కవాసకి జెడ్ఎక్స్ 6ఆర్.. ఇప్పుడు సరికొత్త హంగులతో - పూర్తి వివరాలు
భారతదేశంలో మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో కూడా గొప్ప ప్రజాదరణ పొందిన కవాసకి తన 2025 నింజా జెడ్ఎక్స్ 6ఆర్ కేఆర్‌టీ ఎడిషన్‌ను మరియు స్టాండర్డ్ జెడ్ఎక్స్ 6ఆర్ మోడళ్లను రెండు కొత్త రంగులలో విడుదల చేసింది. కలర్ ఆప్షన్స్ కాకుండా.. ఇందులో ఎలాంటి మార్పులు లేదని తెలుస్తోంది. అయితే కొత్త కలర్ ఆప్షన్స్ తప్పకుండా మరింత మంది కవాసకి ప్రేమికులను ఆకర్శించే అవకాశం ఉంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ రెండు కొత్త కవాసకి బైకుల గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి తన నింజా జెడ్ఎక్స్ 6ఆర్ కేఆర్‌టీ ఎడిషన్‌ను మరియు స్టాండర్డ్ జెడ్ఎక్స్ 6ఆర్ బైకులను.. పెర్ల్ రోబోటిక్ వైట్/మెటాలిక్ గ్రాఫైట్ గ్రే మరియు మెటాలిక్ మాట్ డార్క్ గ్రే/ఎబోనీ అనే రెండు కలర్లలో అందిస్తోంది. జెడ్ఎక్స్ 6ఆర్ కేఆర్‌టీ ఎడిషన్ రెడ్ కలర్ వీల్స్ మరియు డెకాల్స్‌తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. స్టాండర్డ్ జెడ్ఎక్స్ 6ఆర్ బైక్ బ్లూ కలర్ వీల్స్ పొందుతుంది.

ప్రస్తుతం ఈ రెండు కలర్ ఆప్షన్స్ కేవలం గ్లోబల్ మార్కెట్లో మాత్రమే అమ్మకానికి ఉన్నాయి. భారతదేశంలో ప్రస్తుతానికి లేదు, ఒకవేళా ఈ కలర్ ఆప్షన్స్ మన దేశానికీ తీసుకురావడం గురించి అధికారిక ప్రకటన లేదు. ఒక్క కలర్ ఆప్షన్ కాకుండా ఈ బైకులలో ఎలాంటి యాంత్రిక మార్పులు జరగలేదు. కాబట్టి అదే ఇంజిన్ కలిగి అదే పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.
కొత్త కవాసకి నింజా జెడ్ఎక్స్ 6ఆర్ అదే 636సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ యూనిట్ పొందుతుంది. ఇది 13000 rpm వద్ద 129 హార్స్ పవర్ మరియు 11000 rpm వద్ద 69 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ కూడా అదే 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి పనితీరు పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కావున బైక్ రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందుతాడు.

ఇక హార్డ్‌వేర్ విషయానికొస్తే.. ఇది అల్యూమినియం పెరిమీటర్ ఫ్రేమ్‌తో అండర్‌పిన్ చేయబడింది. ఇందులోని 17 ఇంచెస్ చక్రాలపై పూర్తిగా అడ్జెస్టబుల్ 41 మిమీ అప్‌సైడ్‌డౌన్ ఫోర్కులు మరియు మోనోషాక్ సస్పెన్షన్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ యొక్క ముందు భాగంలో డ్యూయల్ డిస్క్‌లు.. వెనుక వైపు నిస్సిన్ కాలిపర్‌లతో డిస్క్ ఉంటుంది. ఇవన్నీ చాలా అద్భుతమైన పనితీరును అందిస్తాయి.
కవాసకి బైక్స్ అదే ఫ్రంట్ స్క్వాటింగ్ స్టాన్స్ మరియు ఎడ్జీ బాడీవర్క్‌ను కలిగి ఉంది. అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్, నాలుగు రైడింగ్ మోడ్‌లు, రెండు పవర్ మోడ్‌లు, మూడు ట్రాక్షన్ కంట్రోల్ లెవెల్‌లు, క్విక్ షిఫ్టర్, ఏబీఎస్ వంటి కొన్ని రైడర్ మోడ్స్ కూడా బైక్ స్పోర్టీని మరింత పెంచుతాయి. ఈ బైకులో బ్లూటూత్ కనెక్టివిటీ మరియు ఫుల్ ఎల్ఈడీ లైటింగ్‌తో కలర్ TFT స్క్రీన్ వంటివి ఉన్నాయి.

మార్కెట్లో కవాసకి జెడ్ఎక్స్-6ఆర్ ధర ప్రారంభంలో రూ.11.09 లక్షలు ఉండేది. ఇప్పుడు ధరల పెరుగుదల తరువాత రూ.11.20 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరింది. మొత్తం మీద కంపెనీ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూ ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులను లేదా అప్డేటెడ్ బైకులను లాంచ్ చేస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్ బైకులను లాంచ్ చేసింది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








