తక్కువ ధరలో బెస్ట్ ఈవీ స్కూటర్.. రూ.58 వేలకే 117 కి.మీలు.. దీని స్పీడ్ కూడా ఎక్కువే..

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్న కొద్ది వాహన తయారీదారులు కూడా పలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి వరుసగా విడుదల చేస్తున్నారు. టాప్ బ్రాండ్‌లుగా చలామణి అవుతున్న కంపెనీలు ఈవీ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అధునాతన ఫీచర్లతో ఈవీ టూవీలర్లను తీసుకొస్తున్నాయి. ఇటీవల హోండా కంపెనీ సైతం ఈవీ విభాగంలోకి అడుగుపెట్టి అత్యంత ప్రసిద్ధ మోడల్ అయినటువంటి యాక్టివాను ఎలక్ట్రిక్ వెర్షన్‌తో తీసుకువచ్చంది. యాక్టివా దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా నిలినిపోయింది. అలాంటి మోడల్‌ను ఈవీలో తీసుకురావడగం ద్వారా ఈ విభాగంపై హోండా ముందు చూపును అంచనా వేయచ్చు. దీనితో పాటు ఇతర టాప్ కంపెనీలు కూడా వరుసగా కొత్త కొత్త మోడళ్లను కొత్త ఏడాదిలో మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించాయి. ఇవే కాకుండా దేశీయంగా ఉన్న చిన్న, మధ్యస్థ కంపెనీలు కూడా ఈవీలను తీసుకొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా దేశీయంగా స్టార్టప్ కంపెనీగా ఉన్నటువంటి లెక్ట్రిక్స్ EV(lectrix nduro) ఎన్‌డ్యూరో అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. ఇది తక్కువ ధరలో, సరికొత్త డిజైన్‌తో వచ్చింది. ఇది ప్రధానంగా రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఎన్‌డ్యూరో 2.0 ధర రూ.84,999 కాగా, ఎన్‌డ్యూరో 3.0 ధర రూ.94,999 గా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. తక్కువ ధర అయినప్పటికి అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.

Lectrix Nduro Electric Scooter

ఎన్‌డ్యూరో ఎలక్ట్రిక్ స్కూటర్‌‌కు సంబంధించిన బుకింగ్స్ డిసెంబర్ 7 నుంచి మొదలవుతాయని లెక్ట్రిక్స్ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, ఈ రెండు వేరియంట్ల మధ్య ప్రధాన తేడా బ్యాటరీ మాత్రమే. ఒకవేళ వినియోగదారులు బ్యాటరీని కొనుగోలు చేయకుండా లీజు పద్దతిలో కొనాలంటే స్కూటర్ ధరలు సగానికి పైగా తగ్గుతాయి. ఎన్‌డ్యూరో 2.0 ను రూ.57,999కే కొనుగోలు చేయవచ్చు.

బ్యాటరీ లీజు పద్దతిిని ఎంచుకున్న వారు నెలకు సబ్‌స్క్రిప్షన్ ఫీజు రూపంలో రూ.999 చెల్లించవచ్చు. ఇది ప్రారంభ ధర మాత్రమే. లీజు తీసుకున్న దాని ప్రకారం ఫీజు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్ 2.3 kWh, 3 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. 2.3 kWh బ్యాటరీతో ఎన్‌డ్యూరో 2.0 వేరియంట్ ఒక్కసారి ఛార్జింగ్‌తో 90 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.

అదే ఎన్‌డ్యూరో 3.0 వేరియంట్ 3 kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 117 కి.మీల వరకు వెళ్తుంది. లెక్ట్రిక్స్ కంపెనీ తన రెండు వేరియంట్లలో కూడా 2.4 kW ఎలక్ట్రిక్ మోటారును అందించింది. ఈ మోటార్ సహయంతో ఎన్‌డ్యూరో ఈవీ గంటకు 65 కిమీ వేగంతో రయ్ మంటూ దూసుకుపోతుంది. మరో విషయం ఏమిటంటే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 5.1 సెకన్లలో 40 కి మీ వేగాన్ని చేరుకుంటుంది.

ఎన్‌డ్యూరో ఈవీలో డజన్ల కొద్ది ఫీచర్లు ఉన్నాయి. బేస్ వేరియంట్‌లో 5-అంగుళాల కలర్ సెగ్మెంటెడ్ LCD స్క్రీన్‌ను ఉంటుంది. అదే టాప్-ఎండ్ మోడల్‌లో 5-అంగుళాల TFT డిస్‌ప్లేను అందించారు. ముఖ్యంగా ఎక్కువ లగేజీని పెట్టుకోడానికి 42 లీటర్ల బూట్ స్పెస్‌ను కూడా ఈ స్కూటర్‌లో ఇచ్చారు. ముందు బోల్డ్ ఆప్రాన్‌ లాగా కనిపిస్తుంది. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ను కూడా ఇది కలిగి ఉంది.

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్, బ్యాటరీ స్టేటస్ అప్‌డేట్‌లు, సేఫ్టీ కోసం రెండే వేరియంట్లో ఎవరైన స్కూటర్‌ను దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే హెచ్చరించే సిస్టం, రివర్స్ మోడ్, సైడ్-స్టాండ్ కట్-ఆఫ్,హిల్-హోల్డ్ అసిస్ట్ ఇంకా మరిన్ని ఉన్నాయి. దీని బాడీ దృఢంగా, కఠినంగా ఉంటుంది. దీని యువతను బాగా ఆకట్టుకుంటుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 4, 2024, 17:45 [IST]
English summary
Lectrix nduro electric scooter launched in india with two variants here details
Read more on: #electric bike #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+