Kinetic E-Luna మార్కెట్లోకి మళ్లీ కైనెటిక్ లూనా.. ఈనెల 26 నుంచే బుకింగ్స్.. రూ. 500 చెల్లిస్తే చాలు.!!
కైనెటిక్ లూనా(Kinetic Luna) 1970 లలో భారత మార్కెట్లో ఎక్కువగా వినిపించిన, బాగా ఫేమస్ అయిన మోటార్ సైకిల్. మోపెడ్ అంటే ఎవరైనా సరే లూనా అని ఠక్కున చెప్పేస్తారు. కాగా బైక్‌లు, స్కూటర్ల రాకతో లూనా అంతరించిపోయింది. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ టూ వీలర్ల హవా కొనసాగుతుండటంతో లూనా మళ్లీ రోడ్లపైకి రానుంది.
కైనెటిక్ లూనా.. ఈ మోటార్‌సైకిల్ గురించి తెలియని వారుండరు. 1970 లలో కైనెటిక్ లూనా 50cc మోటార్ సైకిల్ బాగా ఫేమస్. సైకిల్ తర్వాత టూ వీలర్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు లూనాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అప్పట్లో మోపెడ్ వాటాలో 95 శాతం లూనాదే. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ స్కూటర్ ఇది. గ్రామాల్లో వ్యవసాయ, వ్యక్తిగత అవసరాల కోసం కూడా ఎక్కువగా వినియోగించేవారు.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, లో మెయింటెనెన్స్, తక్కువ ధర కారణంగా ఐసీఈ వాహనాలకు ప్రత్యమ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో పోటీని తట్టుకోలేక 2000 దశకంలో ఉత్పత్తిని నిలిపివేసిన కైనెటిక్ గ్రూప్.. ఇప్పడు మళ్లీ ఎలక్ట్రిక్ లూనా రూపంలో అడుగుపెట్టబోతోంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఉత్పత్తిని ప్రారంభించింది.
ఈ మేరకు కైనెటిక్ గ్రీన్(Kinetic Green) కీలక ప్రకటన విడుదల చేసింది. వచ్చే నెల ఫిబ్రవరి ప్రథమార్థంలో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా రేపటి నుంచే(జనవరి 26 శుక్రవారం) లూనా ఎలక్ట్రిక్ బుకింగ్‌లను ప్రారంభించనుంది. కాగా మార్కెట్లో ఇప్పటికే అనేక మోడళ్లలో ఎలక్ట్రిక్ టూ వీలర్లు అందుబాటులో ఉండగా.. కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్‌గా కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

కాగా కైనెటిక్ గ్రీన్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశ భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా గతంలో లూనా స్కూటర్(Kinetic Luna Electric) ఎలా సేవలందించిందో.. ఇప్పుడు E- లూనాను కూడా మెట్రో పాలిటన్ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల రోడ్లకు అనుగుణంగా కూడా ప్రాధాన్యతనిస్తూ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దృఢమైన, క్వాలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా లూనాను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
కైనెటిక్ గ్రీన్ ఫౌండర్, సీఈవో ఫిరోడియా మోత్వానీ.. లూనా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌పై మాట్లాడారు. ప్రస్తుత తరంలో టెక్నాలజీ పరంగా మారుతున్న కస్టమర్ల అవసరాలకనుగుణంగా వారి అభిరుచులకు ప్రాధాన్యతనిస్తూ E- లూనాను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. సాంప్రదాయ పెట్రోల్ టూ వీలర్లకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని వెల్లడించారు.

అయితే E-Luna(Kinetic E Luna Launch) కు సంబంధించి బ్యాటరీ, రేంజ్ గురించి ఎలాంటి వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయితే చిరు వ్యాపారస్థులు, డెలివరీ ఏజెంట్లు, చిరు ఉద్యోగులకు, అన్న వర్గాల వారికి ఈ స్కూటర్ ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది. కాగా శుక్రవారం నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. కస్టమర్లు రూ. 500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరిలో కైనెటిక్ లూనా(Luna-E Bookings) లాంచ్ అవుతుండటంతో.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా కైనెటిక్ గ్రీన్.. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో తయారీ ప్లాంట్‌ను కలిగి ఉంది. ప్రతి నెలా 5,000 యూనిట్ల ఎలక్ట్రిక్ లూనాలను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని సంస్థ తెలిపింది.

అంతే కాకుండా కైనెటిక్ ఇ-లూనా ఎలక్ట్రిక్ మోపెడ్ ప్రస్తుతం అమెజాన్‌తో సహా కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో విక్రయానికి జాబితా చేయబడినట్లుగా సమాచారం. ఇది ఉత్కంఠ మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాగా కైనెటిక్ ఇ-లూనా ధరలు కూడా వెల్లడయ్యాయి. ఎలక్ట్రిక్ మోపెడ్ ప్రారంభ ధర రూ.71,990(ఎక్స్-షోరూమ్).
అదే సమయంలో కైనెటిక్ ఇ-లూనా టాప్ వేరియంట్ ధర రూ.74,990(ఎక్స్-షోరూమ్) మాత్రమే అని సమాచారం. కైనెటిక్ ఇ-లూనా ఎలక్ట్రిక్ మోపెడ్ 2 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పూర్తి ఛార్జింగ్‌పై దీని రేంజ్ 110 కిలోమీటర్లు. కైనెటిక్ ఇ-లూనాలో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం పట్టవచ్చని తెలుస్తోంది.
ఇంకా కైనెటిక్ ఇ-లూనా ఎలక్ట్రిక్ మోపెడ్ 96 కిలోల బరువు ఉండగా.. గరిష్ఠంగా గంటకు 50 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ సమాచారం కైనెటిక్ ఈ-లూనా ఎలక్ట్రిక్ మోపెడ్ రాక కోసం ఎదురుచూస్తున్న వారిలో మరింత ఆసక్తిని పెంచింది. అయితే ఈ సమాచారం ఏదీ ఇంకా Kinetic Green అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించలేదు. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








