Kawasaki: బైక్‌ల ధర భారీగా తగ్గింపు.. ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు ఉందంటే?

కవాసకి... ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. భారత్‌ మార్కెట్లో తన ఫోర్ట్‌ఫోలియోలో ఎంపిక చేసిన మోడల్‌పై ఆకర్షణీయమైన తగ్గింపు ధరలను ప్రకటన చేసింది. కవాసకి ఇండియా డిసెంబర్‌ 2023 నెలలో ఇచ్చిన తగ్గింపు ఆఫర్‌ను పొడిగించాలని నిర్ణయించింది.

కవాసని ఇండియా నింజా 400 (Kawasaki Ninja 400), నింజా 650 (Ninja 650), వల్కాన్‌ S (Vulcan S) మరియు వెర్సిస్‌ 650 (Versys 650)ల వంటి వాహనాలపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. జనవరి 2024 31వ తేదీ వరకు తగ్గింపు ధరలు అందుబాటులో ఉండనున్నాయి. స్టాక్‌ ఉన్నంత వరకు మాత్రమే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని కవాసకి ఇండియా వెల్లడించింది.

kawasaki-ninja-400

కవాసకి వాహనాలపై తగ్గింపు ధరలు : కవాసకి 400 బైక్‌ కొనుగోలు రూ.40,000 వరకు ఆదా చేసుకోవచ్చు. వల్కాన్‌ S ‌క్రూయిజర్ మరియు నింజా 650 వరుసగా రూ.60,000 మరియు రూ.30,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. వెర్సిస్‌ 650 బైక్‌పై రూ.20,000 అందుబాటులో ఉంది. ఈ ధరపై GST మొత్తంతో కలిగి ఉంటుంది.

కవాసకి నింజా 650 కొత్త బైక్‌.. లైమ్‌ గ్రీన్‌ సింగిల్‌ రంగు ఆప్షన్‌లో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. నింజా 650 బైక్ డెలివరీ ఈ నెల మధ్య ప్రారంభం అవుతుంది. ఈ బైక్‌ కవాసకీ ట్రాక్షన్ కంట్రోల్‌ (KRTC), రెండు వేర్వేరు దశలు ఉంటాయి.

discounts on Kawasaki bikes

కవాసికి నింజా 650 బైక్‌ 649cc పేర్లల్‌ ట్విన్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 67bhp శక్తి, మరియు 64 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ కొత్త బైక్‌ ట్రెల్లిస్ ఫ్రేమ్ సెటప్‌తో కొనసాగుతుంది. 41mm టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్‌ మరియు వెనుకవైపు 125Nm మోనోషాక్ సస్పెన్షన్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది.

కవాసకి నింజా 650 స్పోర్ట్స్‌ డ్యూయల్ 300mm ఫ్రంట్‌ పెటల్‌ డిస్క్‌లు ముందువైపు డ్యూయల్‌ పిస్టన్‌ కాలిపర్‌లు వెనుకవైపు 220mm పెటల్‌ డిస్క్‌ బ్రేకింగ్‌తో సింగిల్‌ పిస్టన్ కాలిపర్‌లు ఉన్నాయి. 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ 120/70 (ఫ్రంట్‌), 160/60 (వెనుక) స్పోర్ట్‌మ్యాక్స్‌ రోడ్‌స్పోర్ట్‌ 2 టైర్‌లు ఉన్నాయి.

kawasaki-ninja-vulcan-s

డిజైన్ పరంగా పాత మరియు కొత్త మోడల్‌లో డిజైన్‌లో పెద్దగా మార్పులేదు. అయితే కొత్త బైక్‌లో ఆకర్షణీయ స్ప్లిట్‌ LED హెడ్‌లైట్‌లు ఉన్నాయి. దీంతోపాటు షార్ప్‌ ఎడ్జ్‌లను కలిగి ఉంటాయి. దీంతోపాటు కొత్త ఫెయిరింగ్‌తో వస్తుంది. దీంతోపాటు 4.3 అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఉంది. ఈ కొత్త ప్యానల్ ద్వారా అనేక సమాచారాన్ని పొందవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, January 8, 2024, 12:52 [IST]
English summary
Kawasaki extends discounts on various models in india upto 31 january
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+