జావా యెజ్డీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. కొత్త కలర్‌ ఆప్షన్‌లో Perak బైక్‌ లాంచ్‌

భారత మార్కెట్లో జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్‌(Jawa Yezdi Motorcycles)కు ప్రత్యేక క్రేజ్‌ ఉంటుంది. 1970, 80 వ దశకాల్లో జావా బైక్‌ల అంటే ఇష్టపడని వారుండరు. అప్పట్లో మార్కెట్లో హవా సృష్టించిన జావా యెజ్డీ.. కొన్నేళ్ల క్రితం దేశంలో మళ్లీ బైక్‌లను తయారు చేయడం మొదలు పెట్టింది. తాజాగా తన ప్రముఖ మోడల్‌ బైక్‌ అప్‌డేట్లను తీసుకొచ్చింది.

జావా యెజ్డీ బైకుల్లో జావా పెరాక్ ఒకటి. ఈ పక్కా బాబర్ టైప్ బైక్ కేవలం సింగిల్ సీటుతో మార్కెట్లోకి విడుదలైంది. పెరాక్‌ డిజైన్ మరియు స్టైలింగ్‌ (Jawa Perak), పర్ఫామెన్స్‌తో భారత్‌లో యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు యువకులకు రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు.. జావా పెరాక్ యొక్క డ్యూయల్ టోన్ మోడల్‌ను విడుదల చేసింది.

Jawa-Yezdi-Perak-With-New-Colour-Scheme

జావా ఇప్పుడు రెడ్ అండ్ వైట్ కలర్ ట్యాంక్‌తో వచ్చే జావా పెరాక్‌ మోడల్‌ను లాంచ్ చేసింది. ఈ మోడల్ ధర విషయానికి వస్తే, జావా 42 బాబర్ - జాస్పర్ రెడ్ డ్యూయల్ టోన్ స్పోక్ వీల్ కలర్ ఆప్షన్ ధర దాదాపు రూ. 2,15,187(ఎక్స్-షోరూమ్) గా ఉంది.

అదేవిధంగా, జావా పెరాక్‌(Jawa Perak) అల్లాయ్ వీల్ ఆప్షన్‌లో జావా 42 బాబర్ - జాస్పర్ రెడ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్ వేరియంట్ ధర రూ. 2,19,950 ఎక్స్-షోరూమ్ గా ఉంది. ఈ జావా పెరాక్ అసలు పెరాక్ బైక్ నుంచి దాని స్టైలింగ్‌ను తీసుకుంది. జావా పెరాక్ అసలు బైక్ 1946లో మార్కెట్లోకి విడుదలైంది.

Jawa-Yezdi-Perak-With-New-Colour-Scheme

ఈ బైక్ దాని రెట్రో డిజైన్‌ను ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా ప్రస్తుత తరం బైక్‌లో తీసుకువచ్చింది. ఇంజిన్‌ విషయానికొస్తే జావా పెరాక్ బైక్‌లో 334 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 29.9 PS మరియు 30 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

అప్‌డేటెడ్‌ జావా పెరాక్ బైక్ సింగిల్ కలర్‌ ఆప్షన్‌లో లభిస్తుంది. ఈ బైక్‌ను మాట్టే బ్లాక్ పెయింట్ స్కీమ్ ఫినిష్‌ స్కీమ్‌ మరియు కాంట్రాస్ట్ బ్రౌన్ సీట్లతో అందుబాటులో ఉంది. ఇప్పుడు లైన్‌కి డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ జోడించబడింది. బైక్ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఈ జావా పెరాక్ బైక్ సింగిల్ కలర్‌లో లభిస్తుంది.

Jawa-Yezdi-Perak-With-New-Colour-Scheme

ఇది మట్టే బ్లాక్ పెయింట్ స్కీమ్ మరియు కాంట్రాస్ట్ బ్రౌన్ సీట్‌లతో లభిస్తుంది. జావా పెరాక్‌ బైక్‌లోని ఫ్లోటింగ్ సీటు దీనికి ప్రత్యేకమైన రూపాన్ని అందిస్తుంది. పొడవైన వీల్‌బేస్ మరియు లో-స్లంగ్ ప్రొఫైల్‌తో ఒక సాధారణ బాబర్-శైలి జావా పెరాక్ బైక్ ఇది.

Jawa-Yezdi-Perak-With-New-Colour-Scheme

అప్‌డేటెడ్‌ జావా పెరాక్‌ బైక్‌ బార్-ఎండ్ రౌండ్ మిర్రర్స్, ఫ్లోటింగ్-స్టైల్ సింగిల్-పీస్ సీట్, అండర్-సీట్ టెయిల్ ల్యాంప్, ఫెండర్లు మరియు డ్యూయల్ స్లాష్-కట్ ఎగ్జాస్ట్‌లను కలిగి ఉంది. ఈ బైక్ బరువు 175 కిలోలుగా ఉంది. ఈ బైక్‌ ఫ్యూయెల్‌ ట్యాంక్‌ కెపాసిటీ 14 లీటర్లు. ఈ జావా పెరాక్ బైక్‌లో 18-17-అంగుళాల స్పోక్ వీల్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ బైక్‌కు ప్రత్యక్ష పోటీ లేదు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 10, 2024, 12:03 [IST]
English summary
Jawa yezdi motorcycles launches the new stealth dual tone perak motorcycles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+