లైఫ్‌ టైమ్‌ బ్యాటరీ వారంటీతో హై స్పీడ్‌ Lectrix LXS 2.0 ఇ స్కూటర్‌ లాంచ్‌.. ధర రూ. 49,999

భారత మార్కెట్లో పోటాపోటీగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు విడుదలవతున్నాయి. ఆకట్టుకునే డిజైన్‌, లుక్, ఫీచర్లతో తక్కువ ధరలో ఇ స్కూటర్లను విడుదల చేసేందుకు స్టార్ట్‌ప్‌లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో Lectrix కంపెనీ తన హై స్పీడ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌ LXS 2.0 ను విడుదల చేసింది.

పెట్రోల్‌తో నడిచే సాంప్రదాయక వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహన కంపెనీలు స్కూటర్లు, బైక్‌లు, కార్లను ప్రవేశపెడుతున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అత్యధికంగా ప్రజాదరణ పొందుతున్నాయి. సాధారణంగా మార్కెట్లో ప్రస్తుతం పెట్రోల్‌తో నడిచే స్కూటర్ ధర దాదాపు రూ.లక్ష ఉంటుంది. ఇప్పుడు దానికి సగం ధరలో లెక్ట్రిక్స్‌.. ఈవీని విడుదల చేసింది.

Lectrix-LXS-2 0-With-BAAS-Launch

Lectrix విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ LXS 2.0 ను సంస్థ రూ. 49,999 ధరలో విడుదల చేసింది. ఈ లెక్ట్రిక్స్ బ్రాండ్ ప్రసిద్ధ SAR గ్రూప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోనిది. ఈ కొత్త ఇ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. ఇది గరిష్ఠంగా 50 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. జీవితకాల బ్యాటరీ వారంటీని అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

కొత్త లెక్ట్రిక్స్ LXS 2.0 స్కూటర్‌ను కొనుగోలు చేసేవారు లైఫ్‌టైమ్‌ బ్యాటరీ వారంటీని పొందవచ్చు. అంటే వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన బ్యాటరీ సేవలకు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాటరీ-ఎ-సర్వీస్(BAAS) ప్రోగ్రామ్ కింద లెక్ట్రిక్స్ EV యొక్క కస్టమర్‌లు ఎలక్ట్రిక్ స్కూటర్‌ల కంటే 40 శాతం వరకు తక్కువ చెల్లిస్తారని సంస్థ పేర్కొంది.

కాగా అంతకుముందు ఫిబ్రవరి 2024లో, కంపెనీ LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క తక్కువ-రేంజ్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌ పూర్తి ఛార్జింగ్‌పై 98 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది. 2.3kW బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్న ఈ స్కూటర్ ధర రూ. 79,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఇక కొత్త LXS 2.0 కస్టమర్ల యొక్క మూడు ప్రధాన అవసరాలను తీర్చగలదని కంపెనీ చెబుతోంది. రేంజ్‌, నాణ్యత మరియు విలువ పరంగా వాహనదారులు సంతృప్తి చెందుతారని వెల్లడించింది. లెక్ట్రిక్స్ కొత్త LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌తో మొదటిసారి కొనుగోలు చేసేవారిని లక్ష్యంగా చేసుకుంటోంది. తద్వారా 3 సంవత్సరాల లేదా 30,000 కిమీ వారంటీని అందిస్తోంది.

Lectrix LXS 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, ఎమర్జెన్సీ SOS, డోర్-టు-డోర్ సర్వీస్ మరియు మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది. కాగా ఈ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ లెక్ట్రిక్స్ కస్టమర్లను కలిగి ఉంది.

వాహనం నుంచి బ్యాటరీని డీలింక్ చేసి, దానిని ఒక సేవగా అందించడం ద్వారా, EV అనుభవాన్ని కస్టమర్లకు చాలా సులభతరం చేస్తుందని Lectrix EV కంపెనీ ప్రెసిడెంట్ ప్రితేష్ తల్వార్ అన్నారు. ప్రస్తుతం ఈవీ కొనాలంటే కస్టమర్లకు కొన్ని ప్రధాన సవాళ్లు ఉన్నాయని చెప్పారు. అవి అధిక ధర మరియు బ్యాటరీల కారణంగా ఏర్పడే సమస్యలని తల్వార్‌ వెల్లడించారు.

Lectrix LXS 2.0 ద్వారా ఈ సమస్యలు పరిష్కారమవుతాయని వెల్లడించారు. 'పెట్రోల్‌తో నడిచే స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి ఎంతైనా రూ. 1 లక్ష, ఇది మా ఆఫర్ ధర కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుంది. అదనంగా, పెట్రోల్‌పై నెలవారీ పెట్టుబడి పెరుగుతోంది, ఇంధనంతో నడిచే వాహనం యొక్క నిర్వహణ ఖర్చుతో కలిపి మా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మరింత పొదుపుగా ఉంటుంది" అని తల్వార్ అన్నారు.

More from DriveSpark

Article Published On: Monday, April 8, 2024, 16:04 [IST]
English summary
Lectrix ev launches lxs 2 0 high speed electric scooter with baas price battery range details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+