500 కిలోల లోడ్‌ సామర్థ్యంతో కొమాకి నుంచి ఇ స్కూటర్‌ లాంచ్‌.. ఫ్యామిలీ, కమర్షియల్‌ అవసరాలకు బెస్ట్‌ ఆప్షన్

భారత మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదలైంది. ఎలక్ట్రిక్ టూ వీలర్‌ విభాగంలో సందడి చేస్తున్న కొమాకి(Komaki) బ్రాండ్‌ తాజాగా కొత్త త్రీ వీలర్‌ ఈవీని విడుదల చేసింది. Komaki XGT CAT 3.0 పేరుతో ఇ-లోడర్‌ను ప్రవేశపట్టింది. అయితే ఇది మూడు చక్రాల స్కూటర్‌. ధర, ఫీచర్లు పూర్తి సమాచారం ఈ కథనంలో..

భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెరుగుతున్న టెక్నాలజీ, మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త మోడళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతున్నాయి. అయితే ఈవీ మార్కెట్‌లో అగ్ర స్థానం టూ వీలర్లదే అని చెప్పవచ్చు. ఈ క్రమంలో వాణిజ్య, వ్యక్తిగత అవసరాలకు సరిపోయేలా ప్రముఖ బ్రాండ్‌ Komaki సరికొత్త త్రీ వీలర్‌ మోడల్‌ను ప్రవేశపెట్టింది.

Komaki-XGT-CAT-3.0-E-Scooter-Launch

మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ త్రీ-వీలర్లు.. కాంపాక్ట్ సైజు, ఖర్చు, కెపాసిటీతో పాటు రద్దీగా ఉండే రోడ్లపై సైతం చురుకుగా ప్రయాణించడంతో వేగంగా ప్రజాదరణ పొందాయి. ఈ క్రమంలో లాజిస్టిక్స్ మరియు ఇంట్రా-సిటీ రవాణాకు సరైన పరిష్కారాన్ని చూపిస్తూ వివిధ కార్గో అవసరాలను Komaki XGT CAT 3.0 పరిష్కరిస్తుందని కంపెనీ వెల్లడించింది.

అంతే కాకుండా Komaki XGT CAT 3.0 స్కూటర్ దాని బలమైన ఐరన్ బాడీతో ఇ-లోడింగ్ వాహనాల కోసం కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. అద్భుతమైన బిల్ట్‌ క్వాలిటీతో పాటు స్టెబిలిటీని అందిస్తుందని పేర్కొంది. కాగా ఈ త్రీ వీలర్‌ ఇ స్కూటర్‌లో విశాలమైన మరియు సౌకర్యవంతమైన సీటుతో పాటు విశాలమైన ఫుట్‌బోర్డ్‌ ఉంది. ఈ కారణంగా సాధారణ ద్విచక్ర వాహనాల కంటే మెరుగ్గా ఉంటుంది.

Komaki-XGT-CAT-3.0-E-Scooter-Launch

Komaki XGT CAT 3.0 త్రీ వీలర్‌ ధర రూ.1.6 లక్షలు(ఎక్స్-షోరూమ్) గా సంస్థ వెల్లడించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకంగా వికలాంగులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు దీనిని నడపడం కూడా చాలు సులువు. ఇక ఈ స్కూటర్‌లోని మరో ప్రత్యేకత.. ఈ వినూత్న వాహనం 500 కిలోల వరకు లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Komaki-XGT-CAT-3.0-E-Scooter-Launch

లోడ్‌ను బట్టి Komaki XGT CAT 3.0 స్కూటర్‌ దాదాపు 120 నుంచి 180 కి.మీల ఆకట్టుకునే రేంజ్‌ను అందిస్తుందని సంస్థ తెలిపింది. ఫీచరల విషయానికొస్తే ఇందులో 12-అంగుళాల మూడు చక్రాలు, సేఫ్టీ కోసం బ్రేక్ లివర్‌లతో కూడిన ట్రిపుల్ డిస్క్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

Komaki-XGT-CAT-3.0-E-Scooter-Launch

మొబైల్ ఛార్జింగ్ పాయింట్, యాంటీ థెఫ్ట్ లాక్, రిమోట్ లాక్, టెలిస్కోపిక్ షాక్‌లు, పార్కింగ్ అసిస్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లతో Komaki XGT CAT 3.0 స్కూటర్‌ను సంస్థ ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్‌లో పోర్టబుల్ ఛార్జర్‌తో కూడిన ఫైర్ రెసిస్టెంట్ గ్రాఫేన్ బ్యాటరీని అమర్చినట్లు సంస్థ వెల్లడించింది.

Komaki XGT CAT 3.0 స్కూటర్‌లో వైర్‌లెస్ అప్‌డేట్‌లతో కలర్‌ఫుల్ డ్యాష్‌బోర్డ్ ద్వారా రియల్ టైమ్ రైడ్ సమాచారాన్ని వీక్షించేలా రూపొందించారు. ఈ సిస్టమ్ రైడర్‌కు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా 500 కిలోల లోడ్ సామర్థ్యంతో వ్యవహరించేటప్పుడు కూడా మెరుగైన పనితీరు, సామర్థ్యం, ​​స్థిరత్వం మరియు భద్రతను అందిస్తుందని స్పష్టం చేసింది.

Komaki-XGT-CAT-3.0-E-Scooter-Launch

రైడర్ల భద్రత, సౌకర్యంతో పాటు పనితీరుకు ప్రాధాన్యతనిస్తూ వారి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా Komaki XGT CAT 3.0 స్కూటర్‌ను డిజైన్‌ చేసినట్లు కొమాకి ఎలక్ట్రిక్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా తెలిపారు. ఇందులోని కొత్త ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికత ఈవీ మార్కెట్లో గణనీయమైన ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. వాణిజ్య, వ్యక్తిగత అవసరాలకు సమర్థవంతమైన పరిష్కారం చూపిస్తుందని పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, February 2, 2024, 14:10 [IST]
English summary
Komaki launched xgt cat 3 0 electric scooter price features details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+