రూ. 79,999 కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Lectrix LXS 2.0 లాంచ్.. 98 కి.మీ రేంజ్, బుకింగ్‌లు ప్రారంభం
భారత మార్కెట్లో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీల్లో లెక్ట్రిక్స్ ఈవీ ఒకటి. టాప్ 10 లో Lectrix EV మేకర్ స్థానం సంపాదించుకుంది. ఈ మేరకు ఈ కొత్త స్టార్టప్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. తక్కువ ధరలో అధిక రేంజ్‌తో ఈ స్కూటర్‌ను సంస్థ లాంచ్ చేసింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్, యువ రైడర్ల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని స్టార్టప్‌లతో పాటు ప్రముఖ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ ఈవీ సెగ్మెంట్‌లో తమ మార్కును ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలో లెక్ట్రిక్స్ ఈవీ.. LXS 2.0 పేరుతో సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసింది.

LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Lectrix EV రూ. 79,999(ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. సుదూర ప్రయాణాలకు అనుగుణంగా ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. అందుకు తగినట్లుగా అధునాతన ఫీచర్లను ఇందులో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. LXS 2.0 ను లాంచ్ చేయడానికి.. దీని నాణ్యత, విశ్వసనీయతను ప్రదర్శించడానికి దాదాపు 1.25 లక్షల కి.మీ వరకు టెస్ట్ రన్ నిర్వహించారు.
టెస్ట్ రన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని లెక్ట్రిక్స్ ఈవీ ప్రకటించింది. అందువల్ల, లెక్ట్రిక్స్ LXS 2.0 సుదూర ప్రయాణానికి మరియు మన్నికకు అనువైన వాహనంగా ఉంటుందని సంస్థ పేర్కొంది. టెస్ట్ రన్ విజయవంతమైన అనంతరం లెక్ట్రిక్స్ EV భారతీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
బ్యాటరీ ప్యాక్ విషయానికొస్తే Lectrix LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2.3 KW బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇంత పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కేవలం రూ. 79,999(ఎక్స్-షోరూమ్) ధరలో మాత్రమే ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జింగ్‌పై 98 కి.మీ వరకు ప్రయాణించవచ్చని లెక్ట్రిక్స్ వెల్లడించింది.
Lectrix LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు.. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ డెలివరీలు మార్చి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కంపెనీకి 10 వేలకు పైగా కస్టమర్లు ఉండటంతో.. ప్రజాదరణను మరింతగా పెంచుకోవాలనే లక్ష్యంతో తక్కువ ధరలో ఈ స్కూటర్‌ను విడుదల చేసింది.
కాగా లెక్ట్రిక్స్ LXS 2.0 EV ని రైడర్ల మూడు విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. ఈ వాహనం సరైన రేంజ్, సరైన ధర మరియు సరైన నాణ్యతను కలిగి ఉందని స్పష్టం చేసింది. మహిళలు, పురుషులు ఇద్దరూ ఈ వాహనాన్ని ఉపయోగించుకునేలా ఉంటుందని వెల్లడించింది.
LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ స్పీడ్, ఇతర ముఖ్యమైన వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కంపెనీకి కస్టమర్లలో ఉన్న ఆదరణ, లక్ష కిలోమీటర్లకు పైగా టెస్ట్ రన్, సరసమైన ధర.. ఈ స్కూటర్‌పై మార్కెట్లో భారీ అంచనాలను కలిగిస్తోంది. దీంతో LXS 2.0 ఎలక్ట్రిక్ టూవీలర్ సెగ్మెంట్‌లో సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తుందని Lectrix ఆశాభావంతో ఉంది.


Click it and Unblock the Notifications








