కమర్షియల్ అవసరాల కోసం కొమాకి CAT 2.0 NXT లాంచ్.. వారికి రూ. 5000 క్యాష్‌బ్యాక్
కమర్షియల్ అవసరాల కోసం భారత మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ వాహనం(Electric vehicle) విడుదలైంది. ఇప్పటికీ ఈ సెగ్మెంట్‌లో కొన్ని ఎలక్ట్రిక్ మోపెడ్‌లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ స్టార్టప్ ఎలక్ట్రిక్ కంపెనీ 'కొమాకి' తన క్యాట్ 2.0 NXT ఎలక్ట్రిక్ మోపెడ్‌ను లాంచ్ చేసింది.
దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా స్కూటర్లు, మోపెడ్‌లు కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. కమర్షియల్ అవసరాల(Commercial E Vehicles) కోసం సరసమైన ధరలో మోపెడ్‌లు విడుదలవుతుండగా.. ఇటీవల కైనెటిక్ ఎనర్జీ తన ఫేమస్ లూనాను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో కొమాకి మరో ఇ మోపెడ్‌ను మరిన్ని ఫీచర్లతో తీసుకువచ్చింది.

లాస్ట్ మోల్ డెలివరీ లక్ష్యంగా Komaki కొత్త CAT 2.0 NXT ని తీసుకువచ్చింది. దానికి అనుగుణంగా 350 కిలోల వరకు లోడ్ సామర్థ్యాన్ని ఈ మోపెడ్ అందిస్తుంది. కన్వర్టిబుల్ సీటింగ్ ఇందులో ప్రత్యేకత. ఇది ఐరన్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. దీని కన్వర్టిబుల్ డిజైన్ అతుకులు లేకుండా లోడర్‌గా మార్చడానికి వీలుంటుంది. విభిన్న రవాణా అవసరాలను తీర్చడానికి సౌకర్యంగా ఉంటుందని సంస్థ తెలిపింది.
కొమాకి Cat 2.0 NXT ఫీచర్లు: కొత్త Komaki Cat 2.0 NXT ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ముందు భాగంలో LED ల్యాంప్స్, BLDC హబ్ మోటార్, పార్కింగ్ అసిస్ట్, రివర్స్ అసిస్ట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ మరియు ఆరు హైడ్రాలిక్ రియర్ సస్పెన్షన్‌తో సహా అనేక ఫీచర్లతో రైడర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

వీటితో పాటు కొమాకి Cat 2.0 NXT లో ఫోల్డబుల్ బ్యాక్‌రెస్ట్, అదనపు స్టోరేజ్ స్పేస్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ అప్‌డేట్‌లు, ప్రయాణంలో పరికరాలను ఛార్జింగ్ చేయడానికి USB పోర్ట్ మరియు ఇతర ఫీచర్లతో పాటు అదనపు ఫుట్ రెస్ట్‌లను సంస్థ అందిస్తోంది.
Komaki Cat 2.0 NXT బ్యాటరీ ప్యాక్: కొమాకి Cat 2.0 NXT ఎలక్ట్రిక్ మోపెడ్ బ్యాటరీ ప్యాక్ విషయానికొస్తే ఇందులో 42 Ah LiPO4 బ్యాటరీని అమర్చారు. పూర్తి ఛార్జ్‌పై 110 కి.మీ నుండి 140 కి.మీల మధ్య రేంజ్‌ను అందిస్తుంది. గరిష్ఠంగా ఈ ఈవీ 79 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్‌ల మాదిరిగానే, Komaki Cat 2.0 NXT కూడా పోర్టబుల్ ఛార్జర్ సదుపాయాన్ని కలిగి ఉంది. దీని ద్వారా బ్యాటరీని కేవలం నాలుగైదు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ నుంచి 140 కి.మీ వరకు హాయిగా ప్రయాణించేలా బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.
ధర: కొత్త Komaki Cat 2.0 NXT ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,500 గా ఉంది. లాస్ట్ మైల్ డెలివరీ ఆపరేటర్లను లక్ష్యంగా కొమాకి ఈ ఎలక్ట్రిక్ మోపెడ్‌ను తీసుకువచ్చింది. ఇక్కడ కస్టమర్ల కోసం కొమాకి బంపర్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఏప్రిల్ 30 లోపు ఈ స్కూటర్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 5,000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








