భారత్‌లో లాంచ్ అయిన జపాన్ బ్రాండ్ బైక్.. ధర ఎంతో తెలుసా?

జపనీస్ సూపర్ బైక్ తయారీ సంస్థ కవాసకి ఎట్టకేలకు దేశీయ విఫణిలో కొత్త 'నింజా జెడ్ఎక్స్ 4ఆర్ఆర్' (Ninja ZX 4RR) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ కంప్లైట్ బిల్డ్ యూనిట్ (CBU)గా భారతదేశానికి దిగుమతి అవుతుంది. అంతే కాకుండా ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త బైక్ ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి? దాని మునుపటి మోడల్స్ కంటే ఏదైనా అప్డేట్స్ పొందిందా అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కవాసకి నింజా జెడ్ఎక్స్ 4ఆర్ఆర్ ధర రూ. 9.10 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది దాని మునుపటి మోడల్ జెడ్ఎక్స్4ఆర్ కంటే కూడా రూ. 61000 ఖరీదైనది. అంటే ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న జెడ్ఎక్స్4ఆర్ ధర రూ. 8.49 లక్షలు. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి.. అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

Kawasaki Ninja ZX 4RR

కొత్త కవాసకి నింజా జెడ్ఎక్స్ 4ఆర్ఆర్ చూడటానికి జెడ్ఎక్స్ 4ఆర్ మాదిరిగానే ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 4.3 ఇంచెస్ TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇది బైక్ గురించి కావలసిన సమాచారాన్ని అందిస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది రేసింగ్ గ్రీన్ కలర్ స్కీమ్‌ పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ బైక్ 399 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 14500 rpm వద్ద 76 Bhp పవర్ మరియు 13000 rpm వద్ద 39 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది స్పోర్ట్, రోడ్, రైన్ మరియు రైడర్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ పొందుతుంది.

Kawasaki Ninja ZX 4RR Running Shot

ఈ బైక్ ఫుల్లీ అడ్జస్టబుల్ రియర్ మోనోషాక్ సెటప్‌తో పాటు ప్రీలోడ్ అడ్జస్టబుల్ ఫ్రంట్ ఫోర్క్‌లను కలిగి ఉంది. ఇందులో అదే బ్రేకింగ్ సిస్టమ్‌ను పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 290 మిమీ సెమీ ఫ్లోటింగ్ ఫ్రంట్ డిస్క్‌లు మరియు 220 మిమీ రియర్ డిస్క్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ మొత్తం బరువు 189 కేజీలు. మొత్తం మీద ఈ కొత్త కవాసకి బైక్ బైక్ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి నింజా జెడ్ఎక్స్ 4ఆర్ఆర్ బైకుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. అయితే గ్లోబల్ మార్కెట్లో ట్రయంఫ్ డేటోనా 660 బైకుకు ప్రత్యర్థిగా ఉంటుంది. రూ. 10 లక్షల ధర వద్ద మంచి పనితీరును అందించే బైక్ కొనాలని ఎదురు చూసేవారికి తప్పకుండా కవాసకి నింజా జెడ్ఎక్స్ 4ఆర్ఆర్ మంచి ఎంపిక అవుతుందని భావిస్తున్నాము.

Kawasaki Ninja ZX 4RR Side Design

దేశంలో కొత్త బైకులకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని కంపెనీలు కొత్త బైకులు లేదా.. అప్డేటెడ్ బైకులను లాంచ్ చేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే కవాసకి ఇప్పుడు నింజా జెడ్ఎక్స్ 4ఆర్ఆర్ బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ మునుపటి బైకుల మాదిరిగానే తప్పకుండా వాహన ప్రేమికులను ఆకర్షిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ బైక్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, June 1, 2024, 12:45 [IST]
English summary
Kawasaki ninja zx 4rr launched at rs 9 10 lakh in india
Read more on: #kawasaki #new launches
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+