170 కి.మీ రేంజ్‌తో IVOOMi JeetX ZE ఇ స్కూటర్ లాంచ్.. ధర రూ. 79,999 మాత్రమే

భారత మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. ప్రముఖ స్టార్టప్ iVOOMi మరో ఇ స్కూటర్‌ను మార్కెట్లోకి పరిచయం చేసింది. JeetX ZE పేరుతో విడుదలైన ఈ స్కూటర్‌ను సంస్థ మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ధర, రేంజ్ పూర్తి వివరాలు ఈ కథనంలో..

భారత్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దిశగా అడుగులు వేస్తోంది. సాంప్రదాయక వాహనాలకు ప్రత్యామ్నాయంగా కస్టమర్లు వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో నిత్యం ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలవుతున్నాయి. స్టార్టప్ కంపెనీలతో పాటు ప్రముఖ ఆటో కంపెనీలు సైతం ఈ రంగంలో సత్తా చాటుతున్నాయి.

IVOOMi-JeetX-ZE-E-Scooter-Launch

ఈ క్రమంలో ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్న స్టార్టప్ iVOOMi.. మరో E Scooter ను లాంచ్ చేసింది. మూడు వేరియంట్లలో JeetX ZE ని విడుదల చేసింది. ఇవి మూడు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంటాయి. ఒకటి 2.1 kwh, 2.5 kwh, 3 kwh బ్యాటరీ ప్యాక్‌లలో కొనుగోలు చేయవచ్చు.

ధర విషయానికొస్తే రూ. 79,999 ప్రారంభ ధరతో సంస్థ విడుదల చేసింది. కాగా లాంచ్‌కు ముందు iVOOMi JeetX ZE ని దేశంలో విస్తృతంగా పరీక్షించింది. 18 నెలల పాటు టెస్ట్ రైడ్ చేయగా.. 100 కి.మీ కి మించి ఎక్కువ పరీక్షలు చేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ స్కూటర్ JeetX కి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ స్కూటర్‌ను సంస్థ మూడేళ్ల క్రితమే ప్రారంభించింది.

ఇక iVOOMi JeetX ZE ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జ్‌పై 170 కి.మీ లాంగ్ రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. దీని Gen 3 బ్యాటరీ ప్యాక్‌ని భారత్‌లో రూపొందించినట్లు పేర్కొంది. ఇందులో 7KW ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. అంతే కాకుండా ఇది పాత వెర్షన్ స్కూటర్‌తో పోలిస్తే.. 20 శాతం తెేలికగా ఉండటంతో పాటు ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది.

ఇంకా JeetX ZE ఎలక్ట్రిక్ స్కూటర్లో స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. దీనిని సులభంగా తొలగించవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా ఇందులోని పోర్టబుల్ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ కూడా త్వరగా, సులభంగా పూర్తవుతుందని స్పష్టం చేసింది. ఇంకా ఈ స్కూటర్లో యువ కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా అధునాతన ఫీచర్లను అందించినట్లు తెలిపింది.

ఇక లాంచ్ సందర్భంగా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లను సంస్థ అందిస్తోంది. JeetX ZE ఛాసిస్, బ్యాటరీ, పెయింట్‌పై ఐదేళ్ల వారంటీని అందిస్తున్నట్లు iVOOMi తెలిపింది. ఇలాంటి వారంటీని ఎక్కడా లేదని సంస్థ చెబుతోంది. ఇ మొబిలిటీని ప్రోత్సహించడంలో JeetX ZE కీలక పాత్ర పోషిస్తుందని iVOOMi CEO, Co-Founder అశ్విని భండార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇంకా అదనపు ఆఫర్ల కింద వాటర్ రెసిస్టెన్స్, ERW మెటీరియల్-ఆధారిత ఇంపాక్ట్-రెసిస్టెంట్ బాడీ పార్ట్‌ల కోసం IP67-రేటెడ్ బ్యాటరీతో, JeetX ZE స్కూటర్ సాటిలేని మన్నికను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు కస్టమర్లకు అదనపు ఖర్చు లేకుండా ఏదైనా స్కూటర్ భాగాన్ని వన్-టైమ్ రీప్లేస్‌మెంట్‌ చేసుకునే అవకాశాన్ని కూడా సంస్థ అందిస్తోంది. కాగా వేరియంట్లను బట్టి రేంజ్, ధరలు మారుతుంటాయని కస్టమర్లు గమనించాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 7, 2024, 15:42 [IST]
English summary
Ivoomi launches jeetx ze electric scooter in three variants with 170 km range check full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+