నియో రెట్రో లుక్‌తో కవాసకి Z650RS లాంచ్.. ధర రూ. 6.99 లక్షలు
భారత మార్కెట్లో మరో కొత్త బైక్ విడుదలైంది. యూత్ ఫేవరెట్, జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి.. తమ Kawasaki Z650RS బైక్‌ను లాంచ్ చేసింది. అడ్వెంచరస్ ఫీచర్లు, నియో రెట్రో లుక్, అత్యాధునిక ఫీచర్లతో ఈ బైక్‌ను సంస్థ ప్రవేశపెట్టింది. ధర, ఫీచర్లు, ఇంజిన్ పర్ఫామెన్స్ పూర్తి సమాచారం ఈ కథనంలో..
కొత్త కవాసకి Z650RS మోడల్ నియో-రెట్రో మిడ్ బైక్‌గా కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. దీనిని 1970లలోని ఒరిజినల్ కవాసకి Z650-B1 డిజైన్‌ను పోలి ఉంటుంది. ఈ మోడల్‌ను కవాసకి Z650 ఆధారంగా రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. కవాసకి Z650RS నియో-రెట్రో మోటార్‌సైకిల్ అయినప్పటికీ, ఇందులో ఆధునిక ఫీచర్లను జోడించారు. దీని ద్వారా నియో రెట్రో లుక్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ కొత్త కవాసకి Z650Rs బైక్ డిజైన్ విషయానికొస్తే.. ఈ బైక్‌లో మందపాటి క్రోమ్ సరౌండ్, ట్విన్-పాడ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు కొంచెం పొడవైన టెయిల్ సెక్షన్‌తో రౌండ్ హెడ్‌లైట్లు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ బైక్ స్లిమ్ మరియు స్పష్టమైన LED ఇండికేటర్ ఇంకా LED హెడ్‌ల్యాంప్ సెటప్‌తో రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
కొత్త కవాసకి Z650Rs బైక్‌లో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని ఇచ్చేందుకు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు చిన్న LCD స్క్రీన్, అనలాగ్ స్పీడోమీటర్‌ను అందిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క 650 ట్విన్ మోటార్‌సైకిళ్లకు పోటీగా కవాసకి ఈ బైక్‌ను విడుదల చేసింది.

Z650RS బైక్‌లో స్టాండర్డ్ రోటర్లను కవాసకి ఉపయోగిస్తోంది. పవర్‌ట్రెయిన్‌ను పరిశీలించినట్లయితే ఇందులో 650cc లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 67 bhp మరియు 64 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
Kawasaki Z650RS సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే.. ఇందులో 41mm టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో ముందు మరియు వెనుకవైపు హారిజాంటల్ లింక్ సస్పెన్షన్ సెటప్‌తో అడ్జస్టబుల్ ప్రీ-లోడ్‌తో వస్తుంది. ట్రెల్లిస్ ఫ్రేమ్ ఛాసిస్‌ను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ సిస్టమ్‌ను పరిశీలిస్తే.. ఈ కొత్త కవాసకి Z650RS బైక్ ముందు మరియు వెనుక డ్యూయల్-పెటల్ డిస్క్ బ్రేక్ సెటప్‌ను కలిగి ఉండటంతో పాటు.. అదనపు భద్రత కోసం డ్యూయల్ ఛానల్ ABS ను అందిస్తోంది.

ఈ కొత్త కవాసకి Z650RS బైక్‌ను రూ. 6.99 లక్షల ధరతో సంస్థ విడుదల చేసింది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ట్విన్ మోటార్‌సైకిల్స్ రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క అత్యుత్తమ ఉత్పత్తుల్లో ఒకటిగా ఉంది. భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ బైక్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి బైక్‌కు పోటీగా కవాసకి Z650RS ను విడుదల చేసింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








