180 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదల.. 3 ఏళ్ల వారంటీ, స్మార్ట్‌ ఫీచర్లు ఇంకా మరెన్నో!

దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలనకు పెరుగుతున్న ఆదరణతో చాలా వరకు కొత్త స్టార్టప్ కంపెనీలు ఈ విభాగంలోకి అడుగుపెడుతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌లో ఓలా (Ola Electric Scooters) దూసుకెళ్తున్నాయి. ఆ తర్వాత టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌, బజాజ్‌ చేతక్‌, ఏథర్‌ ఎనర్జీ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు పోటీగా అంతే మొత్తంలో చిన్న స్టార్టప్ బ్రాండ్స్‌ సైతం అద్భుతంగా రాణిస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ సేల్స్‌లో కొన్ని బేబీ బ్రాండ్లు సంచలనం సృష్టిస్తున్నాయి. వాటిలో ఒకటి ఐవూమి (iVoomi Scooters)గా ఉంది. ఈ కంపెనీ సరసమైన ధరలకు అధిక నాణ్యత కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో విడుదల చేస్తుంది.

సరసమైన ధరలో ఎలక్ట్రిక్ టూవీలర్స్‌లోకి మారాలనుకునే వారికి ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ అందిచే స్కూటర్లు బెస్ట్‌ అని చెప్పవచ్చు. తాజాగా తక్కువ ధరలో మరో ఐవూమీ కొత్త ఈవీని లాంచ్ చేసింది. ఐవూమీ ఎస్1 లైట్ వేరియంట్ (iVoom S1 Lite) పేరుతో ఓ స్కూటర్‌ని ప్రవేశపెట్టింది. దీని ధర కేవలం రూ.84,999 (ఎక్స్-షోరూమ్) మాత్రమే కావడం గమనార్హం.

iVoomi S1 Lite Price

ఈ స్కూటర్‌ ధర ఓలా ఎంట్రీ లెవల్‌ స్కూటర్స్‌తో గట్టి పోటీని ఇస్తుంది. ఈ ఐవూమీ S 1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల భారీ రేంజ్‌ని అందిస్తుంది. ఈ రేంజ్‌ ప్రస్తుతం ఈ ధరలో అందుబాటులో ఉన్న స్కూటర్లతో పోల్చితే చాలా ఎక్కువ. మార్కెట్‌లో మంచి రేంజ్‌, హై రేంజ్‌ ఫీచర్లు అందించే జాబితాలో ఈ స్కూటర్‌ నిలువనుంది.

ఇక ఈ స్కూటర్‌ని ప్రస్తుతానికి ఐవూమీ డీలర్‌షిప్స్‌లో బుక్‌ చేసుకోవచ్చు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్ వంటి ప్రధాన రాష్ట్రాలతో దీనికి ఎక్కువ మార్కెటింగ్‌ని కలిగి ఉంది. అయితే ఈ స్కూటర్‌ ధరను మీరు ఒకేసారి చెల్లించలేకపోతే, ఈఎంఐ ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. కంపెనీ ప్రత్యేక ఫైనాన్స్‌ స్కీమ్‌ ద్వారా ఈ ఆఫర్‌ని అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వివిధ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది.

iVoomi S1 Lite Electric Scooter Range

ఎలక్ట్రిక్‌ స్కూటర్లలోనే మంచి మన్నిక, సౌకర్యం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకే కప్పు కిందకు వచ్చేలా ఐవూమీ ఎస్ 1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసుకువచ్చింది. ఈ కొత్త ఐవూమీ ఎస్ 1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. ఇది వివిధ భూభాగాల్లో సులభంగా ప్రయాణిస్తుంది. ఇక ఇందులోని 18 లీటర్ల బూట్ స్పేస్‌ అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది.

ఈ బైక్‌పై నిత్యావసరాల రవాణాను సులభంగా తీసుకెళ్లవచ్చు. వివిధ ప్రాధాన్యతలను బట్టి ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 12 అంగుళాల లేదా 10 అంగుళాల చక్రాల ఆప్షన్స్‌ని ఎంచుకోవచ్చు. కొత్త ఐవూమీ ఎస్ 1 లైట్ స్కూటర్‌లో USB ఛార్జింగ్ పోర్ట్ (5V, 1 A), సులభమైన స్పీడ్ ట్రాకింగ్ కోసం LED డిస్ప్లే స్పీడోమీటర్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

iVoomi S1 Lite Electric Scooter Launch

ఈ ఐవూమీ ఎలక్ట్రిక్ స్కూటర్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఇందులో 7-స్టెప్స్‌ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మరిన్ని ఫీచర్లు కావాలనుకునే వారు రూ.4,999కే స్మార్ట్ ఫీచర్ అప్ గ్రేడ్ పొందవచ్చు. వీటిలో ఇండికేటర్, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్ ఉన్నాయి. ఈ యాడింగ్స్‌ మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందించనున్నాయి. ఇది రోజువారీ ప్రయాణికులకు సౌకర్యం, భద్రతను అందిస్తాయి.

ఈ కొత్త ఐవూమీ ఎస్ 1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్ ద్వారా అలర్ట్స్‌, సర్వీస్ రిమైండర్లను అందిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహనం విశ్వసనీయత, పనితీరు కోసం ప్రత్యేకంగా రూపొందించిన అధునాతన బ్యాటరీ టెక్నాలజీతో వస్తుంది. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లోకి మారాలని భావిస్తే ఇది మీకు ఫర్‌ఫెక్ట్‌ స్కూటర్‌గా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 1, 2024, 18:04 [IST]
English summary
Ivoomi s1 lite e scooter launched at rs 84999 with 180 km range in single charge
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+