3 ఏళ్ల వారంటీతో కేవలం రూ.54,999 లకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌.. 1,499 నుంచి EMI స్టార్ట్‌!

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఐవూమీ కంపెనీ ఒకటిగా ఉంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సామాన్యులకు అందుబాటు ధరల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడమే పుణెకు చెందిన ఈ సంస్థ ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లో ఉన్న ఐవూమీ ఇప్పుడు S1 లైట్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లాంచ్ చేసింది. ఈ స్కూటర్ కంపెనీ దేశవ్యాప్తంగా ఇప్పటికే 10,000 మందికి పైగా కస్టమర్లను సంపాదించుకుంది. రిమూవబుల్ బ్యాటరీ మరియు 7-లేయర్ సేఫ్టీ వంటి అధునాతన ఫీచర్లతో స్కూటర్లను విడుదల చేస్తూ కస్టమర్లకు ట్రస్టెడ్‌ బ్రాండ్‌గా ఐవూమీ నమ్మకాన్ని అందిస్తుంది. తాజాగా ఆ కంపెనీ విడుదల చేసిన ఐవూమీ ఎస్ 1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

పెట్రోల్ స్కూటర్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక అని కంపెనీ పేర్కొంది. భారీ సేఫ్టీ ఫీచర్లు, మూడేళ్ల వారంటీ, పెద్ద స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌తో ఈ స్కూటర్‌ వస్తుంది. దీనిని పెర్ల్ వైట్, మూన్ గ్రే, రెడ్, బ్లూ, ట్రూ రెడ్, పీకాక్ బ్లూ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం తక్కువ-స్పీడ్‌లో స్కూటర్లను అందిస్తున్న కంపెనీలకు ఈ స్కూటర్‌ గట్టి సవాళ్లను విసురనుంది.

Ivoomi-S1-Electric-Scooter

ఐవూమీ ఎస్ 1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రాఫీన్ అయాన్ మరియు లిథియం అయాన్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.54,999, రూ.64,999గా ఉన్నాయి. ఐవూమీ ఎస్ 1 లైట్ గ్రాఫీన్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్లకు పైగా నడుస్తుందని తయారీదారులు పేర్కొన్నారు. లిథియం-అయాన్ బ్యాటరీ 85 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది.

ఐవూమీ ఎస్ 1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది అధిక పనితీరు మరియు విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. బ్యాటరీ రక్షణ కోసం వాటర్ రెసిస్టెంట్ IP67ను కలిగి ఉంది. ఇందులోని బ్యాటరీ రిమూవబుల్‌. అందువల్ల దీనిని సులభంగా బయటకు తీయడంతో పాటు ఇన్‌సర్ట్ చేయవచ్చు. గ్రాఫీన్ వేరియంట్ గంటకు 45 కి.మీ, లిథియం వేరియంట్ గంటకు 55 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.

Ivoomi-S1-Lite-Electric-Scooter

గ్రాఫీన్ వేరియంట్ మూడు గంటల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. లిథియం వేరియంట్ మూడు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. మన్నిక మరియు స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఐవూమీ ఎస్ 1 లైట్ ERW1 గ్రేడ్ ఛాసిస్‌పై నిర్మించబడింది. ఇది వివిధ రకాల భూభాగాలకు అనుగుణంగా 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. బూట్ కెపాసిటీ 18 లీటర్లుగా ఉంది.

వివిధ భూభాగాలు మరియు ప్రయాణీకుల ప్రాధాన్యతలకు అనుగుణంగా 12-అంగుళాల మరియు 10-అంగుళాల పరిమాణాలలో చక్రాలను అందించింది. ఫీచర్ల విషయానికి వస్తే ఈవీ మొబైల్ ఛార్జింగ్ కోసం USB పోర్ట్‌ ఉంది. ఇందులో ఎల్ఈడీ డిస్ప్లే స్పీడోమీటర్ కూడా ఉంది. ఐవూమీ ఎస్ 1 లైట్ ప్రయాణికుల భద్రత కోసం 7-లేయర్ సేఫ్టీ ఫీచర్లను కలిగి అందించింది.

Ivoomi-S1-Lite

రోజుకు సగటున 10-15 కిలోమీటర్లు ప్రయాణించే కమ్యూనిటీ డ్రైవింగ్‌కి, 25-35 కిలోమీటర్లు ప్రయాణించే సిటీ రైడర్లకు ఈ స్కూటర్‌ అనువైనదని ఇవూమీ తెలిపింది. ఈవీ కొనుగోలును సులభతరం చేయడానికి ఐవూమీ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. రూ.1,499 నుంచి ఈఎంఐ స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కూటర్‌ గ్రాఫీన్‌ బ్యాటరీపై 18 నెలలు, లిథియం అయాన్‌ బ్యాటరీపై 3 సంవత్సరాల వారంటీని అందిస్తుంది. పలు రాష్ట్రాల్లో డీలర్‌షిప్‌ని కూడా కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 26, 2024, 19:22 [IST]
English summary
Ivoomi launches most economical scooter s1 lite at rs 54999 full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+