కేటీఎమ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. అదేంటో ఇప్పుడే తెలుసుకోండి

యువ రైడర్లకు ఇష్టమైన బైక్ బ్రాండ్ 'కేటీఎమ్' ఎట్టకేలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తన 200 డ్యూక్ బైకులను కొత్త కలర్ స్కీమ్‌లలో అందించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ పరిచయం చేయనున్న కొత్త కలర్ ఆప్షన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

కేటీఎమ్ కంపెనీ ప్రవేశపెట్టనున్న కొత్త కలర్స్ ''ఎలక్ట్రానిక్ ఆరెంజ్ మరియు డార్క్ గాల్వనో''. అంటే రాబోయే రోజుల్లో కేటీఎమ్ 200 డ్యూక్ ఈ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కొత్త కలర్ ఆప్షన్స్ కోరుకునే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. ఇప్పటికి సింగిల్ కలర్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బైక్ మరో రెండు కలర్ ఆప్షన్లను అందుకోవడంతో మొత్తం 3 రంగులలో లభిస్తుందని తెలుస్తోంది.

KTM 200 Duke

కేటీఎమ్ కంపెనీ అందించే ఈ కొత్త కలర్ బైకులు మరింత మంది కస్టమర్లను ఆకర్శించే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. రాబోయే కొత్త కలర్ కేటీఎమ్ బైక్ కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా ఎలాంటి మెకానికల్ అప్డేట్స్ పొందదు. కాబట్టి 200 డ్యూక్ బైకులో అదే 199 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. పనితీరు పరంగా కూడా ఎటువంటి మార్పులు ఉండదని సమాచారం.

కేటీఎమ్ 200 డ్యూక్ బైకులోని ఇంజిన్ 10000 rpm వద్ద 25 హార్స్ పవర్ మరియు 8000 rpm వద్ద 19.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 13.4 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ కలిగిం ఈ బైక్ మొత్తం బరువు 159 కేజీల వరకు ఉంటుంది. కాబట్టి అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. బైక్ రైడర్లకు ఉత్తమమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

KTM 200 Duke

భారతీయ మార్కెట్లో ప్రస్తుతం కేటీఎమ్ 200 డ్యూక్ ధరలు రూ. 1.98 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వద్ద అందుబాటులో ఉంది. అయితే కంపెనీ ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టడంతో ధరల్లో మార్పు ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన ధరల వివరాలు తెలియాల్సి ఉంది. కంపెనీ ఈ కలర్ ఆప్షన్లలో బైకును ప్రవేశపెట్టిన తరువాత అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

కొత్త కలర్ కేటీఎమ్ బైకులు డిజైన్ మరియు ఫీచర్లలో ఎటువంటి మార్పు ఉండదని తెలుస్తోంది. అయితే కలర్ మాత్రం చేంజ్ అవుతుంది. కాబట్టి లోగో మరియు బ్యాడ్జెస్ వంటి వాటి కలర్ మారే అవకాశం ఉంటుందని సమాచారం. అదే ఇంజిన్ ఈ బైకులో ఉంటుంది కాబట్టి పెనితీరులో ఎటువంటు మార్పులు ఉండే అవకాశం లేదు. కొత్త కలర్ ఆప్షన్స్ కారణంగా ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉండవచ్చు.

KTM 200 Duke

మార్కెట్లో ఎన్నెన్నో కొత్త బైకులు పుట్టుకొచ్చినా యువ రైడర్లు ఇప్పటికీ కేటీఎమ్ (KTM) బైకులనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి మార్కెట్లో ఈ బైక్ అమ్మకాలు ఆశాజనకంగానే ఉన్నాయి. ఈ తరుణంలో కంపెనీ కొత్త కలర్ ఆప్షన్స్ తీసుకు రానున్నట్లు ప్రకటించడం వల్ల తప్పకుండా ఈ బైక్ అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నాము. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొత్త కలర్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా ఉంటాయని సమాచారం.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, May 20, 2024, 14:30 [IST]
English summary
Ktm 200 duke new colour bikes launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+