హైడ్రోజన్‌తో నడిచే ఇ స్కూటర్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన Joy E Bike.. ఛార్జింగ్ పెట్టాల్సిన పనే ఉండదు.!!
వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ & మొబిలిటీలో మరొక భాగమైన జాయ్ ఇ-బైక్(Joy E Bike), భారత మార్కెట్లో ప్రత్యేకమైన సామర్థ్యాలతో కూడిన ఎలక్ట్రిక్ టూ వీలర్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ స్కూటర్ హైడ్రోజన్ పవర్డ్ ఇ-స్కూటర్‌గా సంస్థ పేర్కొంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో జాయ్ ఇ-బైక్ కంపెనీ ఈ స్కూటర్‌ను ప్రదర్శించింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో ఓలా ఎలక్ట్రిక్ అగ్రగామిగా ఉంది. అయితే ఈ కంపెనీ ఇప్పటివరకూ ఇంకా హైడ్రోజన్-టు-ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని ప్రారంభించలేదు. ఈ క్రమంలో తాజాగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన జాయ్ ఇ-బైక్, హైడ్రోజన్‌తో నడిచే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని రూపొందించింది. అయితే ఈ స్కూటర్ విక్రయాలకు సంబంధించి వివరాలు అందుబాటులో లేవు.

దేశంలో హైడ్రోజన్ వాహనాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాయ్ ఇ-బైక్.. హైడ్రోజన్-శక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనం త్వరలో అందుబాటులోకి రానుంది. వార్డ్ విజార్డ్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో(Bharat Mobility Global Expo 2024) 2024లో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఎలక్ట్రిక్ టూ-వీలర్ మరియు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది.
రెండు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించడంతో సెల్ బ్యాటరీ టెక్నాలజీకి ప్రత్యామ్నాయంగా.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో జాయ్ ఇ బైక్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని సంస్థ పేర్కొంది. అయితే ప్రస్తుతం కాన్సెప్ట్ మోడల్ మాత్రం డిస్‌ప్లేలో ప్రదర్శించింది. ఈ స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది.. విక్రయాలు ఎప్పుడు మొదలవుతాయి, ఫీచర్లు ఏంటి అనే వివరాలను సంస్థ ప్రకటించలేదు.

అయితే సాంప్రదాయ ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగా ఛార్జింగ్ పాయింట్ వద్ద జాయ్ బైక్ హైడ్రోజన్ పవర్డ్(Hydrogen Powered E Scooter) ఇ-స్కూటర్ వాహనాన్ని ఛార్జింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. పెట్రోల్, డీజిల్ వాహనాల మాదిరిగానే హైడ్రోజన్ కేంద్రాలకు వెళ్లి హైడ్రోజన్ సెల్ నింపుకోవచ్చు. అనంతరం ఇది విద్యుత్తుగా మార్చబడుతుంది.. ఆ తర్వాత ఆ శక్తితో స్కూటర్ నడుస్తుంది.
ఇక హైడ్రోజన్‌ను విద్యుత్‌గా మార్చడం వల్ల ఎలాంటి వాయు కాలుష్య ఉద్గారాలు ఏర్పడవు. ఈ రకమైన వాహనాలు గాలి కలుషితం కాకుండా కేవలం ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుండటంతో.. పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. ఈ తరహా ద్విచక్ర వాహనాన్ని జాయ్ ఈ-బైక్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో వేదికగా సంస్థ ఆవిష్కరించింది.

జాయ్ ఇ-బైక్ హైడ్రోజన్(Joy E Bike Hydrogen Powered E Scooter) పవర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకానికి వస్తే, ఇది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ప్రపంచంలో విప్లవాత్మకంగా మారుతుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే కార్ల విక్రయాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో నడుస్తున్నాయి.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆపరేషన్ కూడా అతి త్వరలోనే భారత్‌లో కూడా ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. జాయ్ ఈ-బైక్ తన హైడ్రోజన్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించడంతో దీనిపై అంచనాలు మరింతగా పెరిగాయి. సాంప్రదాయ ఐసీఈ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మళ్లుతున్నారు. త్వరలో హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్ అందుబాటులోకి వస్తే దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








