మార్కెట్‌లోకి మరో కొత్త కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ప్రారంభ ధర రూ. 79,999 మాత్రమే
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతో కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో కంపెనీలు పనిచేస్తున్నాయి. అధిక రేంజ్‌తో పాటు మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిచేలా స్టైలిష్ డిజైన్‌లో స్కూటర్లను తయారు చేస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ నుంచి అధునాతన ఫీచర్లతో స్కూటర్ విడుదల చేసింది. ఆ స్కూటర్ వివరాలు మీకోసం..
నాసిక్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ జితేంద్ర ఎలక్ట్రిక్ ప్రిమో సిరీస్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని విడుదల చేసింది. ప్రిమో ఎస్, ప్రిమో ప్లస్ రెండు వేరియంట్లలో ఈ స్కూటర్ లభించనుంది. ఈ స్కూటర్‌లో వచ్చే బ్యాటరీలు రిమూవబుల్ మోడ్‌లో రానున్నాయి. IP67 ప్రొటెక్షన్‌తో స్మార్ట్ BMS (బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్)తో వస్తుంది. ఇతర స్మార్ట్ అప్‌గ్రేడ్‌లను ఈ స్కూటర్‌లో గమనించవచ్చు.

డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ ఇన్స్ట్రుమెంటెడ్ క్లస్టర్, రేంజ్ ప్రిడిక్షన్ ఫీచర్, USB మొబైల్ ఛార్జింగ్ LED ల్యాంప్స్, సైడ్ స్టాండ్ సెన్సార్, థర్మల్ ప్రమోషన్ అలర్ట్ మరియు రివర్స్ అసిస్టెన్స్ వంటి హైటెక్ యాడ్-ఆన్స్ ఈ స్కూటర్‌లో గమనించవచ్చు. 2.04 kWh మరియు 3.26 బ్యాటరీ ఆప్షన్స్‌తో ఈ స్కూటర్ రానుంది. ఇవి వరుసగా 82 మరియు 137 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది.
ప్రిమో S మరియు ప్రిమో ప్లస్ లలో అధిక బూట్ స్పేస్‌తో రానుంది. ప్రిమో ఎస్, ప్రిమో ప్లస్ రెండూ గంటకు 52 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఇందులో అత్యాధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్లతో పాటు ప్రిమో ఎస్ మరియు ప్రిమో ప్లస్ మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇతర బెస్ట్ స్కూటర్లతో ఈ స్కూటర్‌లు ఎందులోనూ తీసిపోవని ఆ సంస్థ కో వ్యవస్థాపకుడు సంకిత్ షా తెలిపారు.
ఇ-స్కూటర్ కంపెనీకి యొక్క ఐకానిక్ అద్భుతమైన ఫినిషింగ్‌తో రూపొందించారు. ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో పాటు ఎక్కువ లెగ్ స్పేస్‌ను కలిగి ఉంది. ఇది రైడర్‌లకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ స్కూటర్‌లోని మెరుగైన పనితీరు సామర్థ్యాలు, అధునాతన భద్రతా ఫీచర్లు మరియు స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్‌లు ఉన్నాయి. ప్రయాణికులకు మంచి బ్యాకప్‌తో పాటు పర్యావరణ అనుకూలమైన వాతావరణాన్ని అందించడమే మా లక్ష్యమని ఆయన చెప్పారు.
కస్టమర్లకు అమ్మకాలతో పాటు నాణ్యమైన సేవలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా మార్కెట్‌ని విస్తరించడానికి ప్రయత్నిస్తుమని షా వెల్లడించారు. దేశంలోని ముఖ్య నగరాల్లో వ్యాపారాన్ని విస్తరించేదుకు మెరుగైన సేవలు అందించేందుకు ఆసక్తిగల వ్యాపారవేత్తలు లేదా ఔత్సాహికులతో జత కడతామని పేర్కొన్నారు. దేశంలో మొదలైన ఈవీ విప్లవంలో తాము కీలక పాత్ర పోషిస్తామని ఆయన చెప్పారు.
పైన పేర్కొన్న స్కూటర్ ధర కేవలం రూ. 79,999 లకే ప్రారంభం కానుంది. మార్కెట్‌లో వచ్చే డిమాండ్ మరియు మార్కెటింగ్‌ని బట్టి ధరల్లో తగ్గుదల ఉండే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. మార్కెట్‌లో ప్రస్తుతం లభిస్తున్న స్కూటర్లకు గట్టి పోటీనిచ్చేందుకు ఈ స్కూటర్లను సంస్థ ప్రవేశపెట్టింది. వాటి పనితీరు మరియు కస్టమర్ల నుంచి రెస్పాన్స్ ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులను సంస్థ తీసుకురానుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








