రూ. 49,999 లకే సింగిల్ ఛార్జ్‌పై 150 కి.మీ ప్రయాణించే స్కూటర్లు విడుదల.. టాప్ స్కూటర్లకు తీసిపోని ఫీచర్లు
ప్రస్తుతం పండుగ సీజన్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్‌ని పెంచుకునేందుకు పలు కంపెనీలు ఆకర్షణీయమైన ధరలో స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇది వరకే అందుబాటులో ఉన్న మోడళ్లపై ఆఫర్లను అందిస్తుండగా.. కొన్ని కొత్త మోడళ్లను కూడా తీసుకువస్తున్నాయి. దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కోమాకి పండుగ సీజన్‌ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. కోమాకి ఎక్స్- వన్ ప్రైమ్ (Komaki X-One Prime), ఎక్స్ -1 ఏస్ (Komaki X-One ACE) మోడళ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర, ఇతర ఫీచర్లపై ఓ లుక్కేయండి.
ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ పండుగ సీజన్‌లో తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. 'బాస్' సేల్‌లో భాగంగా ఓలా ఎస్1 ప్రస్తుతం రూ.49,999కే లభిస్తోంది. అలాగే టీవీఎస్ ఐక్యూబ్‌పై రూ .27,000 వరకు ప్రయోజనాలను ఆ కంపెనీ అందిస్తోంది. ఆకర్షణీయమైన ధరలో వినూత్న ఫీచర్లతో రెండు ఈ-స్కూటర్లను కోమాకి విడుదల చేసింది.

కోమాకి ఎక్స్-1 ప్రైమ్ ధరను కేవలం రూ.49,999 లకే విడుదల చేసింది. మరోవైపు ఎక్స్-1 ఏస్ ధర రూ.59,999గా ఉంది. ఇవి రెండు ఎక్స్ షోరూమ్ ధరలు. ఈ ధర ఈవీ బ్యాటరీ, ఛార్జర్, ఇతర యాక్ససరీలతో సహా అన్ని ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ మోడళ్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించడంతో పాటు ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి కోమాకి ప్రయత్నిస్తోంది.
ఈ స్కూటర్లు గార్నెట్ రెడ్, ఫ్రాస్ట్ వైట్, జెట్ బ్లాక్, సూపర్ మెటల్ గ్రే వంటి అనేక కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. అంతే కాకుండా మెరుగైన విజిబిలిటీ కోసం LED లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఈ స్కూటర్ ప్రయాణంలో పనిచేయడానికి బీఎల్డీసీ హబ్ మోటార్లను అమర్చారు. కోమాకి ఎక్స్-1 ప్రైమ్, ఏస్ శక్తివంతమైన 22.2 కిలోవాట్ల లిథియం బ్యాటరీ ప్యాక్స్‌తో పనిచేస్తాయి.

ఈ స్కూటర్లు ఫుల్ ఛార్జ్ చేస్తే 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. వీటి బ్యాటరీలను 4 నుంచి 5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. కావున కస్టమర్లు రోజువారీ ప్రయాణం కోసం ఎటువంటి భయం లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. రైడర్లు తమ తదుపరి ప్రయాణానికి సులభంగా సిద్ధం కావచ్చు ఎందుకంటే దీని ఛార్జింగ్ సమయం చాలా తక్కువ.
మీ రైడింగ్ అనుభవాన్ని పెంచడానికి రూపొందించిన ఎక్స్ -1 ప్రైమ్, ఎక్స్ -1 ఏస్ లు రీజనరేట్ బ్రేకింగ్, ఆటో రిపేర్ సిస్టమ్ వంటి అధునాతన టెక్నాలజీతో వస్తుంది. ఇందులో పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, కీ ఫోబ్ ద్వారా కీలెస్ ఎంట్రీ ఉన్నాయి. ఇలాంటి ఫీచర్లు సాధారణంగా హైఎండ్ వాహనాల్లో మాత్రమే కనిపిస్తాయి.
తక్కువ ధరకే వచ్చే ప్రైమ్, ఏస్ వంటి స్కూటర్లలో ఈ అధునాతన ఫీచర్లను చేర్చడం ద్వారా మార్కెట్‌లో మంచి మార్కెట్‌ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. కోమాకి సంస్థ లో-స్పీడ్ వేరియంట్ల లోనూ మోటార్, బ్యాటరీ, కంట్రోలర్ కోసం 3 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ వారంటీని అందిస్తుంది. వీటి ధరలు ధర రూ.45,999 నుంచి ప్రారంభ అవుతాయి. అంతే కాకుండా 30,000 కిలోమీటర్ల వారంటీని కూడా అందిస్తోంది.
ఎక్స్-1 ఏస్, ప్రైమ్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వినియోగదారులు దేశవ్యాప్తంగా ఉన్న కోమాకి 500 కి పైగా స్టోర్లలో ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. బ్రాండ్ విస్తృతమైన నెట్‌వర్క్ ఈ మోడళ్లను సులభంగా యాక్సెస్ చేయడానికి, వాటిని నేరుగా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల భారతదేశంలోని ఇతర టాప్ ఎలక్ట్రిక్ వాహనాలకు గట్టి పోటీని ఇవ్వనున్నాయి.


Click it and Unblock the Notifications








