ఈ బైక్ కొనాలంటే ఇప్పుడే ట్రై చేయండి.. ఎందుకంటే?

2024 ప్రారంభమై ఆరు నెలలు పూర్తయిపోయింది. ప్రారంభం నుంచి లెక్కకు మించిన వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు లాంచ్ అయిన కార్లు మరియు బైకుల ధరలు భారీగా ఉన్నాయి. ఈ తరుణంలో కవాసకి కంపెనీ తన నింజా 650 (Ninja 650) బైకుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఒక్క కవాసకి నింజా 650 బైకుపై మాత్రమే కాకుండా కంపెనీ నింజా 400, వెర్సెస్ 650మరియు వల్కాన్ ఎస్ క్రూయిజర్ బైకుపై కూడా డిస్కోఉంటా అందిస్తున్నట్లు సమాచారం. ఈ డిస్కౌంట్స్ ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

కవాసకి కంపెనీ తన నింజా 650 బైకు కొనుగోలుపైన రూ. 30000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇక వల్కాన్ ఎస్ మోడల్ మీద ఏకంగా రూ. 60000 డిస్కౌంట్ అందిస్తున్నట్లు సమాచారం. మార్కెట్లో నింజా ప్రస్తుత ధర రూ. 7.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). డిస్కౌంట్ తరువాత ఈ బైకును రూ. 6.86 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. వల్కాన్ ఎస్ ధర కూడా డిస్కౌంట్ తరువాత తగ్గుతుంది.

Kawasaki Ninja 650

కవాసకి నింజా 650 బైక్ అనేది బ్రాండ్ యొక్క ఒక ప్రముఖ మోడల్. ఇది 649 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 67 Bhp పవర్ మరియు 64 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదే ఇంజిన్ వల్కాన్ ఎస్ బైకులో 60 Bhp పవర్ మరియు 62.4 Nm టార్క్ అందించేలా ట్యూన్ చేయబడి ఉంది. పనితీరు పరంగా రెండూ ఉత్తమంగా ఉంటాయి.

అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన కవాసకి నింజా 650 బైక్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, టెయిల్ లైట్స్ వంటివాటితో పాటు మల్టిపుల్ ఫంక్షన్‌లతో కూడిన TFT ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ బైక్ గురించి చాలా వివరాలను వెల్లడిస్తుంది. ఇది బైక్ రైడర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Kawasaki Ninja 650 Running Shot

కవాసకి తన బైక్ అమ్మకాలను మెరుగుపరచడానికి ఇప్పటికప్పుడు ఆధునిక హంగులను జాడిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో భాగంగానే కవాసకి నింజా 650 బైక్ కొత్త కలర్ ఆప్షన్స్ కూడా పొందింది. ఇది మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్శించడంలో సక్సెస్ సాధిస్తోంది. ఈ సమయంలో కంపెనీ డిస్కౌంట్స్ ప్రకటించడం కవాసకి ప్రియులకు ఓ గొప్ప శుభవార్త అనే చెప్పాలి.

దేశీయ విఫణిలో అందుబాటులో ఉన్న కవాసకి నింజా 650 దాని ప్లాట్‌ఫారమ్‌ను జెడ్650 స్ట్రీట్ నేకెడ్ మోటార్‌సైకిల్, వెర్సిస్ 650 ఏడీవీ, జెడ్650 ఆర్ఎస్ కేఫ్ రేసర్ మరియు వల్కాన్ ఎస్ క్రూయిజర్ వంటి ఇతర మోడళ్లతో పంచుకుంటుంది. ఇది మార్కెట్లో ఇప్పటికే విక్రయించబడుతున్న ఏప్రిలియా కంపెనీ యొక్క ఆర్ఎస్660 మరియు రాబోయే ట్రయంఫ్ డేటోనా 660 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Kawasaki Ninja 650 Side Design

కవాసకి అందించే ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంది. అంతే కాకుండా డీలర్ వద్ద ఉన్న స్టాక్ మీద కూడా డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంపెనీ అందించే ఆఫర్స్ గురించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలో ఉండే.. బ్రాండ్ యొక్క అధికారిక డీలర్షిప్ సందర్శించవచ్చు. ఈ ఆఫర్స్ కేవలం ఈ నెల (జులై) చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 3, 2024, 11:47 [IST]
English summary
Kawasaki ninja 650 gets rs 30000 discount in 2024 july
Read more on: #kawasaki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+