రైడర్స్ కలల బైక్స్ వచ్చాయి.. ఇండియాలో 10 ఇంటర్నేషనల్ మోడల్స్‌ను దింపిన KTM.. రేసింగ్ ప్రపంచంలో మరో సంచలనం
ఒకప్పుడు ఇండియా మార్కెట్ గురించి అంతగా పట్టించుకోని అంతర్జాతీయ టూవీలర్ తయారీ కంపెనీలు ఇప్పుడు మాత్రం తమ అభిప్రాయాలను మార్చుకున్నాయి. సాధారణ మోడళ్లతో పాటు హై లెవల్ పనితీరు కలిగిన బైకులను ఇండియాలో లాంచ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో లాభాలను ఆర్జించడానికి ఎక్కువ అవకాశాలు ఉండటం, అలాగే, భారతీయ వినియోగదారులు హై పెర్ఫార్మెన్స్ బైకులను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో లక్షల విలువ చేసే లగ్జరీ బైకులను గ్లోబల్‌గా మంచి పేరున్న సంస్థలు దేశంలోకి పలు మోడళ్లను వరుసగా విడుదల చేస్తున్నాయి. దేశంలోని టాప్ నగరాల్లో ఎక్కువ సీసీ సామర్థ్యం కలిగిన బైకులు కొనుగోలుకు అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా యూరప్‌లోన అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీ సంస్థ అయిన కేటీఎమ్(KTM) భారీ ఇంజిన్ కలిగిన పలు మోడళ్లను ఇండియాలో విడుదల చేసంది.
KTM బైకులకు ఇప్పటికే దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇవి దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీన్ని మరింత పెంచుకోడానికి కంపెనీ ఏకంగా నాలుగు స్పెషల్ కేటగిరీలకు చెందిన అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన 10 బైకులను ఇండియాలో విడుదల చేసింది.

ఇప్పుడు విడుదల అయిన బైకులన్నీ కూడా హై పెర్ఫార్మెన్స్ లగ్జరీ కేటగిరీకి చెందినవి. ట్రావెల్, నేకెడ్, ఆఫ్-రోడ్ మోటోక్రాస్, ఆఫ్-రోడ్ ఎండ్యూరో నాలుగు ప్రధాన విభాగాల్లో గ్లోబల్‌గా మంచి డిమాండ్ ఉన్న మోడళ్లు. భారత్‌లో ఇతర కంపెనీలు మెల్లగా లగ్జరీ బైకులను విడుదల చేస్తూ తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్న తరుణంలో KTM కూడా ఒక ముందడుగు వేసి ఒకేసారి 10 బైకులను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.
లాంచ్ అయిన బైకుల్లో 1390cc వరకు ఉన్న మోడల్ సైతం ఉంది. ఈ 10 బైకులు కూడా అన్ని రోడ్లలో రైడింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఇవి ప్రస్తుతం దేశంలోని పూణె, బెంగళూరు సహా 7 ప్రధాన నగరాల్లోని అన్ని KTM ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. మరిన్ని వివరాల కోసం వినియోగదారులు స్టోర్‌లలో సంప్రదించవచ్చు.

లాంచ్ అయిన 10 మోడళ్ల వివరాలను ఒక సారి చూద్దాం, KTM నుంచి వచ్చిన అతిపెద్ద ఇంజిన్ విభాగంలో 1390సీసీ సూపర్ డ్యూక్ R ముఖ్యమైనది. దీని ధర ఏకంగా రూ.22.96 లక్షల వరకు ఉంది. తరువాత ఇదే సీరిస్‌లో 890 సీసీ ఇంజిన్‌లో Duke R విడుదల అయింది, దీని ధర రూ.14.50 లక్షలు. మరో మోడల్ KTM 1290 సూపర్ అడ్వెంచర్ S. ఇది అట్రాక్టివ్‌గా ఉంటుంది.
1290 సీసీ ఇంజిన్ విభాగంలో రెండో అతిపెద్ద ఇంజన్‌తో వచ్చింది. దీని ధర రూ.22.74 లక్షలు. తరువాత 350 సీసీ విభాగంలో KTM 350 EXC-F ధర రూ. 12.96 లక్షలు, 890 సీసీ కేటగిరీలో KTM 890 అడ్వెంచర్ R వచ్చింది, ఈ మోడల్ ధర రూ.15.80 లక్షలు.

ఇంకా, KTM 450 SX-F ధర రూ.10.25 లక్షలు, KTM 350 EXC-F ధర రూ. 12.96 లక్షలు, KTM 250 SX-F ధర రూ.9.58 లక్షలుగా ఉంది. KTM 65 SX ధర రూ.5.47 లక్షలు, KTM 85 SX ధర రూ.6.69 లక్షలు, KTM 50 SX ధర రూ.4.75 లక్షలుగా ఉంది.
కంపెనీ అన్ని వర్గాల కస్టమర్లను దృష్లిలో పెట్టుకునే ఒకేసారి 10 మోడళ్లను దేశంలో విడుదల చేసింది. తక్కువ ఇంజిన్, బడ్జెట్ ధరలో కావాలనుకునే వారి నుంచి మొదలుకుని ఎక్కువ ధరలో, భారీ ఇంజిన్ లగ్జరీ ఫీచర్ల బైకులను కావాలనుకునేవారి ఇష్టాలకు అనుగుణంగా ఈ మోడళ్లను KTM తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications








