సరికొత్త లుక్‌లో జావా యెజ్డీ 350 బైక్స్.. ప్రారంభ ధర కేవలం రూ. 1.99 లక్షలు మాత్రమే
జావా యెజ్డీ భారత్‌లో తన మార్కెట్‌ని విస్తరిస్తోంది. యూత్‌ని టార్గెట్ చేస్తూ ఆ కంపెనీ విడుదల చేస్తున్న బైక్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో లభించే ఉత్తమ మోటార్ సైకిల్ తయారీదారులలో ఈ కంపెనీ ఒకటిగా ఎదిగింది. ఈ కంపెనీ లోని 350 లైనప్ బైక్స్ దేశంలో మంచి డిమాండ్‌ని కలిగి ఉన్నాయి. వీటికి కొనసాగింపుగా 350 బైక్ లైనప్‌ని విస్తరించాలని కంపెనీ నిర్ణయించింది. అందులో భాగంగానే తాజాగా ఆ కంపెనీ అప్‌డేటెడ్ అల్లాయ్ వీల్స్, స్పోక్ వీల్స్‌తో సరికొత్త Jawa 350 రేంజ్ బైక్ వేరియంట్స్‌ని విడుదల చేసింది. ఈ బైక్ వేరియంట్స్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఈ బైక్‌ని నాలుగు కలర్ వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ.1.99 లక్షలు నుంచి రూ.2.23 లక్షల మధ్య ఉంది. ముందుగా జావా యెజ్డీ 350 లైనప్ బేస్ వేరియంట్ రూ .1,98,950 ధరతో విడుదల చేసింది. ఇందులో స్పోర్క్ వీల్స్ అమర్చారు. ఇది మూడు కొత్త కలర్ ఆప్షన్లతో వస్తుంది. అవి ఒబ్సిడియన్ బ్లాక్, డీప్ ఫారెస్ట్, గ్రే కలర్స్‌లో అందుబాటులోకి ఉంటుంది.

మరో బైక్‌లో అల్లాయ్ వీల్స్‌ని అందించారు. ఈ వేరియంట్ ధరను రూ.2,08,950గా నిర్ణయించారు. ఇది కూడా పైన తెలిపిన కలర్స్ స్కీమ్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక జావా 350 క్రోమ్ స్పోక్ వీల్స్ వేరియంట్ ధర రూ.2,14,950గా ఉంది. ఇందులో నాలుగు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ బైక్ మెరూన్, బ్లాక్, మిస్టాగ్, ఆరెంజ్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇక హై ఎండ్ క్రోమ్ వేరియంట్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. దీని ధర రూ.2,23,950గా ఉంది (పైన తెలిపినవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలే). ఈ బైక్ కూడా అదే నాలుగు కలర్ ఆప్షన్‌లో వస్తుంది. కొత్తగా ఈ బైక్‌ని వైట్ కలర్ తీసుకువచ్చారు. కొంతమంది కస్టమర్ల అభిరుచి కోసం దీనిని పరిచయం చేశారు. రైడర్ల అనుభూతికి తగినట్లుగా బైక్స్‌ని ఆ సంస్థ ప్రవేశ పెట్టింది.

ఈ మోటార్ సైకిల్ 334 సిసి లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 22.2bhp పవర్ మరియు 28nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ముందు భాగంలో 35 mm సస్పెన్షన్ సెటప్‌ని కలిగి ఉంది. వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లను అమర్చారు. దీంతో క్లిష్టమైన రోడ్లపై ప్రయాణించడం సులువవుతుంది.
ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 178 మి.మీ. సీటు ఎత్తు 802 మి.మీగా ఉంది. నియో-రెట్రో బైక్ ముందు భాగంలో 18 అంగుళాల చక్రాలతో నడుస్తుంది. ఇది వెనుక భాగంలో 17 అంగుళాల చక్రంతో నడుస్తుంది. టైర్లు ముందు భాగంలో 100/90-18 మరియు వెనుక భాగంలో 130/80-17 ఉన్నాయి. దీనికి MRF సాపర్ టైర్లుగా అందించారు.

ఇక ఈ బైక్ బ్రేకుల విషయానికొస్తే ఫైబర్ గ్లాస్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు భాగంలో 220 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ఈ బైక్స్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్ కూడా ఉంది. అందువలన, ఈ బైక్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ కూడా మెరుగ్గా ఉండేలా రూపొందించబడింది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








