రూ. 69,000 కే కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్... స్వాపబుల్ బ్యాటరీ ప్రత్యేకత
భారత మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది. ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ కొమాకి ఎలక్ట్రిక్.. ఫ్లోరా పేరుతో ఈవీని అప్‌డేట్ చేసి విడుదల చేసింది. చాలా తక్కువ ధరలో సంస్థ దీనిని ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ బ్యాటరీ, రేంజ్, ఫీచర్లు పూర్తి సమాచారం ఈ కథనంలో..
మార్కెట్లోకి రోజురోజుకీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల అవుతున్నాయి. ఐసీఈ వాహనాలకు ప్రత్యామ్నాయంగా కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా వాహన తయారీ కంపెనీలు సైతం అధునాతన టెక్నాలజీతో స్కూటర్లను తీసుకువస్తున్నాయి. ఓలా, ఏథర్ ఎనర్జీ, సింపుల్ ఎనర్జీ ఇంకా అనేక స్టార్టప్‌లు ఈ రంగంలోకి అడుగుపెట్టి తమ ఉనికిని ప్రదర్శిస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రముఖ స్టార్టప్ కొమాకి ఎలక్ట్రిక్(Komaki Electric) తన Flora స్కూటర్‌ను అప్‌డేట్‌తో విడుదల చేసింది. ధర రూ. 69,000 తో సంస్థ దీనిని ప్రవేశపెట్టింది. ఇందులో Lithium Ion Ferro Phosphate (LiFePO4) బ్యాటరీ ప్యాక్‌ను అమర్చింది. ఇది స్వాపబుల్ బ్యాటరీ. దీని ద్వారా రైడర్ ప్రయాణంలో ఉన్నప్పుడు సడెన్‌గా ఛార్జింగ్ అయిపోయినా వెంటనే బ్యాటరీని మార్చుకోవచ్చు.
Komaki Flora స్కూటర్.. పూర్తి ఛార్జ్‌పై 85 కి.మీ నుంచి 100 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో నవీకరించబడిన ఫ్లోరా స్వీయ-నిర్ధారణ మీటర్, అదనపు బ్యాక్‌రెస్ట్, పార్కింగ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ మరియు బూట్ స్పేస్‌తో సౌకర్యవంతమైన సీటుతో వస్తుంది. కొత్త డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంటుంది.

కొమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ముందువైపు డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. స్టీల్ ఛాసిస్‌తో దీన్ని నిర్మించారు. కాగా ఈ స్కూటర్ నాలుగు ఆకర్షణీయమైన కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. కోమాకి ఫ్లోరా స్కూటర్.. జెట్ బ్లాక్, గార్నెట్ రెడ్, స్టీల్ గ్రే మరియు శాక్రమెంటో గ్రీన్ కలర్స్‌లో కస్టమర్లు తమకు నచ్చిన కలర్‌ను సెలెక్ చేసుకోవచ్చు.
కొమాకి ఫ్లోరా రీలాంచ్‌పై సంస్థ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడారు. రీలాంచ్‌పై హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో క్లీన్ మొబిలిటీ మార్కెట్‌లో ఫ్లోరా స్కూటర్ విప్లవాత్మకమైన మార్పులను సృష్టిస్తుందని పేర్కొన్నారు. స్వాపబుల్ బ్యాటరీ ద్వారా కస్టమర్లకు జర్నీ సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.

Ola, Ether, TVS iQube వంటి మోడల్‌లు అధిక డిమాండ్‌తో భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో హవా సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో తక్కువ ధరలో రీలాంచ్ అయిన Komaki Flora ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మంచి సేల్స్‌ను సాధిస్తుందనే నమ్మకంతో ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ స్కూటర్.. కస్టమర్లను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








