తక్కువ ధరలో కొత్త స్కూటర్ కొనే సమయం వచ్చిందోచ్.. వెస్పాపై బంపర్ ఆఫర్ ఇస్తున్న కంపెనీ
ఇటాలియన్ బ్రాండ్‌కు చెందినటువంటి పియాజియో (Piaggio) ఇండియా మార్కెట్లో బాగా పరిచయం ఉన్న కంపెనీ. ప్రపంచ టూవీలర్లలో ప్రీమియం విభాగంలో ఈ కంపెనీ వాహనాలకు మంచి గుర్తింపు ఉంటుంది. దేశంలోని నగరాలు, పట్టణాల్లో పియాజియో స్కూటర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి చూడటానికి ఆధునిక డిజైన్‌తో కనిపిస్తాయి. అయితే ఈ కంపెనీ గురించి ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, 2024 ఏడాదికి ఘనంగా ముగింపు పలకడానికి ప్రపంచం మొత్తం కూడా సిద్ధమవుతున్న తరుణంలో దేశంలోని ఆటోమొబైల్ పరిశ్రమలో వివిధ వాహన తయారీ కంపెనీలు తమ పాత స్టాక్‌ను తగ్గించుకోడానికి ఈ డిసెంబర్ నెలలో ఇయర్ ఎండ్ సేల్‌ను అందిస్తుండగా, తాజాగా పియాజియో కూడా ఇదే విధమైన తగ్గింపులను ఆఫర్ చేస్తుంది. తన అన్ని టూవీలర్లపై డిస్కౌంట్స్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది.
కంపెనీ ప్రత్యర్థులకు ధీటుగా వినియోగదారులను ఆకట్టుకోడానికి ఈ ఇటలీ కంపెనీ పియాజియో తన ఫెవరేట్ టూవీలర్లపై ఈ డిసెంబర్ నెలలో తగ్గింపును ఇస్తుంది. వినియోగదారులు డిసెంబరు 25, 2024 వరకు వీటిని కొనుగోలు చేసినట్లయితే ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఇయర్ ఎండ్ సేల్ కాబట్టి ఈ నెల మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ గమనించవలసిన మరో విషయం ఉంది.

పియాజియో తన అన్ని టూవీలర్లపై తగ్గింపులను ఇస్తున్నట్లు ప్రకటించగా, ప్రత్యేకంగా వెస్పా (Vespa), ఏప్రిలియా (Aprilia)పై రూ.13,000 వరకు విలువైన ప్రయోజనాలను కస్టమర్ల కోసం రిజర్వ్ చేసినట్లు వెల్లడించింది. ఈ రెండు కూడా ఇండియాలో మంచి ఆదరణ కలిగినవే. క్లాసిక్ స్టైల్‌తో వెస్పా కస్టమర్లను ఆకట్టుకుంది. ఏప్రిలియా స్పోర్టీ స్కూటర్లలో ఎక్కువ మంది వినియోగదారులకు చేరవ అయింది.
ఈ ఇటాలియన్ మోడళ్లు 2012లో మార్కెట్లోకి లాంచ్ అయి సరికొత్త అమ్మకాలను నమోదు చేస్తూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి తక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వీటి ధరలు కూడా ఇతర కంపెనీల కంటే ఎక్కువగా ఉంటాయి. కంపెనీ ప్రస్తుతం అందిస్తున్న ఆఫర్ దేశవ్యాప్తంగా పియాజియో అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. కంపెనీ ఏ విధంగా తగ్గింపు ప్రయోజనాలు ఇస్తుందో కచ్చితంగా వెల్లడించలేదు.

పూర్తి వివరాల కోసం డీలర్లను సంప్రదించడం ఉత్తమం. సమాచారం ప్రకారం, ఈ తగ్గింపులో ఎక్స్ఛేంజ్ బోనస్‌లు,క్యాష్ డిస్కౌంట్లు, ఇన్సూరెన్స్ ఆఫర్, ఉచిత యాక్ససరీలు వంటివి ఉంటాయి. అలాగే, కొత్త స్కూటర్ కొనుగోలు చేసే వినియోగదారుల సౌలభ్యం కోసం అనేక ఫైనాన్స్ సదుపాయాలను కూడా కంపెనీ తన డీలర్ల ద్వారా అందిస్తున్నట్లు సమాచారం. తగ్గింపులు ఎంచుకున్న వేరియంట్, మోడల్‌ను బట్టి మారుతాయి. ఈ విషయాన్ని కస్టమర్లు గుర్తుంచుకోవాలి.
వెస్పా స్కూటర్ల విషయానికి వస్తే, క్లాసిక్ SXL, VXL, ZX, SXL స్పోర్ట్స్, వెస్పా డ్యూయల్, రేసింగ్ సిక్స్టీస్ వంటి 125సీసీ, 150సీసీ లను వినియోగారులు ఆ ఆఫర్ పొందవచ్చు. ప్రస్తుతం ఇది రూ.1.15 లక్షల నుంచి రూ.1.49 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు లభిస్తుంది. ఇవి ఆధునిక డిజైన్‌తో ఉంటాయి.
అదే ఏప్రిలియా SR 125,, SR స్టార్మ్ 125, SXR 125, SR 160 వంటివి అమ్మకానికి ఉన్నాయి. ఎప్రిలియా స్కూటర్ల ప్రారంభ ధర రూ. 1.15 లక్షల నుండి రూ. 1.43 లక్షల మధ్య ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఈ స్కూటర్లు అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంటాాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








