Kabira Mobility మార్కెట్లో మరో రెండు కొత్త ఇ బైక్‌లు లాంచ్.. వీటిలో పవర్‌ట్రెయిన్‌కి ఓ ప్రత్యేకత ఉంది.!!
గోవాకు చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ కబీరా మొబిలిటీ భారత మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసింది. KM3000, KM4000 తో రెండు అద్భుతమైన ఇ బైక్‌లను ఈవీ లవర్స్‌కి పరిచయం చేసింది. ఈ బైక్స్ డిజైన్, ఫీచర్లు, ధర, బ్యాటరీ ప్యాక్ పూర్తి సమాచారం ఈ కథనంలో..
దేశంలో ఈవీలకు ఆదరణ పెరుగుతోంది. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని స్టార్టప్‌లు చాలా పుట్టుకొస్తున్నాయి. స్కూటర్ సెగ్మెంట్, మోటార్ సైకిళ్ల సెగ్మెంట్‌లో హవా సృష్టిస్తున్నాయి. ప్రముఖ ఆటో మొబైల్ తయారీదారులకు గట్టి పోటీనిస్తూ మార్కెట్‌లో సత్తా చాటుతున్నాయి.

ఈ క్రమంలో గోవాకు చెందిన స్టార్టప్ కబీరా మొబిలిటీ(Kabira Mobility).. రెండు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకువచ్చింది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆసక్తికర కస్టమర్లు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కబీరా KM3000, KM4000 ఎలక్ట్రిక్ బైక్‌లను టెస్ట్ రైడ్ చేసే సువర్ణావకాశాన్ని సంస్థ అందిస్తోంది.
KM3000 ను కబీరా మొబిలిటీ రూ. 1.74 లక్షలు(ఎక్స్-షోరూమ్) ధరతో ప్రవేశపెట్టగా.. KM4000 ను రూ. 1.76 లక్షలు(ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. ఈ రెండు ఇ బైక్‌ల్లోనూ సంస్థ అల్యూమినియం కోర్ హబ్ మోటార్ పవర్‌ట్రెయిన్ ఫీచర్‌ను అందిస్తోంది. దీనిని ఫాక్స్‌కాన్ సహకారంతో అభివృద్ధి చేసినట్లు కబీరా మొబిలిటీ వెల్లడించింది.

డిజైన్ పరంగా KM3000 పూర్తిగా ఫెయిర్డ్ మోటార్‌సైకిల్ కాగా.. KM4000 స్ట్రీట్ ఫైటర్‌గా సంస్థ డిజైన్ చేసింది. కాగా ఈ రెండు బైక్‌లూ ఒకే డైమండ్ స్టీల్ ట్యూబ్ ఫ్రేమ్‌తో వస్తాయి. వీటిలో షోవా తయారు చేసిన టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, 17-అంగుళాల వీల్స్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో కూడిన మాడ్యులర్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది.
బ్యాటరీ ప్యాక్ విషయానికొస్తే.. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు 4.1 kWh లేదా 5.15 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్నాయి. అది కూడా స్టాండర్డ్ లేదా V వేరియంట్‌లను బట్టి బ్యాటరీ ప్యాక్‌ను ఎంచుకోవచ్చు. రేంజ్ విషయానికొస్తే.. సబ్-వేరియంట్‌లను బట్టి 178 కి.మీ నుంచి 201 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.

కబీరా మొబిలిటీ (Kabira Mobility) KM3000, KM4000 ఎలక్ట్రిక్ బైక్‌లు గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. 2.9 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటాయి. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 192 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.
KM3000 మరియు KM4000 మార్క్-II మోడల్స్‌ను టెస్ట్ రైడ్ చేయాలనుకునేవారు.. ఎంపిక చేసిన ప్రదేశాలలో టెస్ట్ రైడ్ చేయాల్సి ఉంటుందని గమనించాలి. ఇందుకోసం కబీరా మొబిలిటీ యొక్క డీలర్ నెట్‌వర్క్‌ను సంప్రదించవచ్చు. డెలివరీలు మార్చి 2024లో ప్రారంభమవుతాయని కబీరా మొబిలిటీ వెల్లడించింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








