జపాన్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లపై యూత్‌ క్రేజ్‌.. ఆ బైక్‌ కనిపిస్తే అలాగే చూస్తుండిపోతారట.!!

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లంటే యువతకు చాలా క్రేజ్‌.. తరాలుగా ఈ కంపెనీ మోడల్‌ బైక్‌లు యూత్‌ను అలరిస్తున్నాయి. ప్రధానంగా దాని ఇంజిన్‌ సౌండ్‌.. టూ వీలర్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. క్లాసిక్‌, హిమాలయన్‌, బుల్లెట్‌ బైక్‌లు భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే మన దేశంలోనే కాదు.. జపాన్‌లో కూడా ఈ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అంటే పడి చస్తున్నారు.

భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ చాలా కాలంగా సందడి చేస్తోంది. ఇటీవలి కాలంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌, కొత్త బైక్‌ల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో కంపెనీ బ్రాండ్‌ విలువ మరింతగా పెరిగి ఉన్నత స్థాయికి వెళ్తోంది. అయితే ఇప్పుడు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఖ్యాతి విదేశాలకు కూడా వ్యాపించింది. అక్కడ కూడా ఈ కంపెనీ బైక్‌లకు అభిమానులు ఉన్నారు.

Royal-Enfield-Classic-350

దేశీయ మార్కెట్‌లోనే కాకుండా జపాన్‌(Japan Royal Enfield) సహా ఇతర దేశాల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు విక్రయానికి అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కంపెనీ బైక్‌లను జపాన్‌ విద్యార్థులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అజయ్ పాండే అనే యూట్యూబర్ ఈ వీడియోను తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) బైక్ గురించి అడిగిన ప్రశ్నలకు జపాన్ విద్యార్థుల పాజిటివ్‌ రెస్పాన్స్‌ను వీడియోలో చూడవచ్చు. అంతే కాదు జపాన్‌లో బైక్ రైడింగ్ కల్చర్ గురించి కూడా వివరించారు.

Royal-Enfield-Classic-350

అయితే భారత రోడ్లపై కనిపించినంతగా జపాన్‌ రోడ్లపై రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లను చూడలేము. చాలా అరుదుగా ఈ బైక్‌లు కనిపిస్తాయి. కానీ జపాన్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ షోరూమ్‌ను వీడియోలో చూడవచ్చు. భారత్‌లో అందుబాటులో ఉన్న అన్ని మోడల్స్‌ను.. జపాన్‌లో కూడా విక్రయిస్తున్నారు.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ల గురించి జపాన్‌ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు. ఈ బైక్స్‌ గురించి అన్నీ పాజిటివ్‌గానే విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా జపాన్‌లో ఏ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు ధర, డిమాండ్‌ ఎక్కువగా ఉంది అని అడిగిన ప్రశ్నకు.. క్లాసిక్ 350(Classic 350) అని సమాధానమిచ్చారు. జపాన్‌లో ఈ బైక్‌ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్.

Royal-Enfield-Classic-350

జపాన్‌లో క్లాసిక్ 350 బైక్ ధర దాదాపు రూ. లక్షలు. అదేవిధంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన మరో ప్రముఖ మోడల్ కాంటినెంటల్ జీటీ(Continental GT 650) 650 బైక్‌కు డిమాండ్‌ బాగానే ఉంది. అక్కడ ఈ బైక్‌ ధర మన భారత కరెన్సీలో రూ. 6.5 లక్షలు. జపాన్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు పెద్దగా కనిపించవు కాబట్టి, ఆ బైక్‌లను చూసినప్పుడల్లా వారిలో ఎగ్జైట్‌మెంట్‌ కనిపిస్తోంది.

అయితే జపాన్‌లో స్వదేశీ కంపెనీ హోండాకు చెందిన సీబీ350(Honda CB 350). అక్కడి విద్యార్థులతో మాట్లాడినప్పుడు, జపాన్‌లో హోండా సీబీ 350 బైక్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న చాలా మంది కూడా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బైక్‌లను చూసిన వెంటనే తమ అభిప్రాయాలను మార్చుకున్నట్లు చెబుతున్నారు.

Royal-Enfield-Classic-350

ఇందుకు ప్రధాన కారణం ఈ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ లుక్. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల రెట్రో డిజైన్‌ను చాలా మంది ఇష్టపడటం విశేషం. ఏదేమైనా భారత్‌కు చెందిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లకు విదేశాల్లో కూడా ఇక్కడ ఉన్నంత మాదిరి క్రేజ్‌ ఉండటం ఆ కంపెనీకి, దేశీయ ఆటోమోటివ్‌ రంగానికి గర్వకారణం.

More from DriveSpark

Article Published On: Friday, January 5, 2024, 13:17 [IST]
English summary
Japanese students interest on royal enfield bikes and share their positive thoughts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+