ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొనడానికి ఇంతకంటే మంచి ఆఫర్‌ దొరకదు.. ఇంత కంటే తక్కువ ధరకు వస్తే అది ఉచితమే అవుతుంది!

ఈ ఫెస్టివల్ సీజన్‌లో ప్రతీ ఆటోమొబైల్‌ కంపెనీ తమ సేల్స్‌ని పెంచుకుంనేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్లతో ఎర వేస్తున్నాయి. వివిధ కంపెనీల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుండటంతో ఇదివరకు లేని విధంగా భారీ స్థాయిలో డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దేశంలోని ప్రజలు ఎక్కువగా పండుగ సీజన్‌లో కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. దీంతో కంపెనీలు ఈ సీజన్‌ని టార్గెట్‌ చేస్తూ కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ ఏడాదిలో దీపావళిని మరింత ఎకో ఫ్రెండ్లీగా మార్చుకోవాలనుకునే వారికి జాయ్ ఇ-బైక్ (Joy e-bike) శుభవార్త చెప్పింది. దానికి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేయండి.

జాయ్‌ ఇ-బైక్స్‌ బ్రాండ్ కింద భారతదేశంలో వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తుంది. ఈ పండుగ సీజన్‌లో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి వార్డ్‌ విజార్డ్‌ ఇన్నోవేషన్స్‌ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన ఆఫర్‌ ప్రకారం కనివినీ ఎరుగని విధంగా ఈ స్కూటర్లను చాలా తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

Joy eBike Festive Offers up to Rs 30000

జాయ్‌ ఇ-బైక్స్‌ కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ మిహోస్‌ (Mihos) ఈ నెలలో జాయ్ ఇ-బైక్పై రూ .30,000 వరకు డిస్కౌంట్‌ని అందిస్తుంది. ఈ ఆఫర్లు భారతదేశంలోని జాయ్ ఇ-బైక్ అధీకృత డీలర్‌షిప్స్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్ నవంబర్ 15, 2024 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

అలాగే బ్లూబెల్స్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భాగస్వామ్యంతో పండగ సీజన్‌లో కొనుగోళ్లపై కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్‌ని కూడా అందిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి మంగళం ఇండస్ట్రియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎంఐఎఫ్ఎల్) అలాగే 15 బ్యాంక్స్‌, ఇతర నాన్‌ బ్యాకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీల ద్వారా ఫైనాన్సింగ్ ఆప్షన్‌లను కూడా అందిస్తుంది. ఈ ఫెస్టివల్ ఆఫర్లతో ఆకర్షణీయమైన ధర వద్ద ఈ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం కంపెనీ లైనప్స్‌లోని అన్ని జాయ్ ఇ-బైక్ మోడళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 400కు పైగా నగరాల్లో ఈ కంపెనీ స్ట్రాంగ్‌ నెట్‌వర్క్‌ని కలిగి ఉంది. మిహోస్‌ స్కూటర్‌తో పాటు కంపెనీ తన పోర్ట్‌పోలియోలోతో పాటు మరో 10 కి పైగా ఉత్పత్తులను కలిగి ఉంది. ఈ జాయ్ ఇ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు కేవలం రూ .70,000 నుంచి ప్రారంభమవుతుంది.

జాయ్ ఇ-బైక్ మిహోస్‌ ధర ప్రస్తుతం రూ .1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఈ స్కూటర్‌ని ప్రతీ ఒక్కరూ యాక్సెస్ చేయడానికి వీలుగా 750 మిమీ ఎత్తులో అందిచారు. ఇది 175 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. ఇది 1500 వాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో 95 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఫర్ఫామెన్స్‌ పరంగా చూస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 7 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 70 కి.మీ లుగా ఉంది. ఈ ఈవీ ఎకో, రైడ్, హై అనే మూడు రైడింగ్ మోడ్స్‌తో వస్తుంది. ఇందులోని 2.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఎకో మోడ్‌లో ఫుల్‌ ఛార్జ్‌పై 130 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని పేర్కొంది.

4-5 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, వెనుక భాగంలో సింగిల్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ని కలిగి ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా స్మార్ట్ నోటిఫికేషన్స్‌, రిమోట్ ట్రాకింగ్, రివర్స్ మోడ్, GPS ట్రాకింగ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, హైడ్రాలిక్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS) వంటి ఫీచర్లను ఈ ఫ్లాగ్‌షిప్‌ స్కూటర్‌ అందుబాటులో ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 22, 2024, 9:26 [IST]
English summary
Joy e bike announced festive offers up to rs 30000 check details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+