రూ.59 వేల ప్రారంభ ధరతో కొత్త ఈవీ స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌తో 150 కి.మీలు.. మధ్యతరగతి కలలు నిజం కానున్నాయి

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉంది. దీంతో పెట్రోల్, డీజిల్ కార్లు, బైకుల విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో ఈవీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకుల వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో తయారీదారులు కొత్త కొత్త ఫీచర్లతో టూవీలర్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలు అయినటువంటి ఓలా, ఏథర్ సంస్థల కంటే ముందుగానే ఇండియాలో ఈవీ టూవీలర్ తయారీదారుగా ఉన్నటువంటి కొమాకి( Komaki) మార్కెట్లోకి కొత్త సిరీస్‌ను విడుదల చేసింది. దీని పేరు 'ఎంజీ ప్రో లిథియం (MG Pro Lithium)'. కంపెనీ ఈ సిరీస్‌ను 'హర్ ఘర్ కోమాకి' అనే ప్రచారంలో భాగంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. భారతీయ ప్రజల రోజువారీ అవసరాలు తీర్చడానికి వీటిని ప్రత్యేకంగా విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

కొమాకి బ్రాండ్ ఇండియన్ మార్కెట్లోకి ఈవీ టూవీలర్ల పరంగా నమ్మకమైన కంపెనీగా పేరుంది. ప్రస్తుతం ఛార్జింగ్, బ్యాటరీల సమస్యలు, స్కూటర్ కాలిపోవడం వంటి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ కొమాకి కంపెనీ వాహనాలపై దేశీయ ప్రజల్లో ఎలాంటి సమస్యలు లేని స్కూటర్లుగా మంచి పేరుంది. వీటి ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దేశీయ మధ్యతరగతి వినియోగదారులకు అనుగుణంగానే వీటి ధరలు ఉంటాయి.

Komaki Mg Pro Series Electric Scooter

ఇదిలా ఉంటే, కొమాకి బ్రాండ్ నుంచి వచ్చిన ఎంజీ ప్రో లిథియం సిరీస్ ప్రారంభ ధర రూ.59,999(ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది ప్రధానంగా ఎంజీ ప్రో ఎల్‌ఐ( MG Pro Li), ఎంజీ ప్రో వీ (MG Pro V), ఎంజీ ప్రో ప్లస్(MG Pro Plus) అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటిల్లో కంపెనీ ప్రత్యేకంగా శక్తివంతమైన లిథియం అయాన్ బ్యాటరీని అందించింది.

వీటి బ్యాటరీ విషయానికి వస్తే, ఎంజీ ప్రో ఎల్‌ఐ మోడల్‌లో 1.75 kW బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది పూర్తి ఛార్జింగ్‌తో దాదాపు 75 కి.మీల వరకు వెళ్తుంది. అదే ఎంజీ ప్రో వీ వేరియంట్ మాత్రం మొదటి దాని కంటే మరింత ఎక్కువగా 2.2 kW బ్యాటరీని కలిగి ఉంది. దీంతో ఒక్కసారి ఛార్జింగ్‌తో 100 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.

అదే ఎంజీ ప్రో ప్లస్ అత్యధికంగా 2.7 kW బ్యాటరీతో, సింగిల్ ఛార్జ్‌పై 150 కిమీ వరకు వెళ్తుంది. మరో కీలక విషయం ఏమిటంటే ఇతర కంపెనీలకు చెందిన పలు మోడళ్లు ఛార్జింగ్ సమస్యను ఎదుర్కొంటున్న తరుణంలో కొమాకి తన వాహనాల్లో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఫాస్ట్ ఛార్జర్ సదుపాయాన్ని ఇచ్చింది. ఈ స్కూటర్ల బ్యాటరీ 4 నుంచి 5 గంటల్లోనే పూర్తి ఛార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది.

ఈ సిరీస్ స్కూటర్లలో అత్యాధునిక ఫీచర్లను అందించారు. ప్రధానంగా దీనిలో ప్రత్యేకంగా బ్యాటరీ ప్యాక్ ఫెర్రో-ఫాస్ఫేట్ టెక్నాలజీని అందించారు. దీంతో దీనిలో అమర్చిన 30కు పైగా సెన్సార్ల ద్వారా ఏదైనా లోపాలు తలెత్తినట్లయితే వాటిని గుర్తించి అలర్ట్ ద్వారా తెలియజేస్తుంది. అలాగే సమస్యలను తనంతట తానుగా పరిష్కరించుకోవడానికి సరికొత్త టెక్నాలజీని కొమాకి అందించింది.

లోపల వచ్చిన చిన్న చిన్న సమస్యలను గుర్తించి దానికదే సరి చేసుకుంటుంది. వీటిలో పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్‌,అడ్వాన్స్ రీజియన్‌తో వైర్‌లెస్ కంట్రోలర్,లాక్ బై రిమోట్ ఫంక్షన్, మొబైల్ ఛార్జింగ్ స్లాట్, వాహనాన్ని దొంగలించకుండా ఉండటానికి యాంటీ-థెఫ్ట్ లాక్, టెలిస్కోపిక్ షాకర్, సెల్ఫ్-డయాగ్నసిస్ వంటి ఇంకా పలు ఫీచర్లు ఉన్నాయి.

ఎంజీ ప్రో ఎల్‌ఐ ధర రూ.59,999 గా ఉంది. అదే, ఎంజీ ప్రో వీ ధర రూ.69,999గా, ఎంజీ ప్రో ప్రో ప్లస్ వేరియంట్ ధర రూ.74,999(ఎక్స్-షోరూమ్) గా ఉంది. కొమాకి వారంటీని సైతం అందిస్తుంది. ఛార్జర్‌పై 1-సంవత్సరం వారంటీ, మోటారు, బ్యాటరీ, కంట్రోలర్‌పై 3 సంవత్సరాల లేదా 30,000 కిమీ వారంటీని కూడా ఇస్తున్నట్లు వెల్లడించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 27, 2024, 8:30 [IST]
English summary
Komaki launched mg pro series electric scooter price starts from rs 59999
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+