ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కొనేవారికి గుడ్‌న్యూస్‌.. ఆగస్టు బొనాంజా ఆఫర్‌ కింద రూ.20,000 తక్షణ డిస్కౌంట్‌

దేశంలో పండుగ సీజన్ ప్రారంభం అవుతుండటంతో వాహన తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత నెల నుంచే వాహన తయారీ సంస్థలు ఇప్పటికే ఆగస్టులో ఆఫర్లను ప్రకటించాయి. సంప్రదాయ ఇంధన వాహన తయారీ సంస్థలు, ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు కూడా తమ కంపెనీ లైనప్‌లోని వివిధ మోడళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ీ కథనంలో..

భారీ డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాల ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా కంపెనీలు ఆఫర్లను వెల్లడిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులలో ఒకటిగా ఉన్న జితేంద్ర ఈవీ ఆఫర్లను ప్రకటించింది. నాసిక్‌కి చెందిన ఈ కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాల లైనప్‌లో ఆగస్టు బొనాంజా (August Bonanza) పేరుతో కొత్త ఆఫర్‌ని ప్రకటించింది.

Jitendra EV August Bonanza Offers JMT 100 HS

ఈ సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్లను మరింత ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ చేసేందుకు జితేంద్ర ఈవీ క్యాష్‌బ్యాక్‌తో సహా భారీ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఈవీ సంస్థ 2024 ఆగస్టు బొనాంజా ఆఫర్‌ని ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు ఇదే ఆఫర్‌ కొనసాగనుంది. ఈ ఆఫర్‌తో సేల్స్‌ పెంచుకోవాలని ఈ కంపెనీ భావిస్తుంది.

ఇక దీని ఆఫర్ల విషయానికి వస్తే ఈవీ JMT 1000 HS కొనుగోలు చేస్తే రూ.10,000, JMT 1000 3K కొనుగోలు చేస్తే రూ.20,000 ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ పైన పేర్కొన్న రెండు మోడళ్లపై కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్‌ని కూడా అందిస్తోంది. ఆగస్టు 10 నుంచి 26 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

Jitendra EV August Bonanza Offers

కంపెనీ తన లాయల్టీ కస్టమర్లపై కోసం ప్రత్యేక తగ్గింపుని కూడా అందిస్తుంది. ఈ మోడళ్లను కొనుగోలు చేసే పాత కస్టమర్ల కోసం రూ .5,000 అదనపు లాయల్టీ బోనస్‌ని అందిస్తుంది. జితేంద్ర ఈవీకి చెందిన లో-స్పీడ్ లేదా హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పటికే కొనుగోలు చేసిన వినియోగదారులు ఈ బోనస్‌ని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ని పొందేందుకు కొన్ని పత్రాలు తెలియజేస్తే సరిపోతుంది.

ఈ ఆఫర్‌ కోసం మీ వాహనాలకు సంబంధించిన పాత డాక్యుమెంట్లను కచ్చితంగా అందించాలి. ఈవీ హైస్పీడ్ మోడల్ అయితే RC బుక్, లో-స్పీడ్ మోడల్ అయితే సేల్స్ ఇన్వాయిస్ సమర్పించాల్సి ఉంటుంది. లాయల్టీ బోనస్ బ్రాండ్ నమ్మకమైన కస్టమర్లను వారి ఉత్పత్తులను కొనడం కొనసాగించడానికి ప్రేరేపించడం కోసం ఉద్దేశించింది. రెగ్యూలర్‌ కస్టమర్లను సంతృప్తి పరచడం కోసం ఈ గిఫ్ట్‌ని అందించాలని కంపెనీ నిర్ణయించింది.

Jitendra EV August Bonanza Offers

కొత్తగా ఈ ఈవీని కొనుగోలు చేసే వారు క్యాష్‌బ్యాక్ ఆఫర్, ఉచిత ఇన్స్‌రెన్సూ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కంపెనీలో తీసుకురావడానికి కంపెనీ కొన్ని వారాల క్రితం JMT మోడల్‌ని అప్‌గ్రేడ్ చేసింది. ఇది కంపెనీపై కస్టమర్లకు విశ్వసనీయత, ఫర్ఫామెన్స్‌ని ఇతర లాజిస్టిక్స్ అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. JMT 1000 HS స్కూటర్‌ ధర రూ. 92,910 ఎక్స్‌-షోరూమ్ ధర వద్ద అందుబాటులో ఉంది.

దీనిని రూ.82,910లకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో కస్టమైజేషన్‌ బ్యాటరీ ఆప్షన్స్‌, అధునాతన ఫీచర్లను అందిస్తుంది. హై రేంజ్‌ అందించే డ్యూయల్ బ్యాటరీ సెటప్ లేదా సింగిల్ బ్యాటరీ ప్యాక్ కొనుగోలు చేయవచ్చు. LFP బ్యాటరీలతో కూడిన JMT 1000 HS ఫుల్‌ ఛార్జ్‌పై 83 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. హై రేంజ్ కోరుకునే వారికి 3k JMT1000ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 136 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Sunday, August 18, 2024, 13:22 [IST]
English summary
Jitendra ev announced august bonanza offers on its electric scooter lineups check details in telugu
Read more on: #electric vehicles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+