Jawa 42FJ జావా మోటార్‌సైకిల్స్‌ నుంచి కొత్త బైక్‌ లాంచ్‌.. రెట్రో లుక్‌, అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే?

దేశంలో రెట్రో క్లాసిక్ మోటార్ సైకిళ్లకు డిమాండ్‌ పెరుగుతుంది. ఈ సెగ్మెంట్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి ప్రత్యర్థి ఏదైనా ఉంటే అది క్లాసిక్ లెజెండ్స్ అనే చెప్పాలి. మహీంద్రా యాజమాన్యంలోని జావా, BSA మోటార్స్‌ ఇప్పుడు భారత్‌లో టాప్‌లో కొనసాగుతున్నాయి. ఈ రెండు సంస్థలు మార్కెట్‌లో కొత్త బైకులను విడుదల చేస్తూ ఎన్‌ఫీల్డ్‌కి షాక్‌ల మీద షాక్స్‌ ఇస్తున్నాయి. ప్రస్తుతం ఈ బైక్స్‌ యూత్‌లో ట్రెండ్‌గా మారింది. మిడ్ కెపాసిటీ బైక్ సెగ్మెంట్‌లో జావా కలర్‌ ఫుల్ బైక్స్‌ని విడుదల చేస్తుంది. జావా తన 350 సీసీ సెగ్మెంట్‌ని మరింత ఆకర్షణీయంగా ప్రవేశపెడుతుంది.

తాజాగా ఈ కంపెనీ జావా 42 సిరీస్‌లో కొత్త మోడల్‌ని విడుదల చేసింది. 42FJ పేరుతో ఈ మోడ్రన్ క్లాసిక్‌ బైక్‌ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త జావా 42 FJ వేరియంట్ ధర రూ .1.99 లక్షల నుంచి రూ .2.20 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉంది. స్టాండర్డ్ 42 వేరియంట్ల కంటే ఈ బైక్‌ ధర సుమారు రూ.26,000 ఎక్కువ.

Jawa 42FJ Motorcycle

కొత్త 42 FJ మోడల్ 334 సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కొత్త ఇంజిన్ 29.1 bhp పవర్ వద్ద 29.6 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఇంజిన్ స్లిప్, అసిస్ట్ క్లచ్‌ 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. జావా 42 790 మిమీ సీటు ఎత్తు, 178 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 184 కిలోల బరువుని కలిగి ఉంటుంది.

ఇది స్టాండర్డ్ జావా 42 మోడల్ కంటే 2 కిలోలు ఎక్కువ బరువు ఉంటుంది. అయితే ఈ బైక్ పనితీరులో ఎక్కడా రాజీ పడకుండా రూపొందించారు. స్టైలింగ్ పరంగా ఈ బైక్‌ మోడ్రన్ రెట్రో మోటార్ సైకిల్ ప్రస్తుత 42 మోడల్‌ని పోలి ఉంటుంది. అయితే దీనిని కొంచెం స్పోర్టియర్‌ లుక్‌లో మార్పు చేశారు. ఇందులో ఫ్యూయల్ ట్యాంక్‌లో బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్, కొత్త LED హెడ్‌ల్యాంప్‌ని ఏర్పాటు చేశారు.

Jawa 42FJ Motorcycle launched in India

స్పోక్ వీల్ లేదా అల్లాయ్ వీల్ సెటప్‌లో వినియోగదారులు జావా 42 FJని ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులో అల్లాయ్ వీల్స్ 42 బాబర్‌లో కనిపించే వాటిని పోలి ఉంటాయి. బ్లాక్ ఇంజిన్, ఎగ్జాస్ట్ పైప్స్‌ వంటి డిజైన్లు బైక్‌కి స్పోర్టీ లుక్‌ని అందిస్తాయి. ఇక ఫీచర్ల విషయానికొస్తే జావా 42 FJ మోడల్ LED లైట్స్‌, బ్లూటూత్ కనెక్టివిటీతో సింగిల్-పాడ్ ఇన్‌స్ట్రూమెంట్‌ క్లస్టర్‌ని కలిగి ఉంటుంది.

ఇందులోని కనెట్టివిటీతో ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్‌తో పాటు ఇతర సమాచారాన్ని డిస్ప్లే చేయనుంది. జావా బైక్ స్టీల్ ఛాసిస్‌పై నిర్మించబడింది. సస్పెన్షన్ కోసం ముందు భాగంలో 41 MM టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. బ్రేకింగ్‌ సిస్టమ్‌ కోసం ముందు భాగంలో 320 MMడిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ స్టాడర్డ్‌గా వస్తుంది.

Jawa 42FJ Motorcycle launched in India

ఈ ఆధునిక రెట్రో మోటార్ సైకిల్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌ని స్టాండర్డ్‌గా అందిస్తుండటంతో రైడర్‌కి సేఫ్టీ ఎక్కువ లభించనుంది. ఈ బైక్‌ మార్కెట్‌లోని రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్ 350, టీవీఎస్ రోనిన్, రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 వంటి మోడళ్లకు పోటీగా జావా 42 FJ మోడల్ గట్టి పోటీని ఇస్తుంది. రానున్న రోజుల్లో మార్కెట్‌లో ఇది ఏమేరకు కస్టమర్లను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇక క్లాసిక్ లెజెండ్స్ కొత్త జావా 42FJ మోటార్ సైకిల్ కోసం బుకింగ్స్‌ ఆరంభం అయ్యాయి. త్వరలోనే డెలివరీ ప్రారంభిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. భారతదేశంలో రెట్రో క్లాసిక్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఆధిపత్యానికి ముగింపు పలకడానికి ప్రధాన ప్రత్యర్థులలో ఒకటిగా ఉన్న జావా మోటార్స్‌ ఆ కంపెనీకి గట్టి సవాళ్లను విసురుతోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 3, 2024, 18:12 [IST]
English summary
Jawa 42 fj motorcycle launched in india at rs 1 99 lakhs check all details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+