రూ.45 లక్షల బైక్ డెలివరీ.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో
భారతదేశంలో అత్యంత ఖరీదైన బైకులతో ఒకటైన కొత్త 'హోండా గోల్డ్‌వింగ్' (Honda Goldwing) డెలివరీ కేరళలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హోండా గోల్డ్‌వింగ్ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
ప్రపంచ మార్కెట్లో అత్యుత్తమ మోటార్‌సైకిళ్లలో ఒకటిగా ప్రజాదరణ పొందిన హోండా కంపెనీకి చెందిన గోల్డ్‌వింగ్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.39.90 లక్షలు. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే రూ.45 లక్షల వరకు ఉంటుంది (నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది). ఖరీదు ఎక్కువ కావడం వల్ల ఎక్కువమంది ఈ బైక్ జోలికి పోరు, కానీ ధనవంతులు, సెలబ్రిటీలు మాత్రమే ఈ బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

ఈ బైక్ డెలివరీకి సంబంధించిన వీడియోలో మీరు గమనించినట్లయితే.. కేరళకు చెందిన ఒక జంట దీన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీడియో ప్రారంభంలో వారు జీప్ కంపెనీకి చెందిన రాంగ్లర్ ఆఫ్ రోడర్ కారులో హోండా మోటార్‌సైకిల్ డీలర్‌షిప్‌కి రావడం చూడవచ్చు. ఆ జంట వారి కొడుకుతో, స్నేహితులు మరియు బంధువుల మధ్య ఈ బైక్ డెలివరీ తీసుకుంటారు.
అంతకంటే ముందు ఈ జంట 'రైడ్ ఆన్ వింగ్స్ ఆఫ్ గోల్డ్' అని రాసి ఉన్న కేక్ కట్ చేసి, ఫ్రూట్ బీర్ ఆస్వాదించడం చూడవచ్చు. ఆ తరువాత వారు తమ కొడుకుతో కలిసి బైకు మీద ఉన్న బ్లాక్ షీట్ తొలగిస్తారు. పిల్లాడు హెల్మెట్ ధరించి ఉండటం ఇక్కడ గమనించవచ్చు. మహిళ కూడా హెల్మెట్ ధరించి బైక్ స్టార్ట్ చేస్తుంది. అప్పటికే ఆమె రైడింగ్ జాకెట్ ధరించి ఉంది.

మహిళ బైక్ స్టార్ట్ చేసి పిల్లాన్ని వెనుక కూర్చోబెట్టుకుని డీలర్షిప్ మెయిన్ డోర్ నుంచి బయటకు వస్తుంది. ఆ తరువాత వారి వెనుక మరో వ్యక్తి బైకు మీద వెళ్లడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే సుమారు రూ. 45 లక్షల బైక్ అంటే అదెలా ఉంటుందని చాలామంది చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ బైక్ ఎంతోమంది వాహన ప్రేమికుల మనసు దోచేసింది.
హోండా గోల్డ్‌వింగ్ (Honda Goldwing)
ఇక హోండా మోటార్‌సైకిల్ కంపెనీ యొక్క గోల్డ్‌వింగ్ బైక్ విషయానికి వస్తే.. ఇది దేశంలో అత్యంత పొడవైన క్రూయిజర్ బైక్. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో 7 ఇంచెస్ TFT డిస్‌ప్లే ఉంటుంది. బిల్డ్ ఇన్ యూనిట్లతో రెండు అనలాగ్ యూనిట్లు, చిన్న డిజిటల్ స్క్రీన్ కూడా ఉన్నాయి.
గోల్డ్‌వింగ్ బైక్ 1833 సీసీ లిక్విడ్ కూల్డ్ 6 సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5500 rpm వద్ద 126 పీఎస్ పవర్ మరియు 4500 rpm వద్ద 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ కలిగిన ఈ బైక్ పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇందులో మాన్యువల్ క్లచ్ లేదని తెలుస్తోంది.
అత్యంత ఖరీదైన హోండా గోల్డ్‌వింగ్ బైకు నటుడు ఆర్ మాధవన్ కూడా కలిగి ఉన్నారు. ఈయన గత ఏడాది ఆగష్టులో ఈ బైక్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ బైక్ మాత్రమే కాకుండా ఈయన వద్ద యమహా కంపెనీకి చెందిన వీ మ్యాక్స్, ఇండియన్ రోడ్ మాస్టర్, ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ వంటివి కలిగి ఉన్నారు. దీనికి సంబంధించిన చాలా ఫోటోలు వీడియోలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications








