కవాసకి బైకులను కొనే సమయం ఇదే.. కొత్త ఏడాదికి ముందు సూపర్ మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్స్..

భారత్‌లో యువతరం ఎక్కువగా ఉంది. దీంతో సూపర్ బైకులకు డిమాండ్ అధికంగానే ఉంటుంది. ఒకప్పుడు ఇలాంటి మోడళ్లు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రమే కనిపించేవి. ఇండియాలోకి అతి తక్కువగా లాంచ్ అయ్యేవి. కానీ ప్రస్తుతం ప్రజల ఆదాయ స్థితిలో మార్పు రావడం, యువత చిన్న వయసులోనే లక్షల జీతం అందుకుంటుండటంతో ఎక్కువ ధర కలిగిన సూపర్ బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కస్టమర్ల నుంచి డిమాండ్ కూడా సానుకూలంగా ఉండటంతో తయారీ కంపెనీలు వీరిని ఆకట్టుకుని తమ సేల్స్‌ను మరింత పెంచుకోడానికి ఇలాంటి మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అదిరిపోయే సూపర్ బైకులు ఇండియాలో విడుదలయ్యాయి. విక్రయాల పరంగా ఇవి మెరుగైన స్థితిలోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే సూపర్ బైకులను తయారుచేసే కవాసకి (kawasaki) ప్రస్తుతం అదిరిపోయే బైకులను సేల్ చేస్తుంది.

మరికొద్ది రోజుల్లో 2024 ఏడాది ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదికి ముందు వాహన తయారీదారులు తమ పాత స్టాక్‌ను తగ్గించుకోడానికి ఇయర్ ఎండ్ తగ్గింపులు అందిస్తుండగా, ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో కవాసకి కంపెనీ తన బైకులపై భారీ ఎత్తున తగ్గింపులు అందిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకుని Ninja 300, Ninja 650, Versys 650, Z900 బైకులను తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు.

kawasaki year end discount On Ninja 650

తక్కువ ధరలో సూపర్ బైకులు కావాలనుకునే వారు ఈ ఇయర్ ఎండ్ సేల‌లో అసలు ధర కంటే తక్కువలోనే కొనుగోలు చేయడం ఉత్తమం. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ధర సాధారణ స్థితికి వస్తుంది. వెంటనే పూర్తి వివరాల కోసం దగ్గరలోని డీలర్లను సంప్రదించడం ఉత్తమం. మోడళ్ల వారీగా తగ్గింపులు కింది కథనంలో చూద్దాం.

Kawasaki Ninja 650: కవాసకి నింజా 650 బైకుపై ఇయర్ ఎండ్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ రూ.45,000 తగ్గింపును అందిస్తుంది. అంటే కస్టమర్లు దీన్ని రూ.6.71 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఇది 649 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. 67.3bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జత చేశారు. కంపెనీ ఇచ్చిన ఆఫర్‌ను వాడుకుని ఎక్కువ ధర కలిగిన మోడల్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనచ్చు.

kawasaki year end discount 2024

Kawasaki Ninja 300: కవాసకి నింజా 300 మోడల్ ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్. ఇది దాదాపు అన్ని నగరాలు, పట్టణ రోడ్లపై కనిపిస్తుంది. దీన్ని అంతర్జాతీయ మార్కెట్లో నిలిపివేశారు. కానీ ఇండియాలో డిమాండ్ ఉండటంతో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ మోడల్‌పై కంపెనీ రూ.30,000 తగ్గింపులు ఇస్తుంది. దీంతో నింజా 300ను రూ.3.13 లక్షలకే కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. కవాసకి బైక్ కావాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం.

Kawasaki Versys 650: కవాసకి వెర్సిస్ 650 మార్కెట్లో సాధారణంగా రూ.7.77 లక్షలకు కొనుగోలుకు లభిస్తుంది. అయితే ఇయర్ ఎండ్ సేల్ ఆఫర్ అందించడంతో ఈ బైకుపై రూ.30,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ డిసెంబర్‌లో వెర్సిస్ 650ను రూ.7.47 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ఇది 649 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను దీనికి జత చేశారు. మైలేజ్ 19.4 కి.మీ వరకు వస్తుంది.

kawasaki year end discount

Kawasaki Z900: కవాసకి జేడ్900 బైక్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇయర్ ఎండ్ సేల్‌లో దీనిపై కంపెనీ రూ.40,000 తగ్గింపులు అందిస్తుంది. దీంతో ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు రూ.8.98 లక్షలు (ఎక్స్ షోరూమ్) ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇది 948 cc భారీ ఇంజిన్‌ను కలిగి ఉంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జోడించారు. దీని మైలేజ్ దాదాపు 17 కి.మీల వరకు వస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 17, 2024, 14:24 [IST]
English summary
Kawasaki offers year end discount upto rs 45000 on bikes
Read more on: #kawasaki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+