కేవలం రూ. 69000లకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఎంతో తెలుసా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. చాలా వాహనాల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల.. తక్కువ ధర వద్ద లభించే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని 'కొమాకి' ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది.
దేశీయ విఫణిలో లాంచ్ అయిన 'కొమాకి' (Komaki) ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు 'ఫ్లోరా' (Flora). ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 69000 (ఎక్స్ షోరూమ్). ఇది చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి, రైడర్‌కు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ అందిస్తోంది. కాబట్టి ఈ కొత్త కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువమందిని ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.

కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ 3000 వాట్స్ లిథియం ఆయన పెట్రో ఫాస్ఫేట్ బ్యాటరీ పొందుతుంది. ఈ బ్యాటరీ రిమూవబుల్ మరియు హీట్ ప్రూఫ్ కూడా. కాబట్టి దీని వల్ల ఎలాంటి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం లేదని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ఓకే ఫుల్ చార్జితో 80 నుంచి 100 కిమీ పరిధిని అందిస్తుంది. రోజు వారీ ప్రయాణానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అన్ని వయసుల రైడర్లను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆకట్టుకునే క్లాసిక్ డిజైన్‌తో రూపొందించింది. ఇందులో డయాగ్నోస్టిక్ మీటర్, వెనుక కూర్చునే వారికి మరింత మెరుగైన సౌకర్యం కోసం అడిషనల్ బ్యాక్‌రెస్ట్ మరియు పార్కింగ్ అండ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉంటాయి. బూట్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి జెట్ బ్లాక్, గార్నెట్ రెడ్, స్టీల్ గ్రే మరియు శాక్రమెంటో గ్రీన్ కలర్స్. సేఫ్టీకి కూడా కంపెనీ పెద్ద పీట వేసింది. కాబట్టి ఈ స్కూటర్ డిస్క్ బ్రేక్ (ముందు వైపు), డ్రమ్ బ్రేక్ (వెనుక వైపు) పొందుతుంది. మంచి బ్రేకింగ్ సిస్టం వల్ల రైడర్ భద్రతా భావాన్ని పొందుతాడు.
ఆధునిక భారతదేశంలో ఫ్యూయెల్ వాహనాల కంటే కూడా ఎలక్ట్రిక్ బైకులు ఎక్కువగా విడుదలవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీలు కూడా తమ ఉనికిని చాటుకోవడానికి మరియు కస్టమర్లకు మరింత చేరువ కావడానికి ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. అయితే ఎన్ని కొత్త ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ మార్కెట్లో అడుగుపెట్టినా తక్కువ ధర వద్ద లభించే వాటికే ఎక్కువ డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాము.

కొమాకి కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూ.. తనదైన రీతిలో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కేవలం రూ.69000 ధర వద్ద ఫ్లోరా స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ తప్పకుండా మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ ఎలట్రిక్ స్కూటర్ ఎలాంటి అమ్మకాలు పొందుతుందనేది తెలియాల్సిన విషయం. కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








