.. ప్రమాదాల్లో ప్రాణాలే కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే పోలీసులు హెల్మెట్ ధరించని వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
మహిళలు బైక్ రైడ్ చేయడం ఇదే మొదటిసారి కాదు!
మహిళలు బైక్ రైడ్ చేయడానికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వెలుగులోకి వచ్చిన వీడియోలలో ఒక మహిళ చీర కట్టుకుని క్లాసిక్ 350 బైక్ రైడ్ చేసింది. మరి వీడియోలో పొట్టి డ్రెస్సులు వేసుకుని, హీల్స్ ధరించి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ రైడ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎవరైనా బైక్ రైడ్ చేసేటప్పుడు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








