లాంగ్ డ్రైవ్‌కి పెట్రోల్ బైక్ Vs CNG బైక్‌లలో ఏది బెస్ట్? మైలేజీల మధ్య తేడా ఇదే!!
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ ఫ్రీడమ్ 125 బజాజ్ ఆటో కొద్ది రోజుల క్రితం విడుదల చేసింది. ఈ బైక్ లోని కొన్ని ఫీచర్లు ఇతర మైలేజీ తదితర అంశాలపై ప్రజలకు సందేహాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఈ బైక్ సుదూర ప్రయాణాలకు అనువుగా ఉంటుందా అనే సందేహాలు ప్రజల్లో ఎక్కువగా ఉంది. అందుకు కారణంగా ఈ బైక్‌లో కేవలం 2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ మరియు 2 కిలోల సీఎన్‌జీ ట్యాంక్ మాత్రమే వాళ్లు అందించారు. అయితే సాధారణంగా పెట్రోల్ బైకుల్లో దాదాపు 8 లీటర్ల కంటే ఎక్కువగా పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉన్నాయి. ఇందులో తక్కువ మొత్తంలో ఉండటంతో పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీనిని లాంగ్ డ్రైవ్‌లో ఉపయోగించవచ్చా అనే ప్రశ్నకు సమాధానం ఈ కథనంలో చూద్దాం.
బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఆధారిత మోటారర్‌సైకిల్‌గా ఫ్రీడమ్ 125ను విడుదల చేసింది. ఈ బైక్ ప్రపంచంలోనే అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్‌లలో ఒకటి ఉంది. ఈ బైక్ సీఎన్‌జీతో నడుస్తున్నప్పుడు కిలోకు 100 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లేవారికి, కాలేజీకి వెళ్లేవారికి, విద్యార్థులకు, బైక్ పై వ్యాపారం చేసేవారికి ఈ బైక్ అనుకూలంగా ఉంటుంది.

పైన పేర్కొన్న బైక్ రైడర్లు ఈ సీఎన్‌జీ బైక్‌తో నెలకు 1500 వరకు సులభంగా ఆదా చేయవచ్చనే మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ బైక్ ఆన్ పేపర్‌లో అధునాతన ఫీచర్లు, మంచి మైలేజీ విషయాలు ఉన్నా ఈ బైక్ సుదూర ప్రయాణాలకు అనువుగా ఉంటుందా లేదా అనే సందేహాలు ప్రజల్లో పెరిగాయి. దీనికి ప్రధాన కారణం తక్కువ కెపాసిటీలో ట్యాంక్‌లు ఉండటమే.
ఇందులోని 2 లీటర్ల పెట్రోల్, 2 కిలోల సీఎన్‌జీలు కలిపి మొత్తం 330 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని బజాజ్ పేర్కొంది. సీఎన్‌జీ లీటరుకు 200 కిలోమీటర్లు, పెట్రోల్ 130 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ధృవీకరించింది. అయితే ఈ బైక్‌పై ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ బైక్ ఇబ్బందిగా ఉంటుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ బైక్‌పై ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చు.

అయితే భారత్‌లో సీఎన్‌జీ స్టేషన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ బైక్ 2 కిలోల సీఎన్‌జీ 2 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఉపయోగించగలదు. సీఎన్‌జీ అయిపోయిన తర్వాత, బైక్ పెట్రోల్‌తో 130 కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయాణించగలదు. మార్కెట్‌లో ఉన్న ఇతర బజాజ్ మోటార్ సైకిళ్లు 11-15 లీటర్ల ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉన్నాయి.
ఇతర బైక్‌లు ఫుల్ ట్యాంక్‌పై 500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. దీంతో ఎటువంటి భయం లేకుండా ప్రయాణించవచ్చు. ఇక ఫ్రీడమ్ 125 బైక్‌లతో పోల్చితే 370 కిలోమీటర్లు మాత్రమే తక్కువగా ప్రయాణించగలదు. అయితే ఇది పెద్ద సమస్యగా ఉండదు. సదూర ప్రాంతాలకు సైతం ఈ బైక్‌పై సులభంగా ప్రయాణించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మిగతా బైక్‌ల మాదిరిగానే ఇది కూడా లాంగ్ జర్నీకి అనువుగా ఉండనుంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 స్కూటర్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. పెట్రోల్, సీఎన్‌జీ రెండింటితో నడిచేలా దీన్ని రూపొందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 9.5bhp పవర్ మరియు 9.7nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సీఎన్‌జీ సిలిండర్ లొకేషన్ కనిపించకుండా బైక్‌ని చాలా బాగా డిజైన్ చేశారు. ఇందులోని సీటు ఈ బైక్‌కి ప్రత్యేకత అని చెప్పవచ్చు దీనిపై నలుగురు సైతం పట్టేలా పొడవాటి సీటుని అందించారు.
ఇక లాంగ్ జర్నీలో ఇద్దరు వ్యక్తులు ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఈ బైక్ ఎల్ఈడీ హెడ్ లైట్లతో వస్తుంది. ఈ బైక్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసే ముందు దాదాపు 11 సేఫ్టీ టెస్టులు చేశారు. అన్ని టెస్టుల్లోనూ ఇది పాస్ అయ్యింది. ఈ బైక్ ధర రూ. 95,000 నుంచి రూ. 1,10,000 ల మధ్య ఉంది. సామాన్యులకు అందుబాటు ధరలో ఈ బైక్ అందుబాటులో ఉండటం కలిసి వచ్చే అశం.


Click it and Unblock the Notifications








