యూత్ మెచ్చిన ఫీచర్లు, స్టన్నింగ్ లుక్స్‌తో కవాసకి సరికొత్త బైక్ లాంచ్.. రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది..
స్పోర్ట్స్ మోడళ్లు, లగ్జరీ బైకులను ఎక్కువగా తయారు చేసే కవాసకి (kawasaki) తన వ్యాపార లైనప్‌ను మరింత విస్తరించడానికి కొత్తగా మరో నింజా బైకును విడుదల చేసింది. ఈ మోడల్ పేరు 'నింజా 1100 ఎస్ ఎక్స్ (Ninja 1100SX)'. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా భారీ ఇంజిన్ కెపాసిటీ కలిగిన లగ్జరీ బైకులకు ప్రస్తుతం డిమాండ్ భారీగా పెరుగుతుంది. దీంతో ఈ సెగ్మెంట్‌పై ఇప్పటికే కన్నేసిన టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త డిజైన్లతో బైకులను లాంచ్ చేస్తున్నాయి. పోటా పోటీగా సేల్స్ విషయంలో దుమ్మురేపుతున్నాయి. ఇప్పుడు విడుదలైన నింజా కొత్త మోడల్ ద్వారా కవాసకి తన బైకుల సేల్స్‌ను మరింత పెంచుకోడానికి వీలవుతుంది. ఈ కొత్త మోడల్ పనితీరు అద్భుతంగా ఉంటుంది. రైడర్లు ఈ బైకుపై రాకెట్ వెగంతో దూసుకుపోవచ్చు. జపాన్‌కు చెందిన కవాసకి కంపెనీ ఇప్పుడు ఈ కొత్త మోడల్‌తో దాని మార్కెట్‌ను మరింత పెంచుకోనుంది.
బైక్ లవర్స్‌కు నింజా 1100ఎస్ఎక్స్ అత్యంత ఇష్టమైన్ మోడల్‌గా నిలుస్తుందని కంపెనీ అంచనాలు పెట్టుకుంది. దీని ధర రూ.13.49 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. దీని ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, 1099 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్‌లైన్-ఫోర్ మిల్ ఇంజిన్ ఆప్షన్‌తో వచ్చింది. ఇది 9,000rpm వద్ద 136hp పవర్, 7,600rpm వద్ద 113Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6 స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌ను జోడించారు.

దీని మైలేజ్ కూడా ఎక్కువగానే వస్తుంది. ఇది నింజా 1000SXని పోలి ఉంటుంది. పాత మోడల్‌తో పోలిస్తే స్వల్ప మార్పులను మాత్రమే పొందింది. USB-C ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే, ముందు ఎక్కువ వెలుతురు అందించే LED హెడ్‌ల్యాంప్, రైడింగ్ వివరాలను అందించడానికి మందు డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, స్పోర్ట్, రోడ్, రైన్ మూడు రైడింగ్ మోడ్‌లు వంటివి దీనిలో ఉన్నాయి.
నింజా 1100ఎస్ఎక్స్ 135mmల గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు, 1,440mmల వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. రైడర్లకు సీటు ఎత్తు కూడా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇది దాదాపు 820mm వరకు ఉంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 19 లీటర్లు. బ్రేకులు పూర్తిగా అప్‌డేట్ అయ్యాయి. ముందు 300mm ఫ్రంట్ డిస్క్, వెనుక బ్రేక్ డిస్క్ 260 mm వరకు ఉంటుంది. అదనంగా మరింత సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ ABS సిస్టంను కూడా అందించారు.

రైడింగ్ సమయంలో బ్రేకింగ్ సిస్టం మృదువుగా ఉండటానికి Bi DryRection Quick Shifter (KQS)ని దీనిలో అందించారు. వేగంగా వెళ్తున్నప్పుడు గేర్ ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్‌కు సులువుగా మారుతుంది. కవాసకికి చెందిన రేడియాలజీ యాప్‌తో రైడర్లకు వాయిస్ కమాండ్ లభిస్తుంది. దీంతో రైడింగ్‌లో బైక్‌తో ఈజీగా కనెక్ట్ కాగలరు.
కవాసకి నింజా 1100SX బైక్ మెటాలిక్ డయాబ్లో బ్లాక్, మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు లభిస్తుంది. లాంగ్ రైడ్ చేసే వారికి ఈ బైక్ అత్యంత బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం యూత్ ఎక్కువగా సోషల్‌మీడియాలో వ్లాగ్‌లను చేయడానికి ఇలాంటి బైకులనే ఎంచుకుంటున్నారు. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వీటి సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నింజా 1100SX రానున్న రోజుల్లో మెరుగైన సేల్స్ సాధిస్తుందని అంచనా.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications