నింజా 400.. కొత్త బైక్ కావాలన్నా ఇక దొరకదు!.. ఎందుకో ఇప్పుడే తెలుసుకోండి

జపాన్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారతదేశంలో ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కంపెనీ ఇటీవల దేశీయ విఫణిలో తన 'నింజా 500' బైకు విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కవాసకి నింజా 400 (Kawasaki Ninja 400) బైక్ యొక్క విక్రయాలను నిలిపేస్తున్నట్లు మాత్రమే కాకుండా.. కంపెనీ వెబ్‌సైట్‌లో నుంచి కూడా తొలగించారు. గతంలో ఈ బైకును సీబీయూ మార్గం ద్వారా మాత్రమే విక్రయించారు. కొన్ని సంవత్సరాలు భారతదేశంలో మంచి అమ్మకాలు పొందినప్పటికీ.. క్రమంగా ఆశించిన అమ్మకాలను నమోదు చేయలేకపోయింది. దీంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Kawasaki Ninja 400

కవాసకి నింజా 400 బైక్ చూడటానికి నింజా 500 మాదిరిగానే ఉంది. అంతే కాకుండా ధరలు కూడా దాదాపు సమానంగానే ఉన్నాయి. దీంతో కంపెనీ నింజా 400 అమ్మకాలను పెంచడానికి అద్భుతమైన డిస్కౌంట్స్ కూడా గతంలో ప్రవేశపెట్టింది. చివరికి ఈ మోడల్ అమ్మకాలను దేశంలో నిలిపివేయడమే ఉత్తమమని భావించి వెబ్‌సైట్‌ నుంచి కూడా తీసేసింది. అయితే దీని స్థానంలో కొత్త బైకుని లాంచ్ చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

2018లో కవాసకి తన నింజా 400 బైకును రూ. 4.69 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) ధరతో లాంచ్ చేసింది. ఆ తరువాత ఈ బైక్ యొక్క విక్రయాలు అంతర్జాతీయ మార్కెట్లో నిలిపివేయబడ్డాయి. అయినప్పటికీ భారతదేశంలో మాత్రం అమ్ముడవుతూనే ఉన్నాయి. తాజాగా ఇండియాలో కూడా దీని అమ్మకాలను పూర్తిగా నిలిపేస్తున్నట్లు నిర్ణయించారు. గతంలో బిఎస్6 ఉద్గార ప్రమాణాలు ప్రారంభమైన సమయంలో కూడా కొన్ని రోజులు అమ్మకాలు నిలిపివేయబడ్డాయి.

Kawasaki Ninja 400

కవాసకి నింజా 400 బైక్.. నింజా 500 బైక్ మాదిరిగా ఉన్నప్పటికీ.. నింజా 400లో 399 సీసీ ప్యారలల్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 10000 rpm వద్ద 44 Bhp పవర్ మరియు 8000 rpm వద్ద 37 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. తద్వారా ఇది మంచి పనితీరును అందిస్తుంది.

ఇక కవాసకి నింజా 500 బైక్ విషయానికి వస్తే.. ఇందులో 451 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9000 rpm వద్ద 45 Bhp పవర్ మరియు 6000 rpm వద్ద 42.6 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే పవర్ మరియు టార్క్ రెండూ కూడా నింజా 400కు సమానంగా ఉంటుందని తెలుస్తోంది.

Kawasaki Ninja 400 Side View

నింజా 400 మరియు నింజా 500 రెండు బైకుల పవర్ మరియు టార్క్ ఒకే విధంగా ఉన్నప్పటికీ డిజైన్ మరియు ఫీచర్స్ విషయంలో కొంత వ్యత్యాసం ఉంటుంది. చాలా వరకు రెండూ సమానంగా ఉంటాయనే చెప్పాలి. కాబట్టి కస్టమర్లు నింజా 400 బైకును కాకుండా నింజా 500 బైక్ కొనుగోలుకు ఆసక్తి చూపడం వల్ల నింజా 400 అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో కంపెనీ దీని విక్రయాలు నిలిపివేసింది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, May 9, 2024, 15:00 [IST]
English summary
Kawasaki ninja 400 bike discontinued in india market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+