జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి

సాధారణ ప్రజలమాదిరిగా కాకుండా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు కొత్త బైకులు, కార్లు కొనుగోలు చేస్తుంటారని అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే బాలీవుడ్ నటుడు 'జాన్ అబ్రహం' ఓ కొత్త బైకుని తన గ్యారేజిలో చేర్చారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నటుడు జాన్ అబ్రహం (John Abraham) తన గ్యారేజిలో చేర్చిన కొత్త బైక్ 'ఏప్రిలియా' కంపెనీకి చెందిన 'ఆర్ఎస్ 457'. తాను ఏప్రిలియా అంబాసిడర్‌గా నియమించబడినట్లు.. ఇందులో భాగంగానే కొత్త ఏప్రిలియా ఆర్ఎస్ 457 కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఈయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

John-Abraham-Aprilia-Superbikes

ఇప్పటికే అనేక అన్యదేశ్య మరియు ఖరీదైన బైకులను కొనుగోలు చేసిన జాన్ అబ్రహం గ్యారేజికి ఏప్రిలియా ఆర్ఎస్ బైక్ కొత్త అతిధిగా చేరింది. సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసిన జాన్ అబ్రహం.. 'మోటార్‌సైక్లింగ్ నా మతం.. ఇది నా జీవన విధానం' అంటూ రాసుకొచ్చారు. నేను ఏప్రిలియా రేసింగ్ స్క్వాడ్‌లో చేరినట్లు చెప్పడం చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.

నిజానికి జాన్ అబ్రహం ఇప్పటికే అనేక ఖరీదైన సూపర్ బైకులు మరియు స్పోర్ట్స్ బైకులు కొనుగోలు చేశారు. ఇప్పటికి ఉన్న బైకులతో పోలీసైతే.. ఇప్పుడునా తన గ్యారేజిలో చేరిన ఏప్రిలియా బైక్ అత్యంత సరసమైనదని తెలుస్తోంది. కంపెనీ ఈ బైకును గత ఏడాది డిసెంబర్‌లో లాంచ్ చేసింది. డెలివరీలను ఇటీవలే ప్రారంభించింది. మొదటి బైకును హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి సొంతం చేసుకున్నారు.

John-Abraham-Aprilia-Superbikes

ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ దాని ఆర్ఎస్660 నుంచి ప్రేరణ పొందింది. ఆర్ఎస్ 457 బైక్ దేశంలోని అత్యంత సరసరమైన స్పోర్ట్స్ బైక్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 4.10 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో 41 మిమీ USD పోర్క్, వెనుకవైపు మోనోశాక్ ఉన్నాయి.

బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఏప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేకులు, వెనుకవైపు 220 మిమీ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. మూడు రైడింగ్ మోడ్స్ కలిగిం ఈ బైక్ త్రీ లెవెల్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ వంటి మరిన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

John-Abraham-Aprilia-Superbikes

ఏప్రిలియా 457 బైక్ 457 సీసీ ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 47 Bhp పవర్ మరియు 48 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ దేశీయ విఫణిలో కెటిఎమ్ RC390, కవాసకి నింజా 400 వంటి బైకులకు ఏప్రిలియా ఆర్ఎస్ 457 ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

జాన్ అబ్రహం గ్యారేజిలో ఇప్పటికే ఏప్రిలియా ఆర్ఎస్వీ4 ఆర్ఎఫ్ (రూ.25 లక్షలు - ఎక్స్ షోరూమ్), సుజుకి హయబుసా, యమహా వీ మ్యాక్స్ 60వ యానివెర్సరీ ఎడిషన్, కవాసకి నింజా జెడ్ఎక్స్-14ఆర్, హోండా సీబీఆర్ 1000ఆర్ఆర్, యమహా వైజెడ్ఎఫ్ ఆర్1, డుకాటీ పానిగేల్ వీ4 వంటి బైకులు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ఏప్రిలియా ఆర్ఎస్ 457 చేరింది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, April 18, 2024, 12:25 [IST]
English summary
John abraham buys aprilia rs457 sportsbike122530
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+