KTM ఇయర్ ఎండ్ ఆఫర్.. భారీ ఎత్తున డిస్కౌంట్‌తో డ్యూక్ బైక్‌ను ఇంటికి తీసుకెళ్లండి.. కొద్ది రోజులే ఈ ఛాన్స్
మరికొద్ది రోజుల్లో 2024 ఏడాది ముగియనుంది. దీంతో దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ తయారీదారులు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేసుకోడానికి భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు వంటివి ఇస్తున్నారు. ఈ ధోరణి ఇటీవల కాలంలో వచ్చింది కాదు. చాలా ఏళ్లుగా కొత్త ఏడాదికి ముందు నవంబర్, డిసెంబర్ సమయంలో ఇలాంటి డిస్కౌంట్‌లను తయారీదారులు అందిస్తుంటారు. దీంతో కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తక్కువ ధరలో కార్లు, బైకులను తమ ఇంటికి తీసుకెళ్తుంటారు. ఈ నేపథ్యంలో బైకుల తయారీ దిగ్గజం కేటీఎం(ktm) ఇటీవల ముగిసిన పండగల తర్వాత మరోసారి తన ఉత్పత్తులపై తగ్గింపు ఇవ్వడానికి సిద్ధమైంది. కొత్త ఏడాదిలో తమ కలల బైక్‌ను రైడ్ చేసుకోడానికి కంపెనీ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ktm కంపెనీ తన 250 డ్యూక్ (250 duke)బైకుపై భారీ ఎత్తున తగ్గింపును ప్రకటించింది.
ktm 250 డ్యూక్‌పై ఇయర్ ఎండ్ ఆఫర్‌లో భాగంగా దాదాపు రూ.20,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన సైతం విడుదల చేసింది. సాధారణంగా ఇండియా మార్కెట్లో దీని ధర రూ.2.45 లక్షలు(ఎక్స్ షోరూమ్) వద్ద ఉంది. అయితే ఈ భారీ తగ్గింపుతో ఈ బైకును వినియోగదారులు రూ.2.25 లక్షలకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. కొత్త బైక్‌తో కొత్త ఏడాదిని ఎంతో ఉత్సాహంగా గడపవచ్చు.

250 డ్యూక్ ఒక స్పోర్ట్స్ బైక్. దీని లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ kTM బైకుల అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. రన్నింగ్‌లో వీటి నుంచి వచ్చే సౌండ్ రైడర్లను మరింత ఆకట్టుకునే విధంగా ఉంటుంది. 250 డ్యూక్ డిజైన్ కూడా సరికొత్తగా, లైట్ వెయిట్ బరువుతో ఉన్నట్లుగా ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ తగ్గింపు ఆఫర్ పరిమిత కాలం వరకు ఉంటుంది.
రూ.20,000 తగ్గింపు ఆఫర్ ఈ ఏడాది ముగింపు అంటే, డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించి ktm కంపెనీ స్పష్టమైన నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేసింది. కాబట్టి తక్కువ ధరలో స్పోర్ట్స్ బైక్‌ను సొంతం చేసుకోవాలనే యూత్‌కు ఇది చాలా మంచి అవకాశం. పండుగల సమయంలో తమ కలల బైకును కొనుగోలు చేయలేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

KTM 250 డ్యూక్‌ను కొనాలనుకుంటున్న వారు కంపెనీ డీలర్ల వద్ద సంప్రదించవచ్చు. ఇది లిమిటెడ్ ఆఫర్ కాబట్టి వెంటనే వారిని కలవడం బెస్ట్. ఈ స్పోర్ట్స్ బైక్ అధునాతన ఫీచర్లతో వచ్చింది. ఇది 248 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజిన్ 9,250 rpm వద్ద 30 bhp పవర్, 7,250 rpm వద్ద గరిష్టంగా 25 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాల్లో కూడా రయ్ మంటూ దూసుకుపోవడానికి ముందు ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను ఈబైక్ కలిగి ఉంది. రన్నింగ్‌లో స్కిడ్ అయి క్రింద పడకుండా వేగాన్ని కంట్రోల్ చేయడానికి రెండు వైపులా డిస్క్ బ్రేకులు అమర్చారు. అదనపు భద్రత కోసం డ్యూయల్ ఛానెల్ ABS సిస్టంను కూడా ఏర్పాటు చేశారు. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను రైడర్లు అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

ముందు వెనుక 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ అందంగా ఉంటాయి. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, హెడ్‌సెట్ కనెక్షన్, 5.0-అంగుళాల పూర్తి-TFT డిస్‌ప్లే, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు వంటి పలు ఫీచర్లను కలిగి ఉంది. KTM 250 డ్యూక్ ఎబోనీ బ్లాక్, ఎలక్ట్రానిక్ ఆరెంజ్, అట్లాంటిక్ బ్లూ, సిరామిక్ వైట్ అనే నాలుగు వేరు వేరు కలర్ వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది.


Click it and Unblock the Notifications