ఈ స్కూటర్‌తో కి.మీకు 17 పైసలు ఖర్చు.. ఏకధాటిగా 130 కి.మీ.. రూ.999 చెల్లించి త్వరపడితే బెస్ట్

ఎలక్ట్రిక్ వాహనాలకు ఇండియా ప్రధాన గమ్యస్థానంగా మారుతుంది. అంతర్జాతీయంగా మంచి పేరున్న కంపెనీలు సైతం ఇక్కడి మార్కెట్‌పై కన్నేసి లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈవీలను విడుదల చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రతి ఏటా ఎలక్ట్రిక్ బైకులు, కార్ల కొనుగోళ్లు విపరీతంగా పుంజుకుంటున్నాయి. తయారీ కంపెనీలు వీటిపై ఎక్కువగా ఫోకస్ చేసి ఒకదాని తరువాత ఒక మోడల్‌ను వినియెగదారుల కోసం తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఈవీలకు ఎలాంటి డిమాండ్ ఉందంటే, కస్టమర్ల నుంచి వీటికి మంచి ఆదరణ లభిస్తుండంతో ప్రతి వారం ఏదో ఒక కంపెనీ కొత్త ఈవీ టూవీలర్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ ఏడాదిలో ఇంధన టూవీర్లలతో పాటు ఎలక్ట్రిక్ బైకులు, స్కూటీలు కూడా ఎక్కువగా సేల్స్‌ను సాధించాయి.

ఈవీ మార్కెట్ వేగంగా పుంజుకున్న తరుణంలో వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ మేక్ ఇండియాలో భాగంగా జాయ్ ఇ-బైక్‌‌(Joy e bike)ను మరింత విస్తరించడానికి నెమో(Nemo) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటీవల లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో దీని ధర రూ.99,000 (ఎక్స్ షోరూమ్) గా ఉంది. అయితే కంపెనీ లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.98,000 కే ఈ ఈవీ కొనుగోలు చేసే అవకాశాన్ని ఇస్తుంది.

joy nemo electric scooter

నెమో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కావాలనుకునే వారు కేవలం రూ.999 చెల్లించి బుక్ చేసుకునే అవకాశం ఉంది. లాంచ్ ఆఫర్ కాబట్టి తగ్గింపు ఉంది. ఆ తరువాత అసలు ధరకే కొనుగోలుకు లభించవచ్చు. అందుకే వెంటనే కొత్త ఈవీ స్కూటర్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త ఏడాదిలో సంతోషంగా కోత్త స్కూటర్‌ను తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు.

జాయ్ నెమో గురించి మరిన్ని వివరాలు, ఇది పట్టణ రోడ్లపై ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. బరువు తక్కువగా ఉండటం వలన చాలా సులభంగా రైడ్ చేయవచ్చు. వైట్, సిల్వర్ కలర్ వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది. రైడర్లకు వేరు వేరు డ్రైవింగ్ మోడ్‌లను అందించడానికి దీనిలో ఎకో, స్పోర్ట్, హైపర్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ ఈ-స్కూటర్ 3-స్పీడ్ మోటార్‌తో 1500W DC BLDC ద్వారా పవర్‌ను అందుకుంటుంది.

joy nemo electric scooter launched

శక్తివంతమైన మోటార్‌తో ఇది గంటకు గరిష్టంగా 65 కి.మీల వేగంతో దూసుకుపోతుంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 130 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. పట్టణాల్లో నివసించే వారు తమ రోజువారి అవసరాల కోసం ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. కిలోమీటర్ దూరానికి వెళ్లడానికి దీనికి 17 పైసలు ఖర్చు అవుతుందని కంపెనీ వెల్లడించింది. పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే చాలా బెటర్. వినియెగదారులకు చాలా డబ్బులు ఆదా అవుతాయి.

జాయ్ నెమో అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. జియో-ఫెన్సింగ్‌తో వెహికల్ ట్రాకింగ్ ఆప్షన్, దొంగతనానికి గురికాకుండా ఉండటానికి యాంటీ థెఫ్ట్ స్మార్ట్ రిమోట్ లాక్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. అలాగే, బ్యాటరీ సిస్టమ్ రిమోట్ మానిటరింగ్, క్లౌడ్-కనెక్ట్, రియల్‌టైమ్ ట్రాకింగ్ వంటి వాటిని స్మార్ట్‌ఫోన్ కనెక్టవిటీ ద్వారా యాప్‌లో మానిటరింగ్ చేయవచ్చు. ఇంకా 5-అంగుళాల ఫుల్ కలర్ TFT డిస్‌ప్లే , డిజిటల్ స్పీడోమీటర్ వంటివి ఉన్నాయి.

అలాగే, చీకట్లో మరింత మెరుగైన వెలుతురు కోసం ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్‌‌ను స్టైలిష్ డిజైన్‌తో వచ్చింది. ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై ఈజీగా రైడ్ చేయడానికి ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ , వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లను అందించారు. వేగాన్ని కంట్రోల్ చేయడానికి ముందు హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌లు, వెనుక కాంబి-బ్రేక్ సిస్టమ్‌ను అమర్చారు. ఇదిలా ఉంటే కంపెనీ 2025 చివరి నాటికి 35,000 టూవీలర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

More from DriveSpark

Article Published On: Monday, December 16, 2024, 13:57 [IST]
English summary
Joy nemo electric scooter launched in india all features details here
Read more on: #electric bike #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+