కైనెటిక్ E- Luna కి అరుదైన గౌరవం.. బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్‌గా అవార్డు సొంతం
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న కైనెటిక్ గ్రీన్ అరుదైన ఘనత సాధించింది. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన EMOBILITY+ స్టేట్ లీడర్‌షిప్ అవార్డ్స్(EMOBILITY+ State Leadership Awards) 2024లో తన కొత్త ఎలక్ట్రిక్ వాహనం E Luna.. బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్‌గా అవార్డును సాధించింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
19070, 1980 ల దశకంలో టూ వీలర్ మోపెడ్ కైనెటిక్ లూనా(Kinetic Luna) కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రూరల్, అర్బన్ ప్రాంతాల్లో ఓ వెలుగు వెలిగిన లూనా.. తర్వాతర్వాత భారత మార్కెట్‌ను మెల్లగా మోటార్ సైకిళ్లు కైవసం చేసుకోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరగడంతో.. కైనెటిక్ గ్రీన్ మళ్లీ లూనాను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకువచ్చింది.

తక్కువ ధరలో స్టైలిష్ డిజైన్‌తో మార్కెట్లో ప్రవేశించిన Kinetic E Luna కు ప్రజాదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో EMOBILITY+ స్టేట్ లీడర్‌షిప్ అవార్డ్స్ 2024లో ప్రతిష్టాత్మకమైన అవార్డును E Luna సొంతం చేసుకోవడం ద్వారా.. దాని అసాధారణమైన పనితీరు మరియు ఆకర్షణను తెలియజేస్తుంది. స్థిరమైన రవాణాను అభివృద్ధి చేయడంలో దాని పాత్రను హైలైట్ చేస్తుంది.
ఎలక్ట్రిక్ వాహనాలను మరింత సరసమైన ధరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కృషి చేస్తూ ఇ లూనాను తీసుకువచ్చిన కైనెటిక్ గ్రీన్‌కు అరుదైన గౌరవం లభిచింది. అవార్డుపై కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు మరియు CEO శ్రీమతి సులజ్జ ఫిరోడియా మోత్వాని హర్షం వ్యక్తం చేశారు. EMOBILITY స్టేట్ లీడర్‌షిప్ అవార్డ్స్ 2024లో ఉత్తమ ఎలక్ట్రిక్ వాహనంగా E-Luna అవార్డును అందుకోవడం గౌరవంగా ఉందన్నారు.

ఈ గుర్తింపు తమ నిర్విరామ సాధనకు నిదర్శనమని.. భారత్‌లో E Luna అనేది ఆలోచనాత్మకంగా రూపొందించబడిన ఎలక్ట్రిక్ వాహనమని ఫిరోడియా పేర్కొన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు ప్రత్యామ్నాయంగా.. ఎక్కువగా పట్టణ జనాభాను ఆకర్షించేలా రూపొందించామన్నారు. E-Luna ఒక ప్రత్యేకమైన స్టైలిష్, ధృడమైన మరియు బహుముఖ డిజైన్‌ను కలిగి ఉందని వివరించారు.
కైనెటిక్ ఇ లూనా మెట్రో నగరాల్లోనే కాకుండా, టైర్ 2 మరియు 3 పట్టణాల్లో కూడా ప్రయాణానికి అనుకూలంగా ఉంటుందని ఫిరోడియా మోత్వానీ పేర్కొన్నారు. సరసమైన ధరలో అందరికీ అందుబాటులో ఇ- మొబిలిటీ లక్ష్యంగా E-Luna ను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇ లూనా దాని ప్రత్యేకమైన మెటాలిక్ కలర్, డ్యూయల్-ట్యూబ్యులర్, హై స్ట్రెంగ్త్ స్టీల్ ఛాసిస్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది.

E-Luna లో అధునాతన 2.0 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో సహా అనేక ఆకట్టుకునే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ పూర్తి ఛార్జ్‌పై 110 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది. BLDC మిడ్-మౌంట్ మోటార్ 2.2 kW పీక్ కెపాసిటీతో మార్కెట్లో అందుబాటులో ఉంది. గంటకు 50 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
స్పెక్స్ పరంగా కైనెటిక్ ఇ లూనాలో కాంబి-బ్రేకింగ్ సిస్టమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, పెద్ద 16 అంగుళాల వీల్స్, USB ఛార్జింగ్ పోర్ట్, రైడర్ ఫ్రెండ్లీగా మూడు రైడింగ్ మోడ్‌లు, ఫ్లెక్సిబిలిటీ కోసం వేరు చేయగలిగిన వెనుక సీటు మరియు అదనపు భద్రత కోసం సైడ్ స్టాండ్ సెన్సార్ వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టూ వీలర్ విభాగంలో ఉత్తమ ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్‌గా కైనెటిక్ ఇ లూనా అవార్డును సొంతం చేసుకోవడం తమ ప్రయాణంలో ముఖ్యమైన విజయమని.. కైనెటిక్ గ్రీన్ టూవీలర్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ అన్నారు. భారత్‌లో మొబిలిటీ ల్యాండ్‌స్కేప్, ఈవీ రెవల్యూషన్లో ముందంజలో ఉన్నందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. తక్కువ ధరలో ఇన్ని అసాధారణైన ప్యాకేజీని అందించడం ఇ లూనాకే చెల్లిందని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications








