ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనేవారు కాస్త ఆగండి.. ప్రపంచంలోనే తోపు డిజైనర్లు తయారు చేసిన స్కూటర్ త్వరలోనే రాబోతుంది!

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల ట్రెండ్‌ కొనసాగుతుంది. జనాలు ఎక్కువగా వీటినే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఓలా, ఏథర్, టీవీఎస్, బజాజ్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లు మార్కెట్‌లో దుమ్మురేపుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌కి వస్తున్న డిమాండ్‌తో కొన్ని స్టార్టప్‌ కంపెనీలు సైతం ఉత్పత్తులను తీసుకువస్తున్నాయి. తాజాగా లవ్ మై లైఫ్ గ్రూప్‌ (LML) సరికొత్త స్కూటర్లను మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రేటర్‌ నోయిడాలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ నుంచి విడుదల చేయబోయే తొలి స్కూటర్‌ని ప్రదర్శించింది. అప్పటి నుంచే ఈ స్కూటర్‌పై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

ఈ స్కూటర్‌ని స్టార్‌ (Star) అనే పేరుతో స్కూటర్‌ని తీసుకువస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. తాజాగా వీటితో పాటు ఓరియన్ (Orion), మూన్‌షాట్‌ (Moonshot) అనే స్కూటర్లను కూడా తీసుకువస్తుంది. ఈ లవ్ మై లైఫ్ కంపెనీ త్వరలో విడుదల చేయబోయే స్టార్ స్కూటర్‌ అధికారిక ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది. ఈ స్కూటర్ డిజైన్‌ విడుదలకు ముందే ఈ ఈవీ బ్రాండ్ పేటెంట్‌ని సైతం పొందింది.

LML Star Electric Scooter

ఈ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని డుకాటీ, ఫెరారీ, యమహా, కవాసాకి వంటి అంతర్జాతీయ ద్విచక్ర వాహనాలకు పనిచేసిన దిగ్గజాల డిజైనర్లు దీనిని సరికొత్త రూపంలో రూపొందించారు. ఈ లవ్ మై లైఫ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో స్టార్ ఇ-స్కూటర్‌ని మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. ఈ రాబోవు పండుగ సీజన్‌లో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఈవీని సాధారణ మోడళ్ల కంటే ఫ్యూచరిస్టిక్‌ లుక్‌తో ఢిఫరెంట్‌గా కనిపిస్తుంది. భారతదేశంలో లాంచ్ చేయాలనుకుంటున్న మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లలో స్టార్ తొలి ప్రొడక్ట్‌గా మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. ఆ తర్వాత మూన్‌షాట్, ఓరియన్‌ని విడుదల చేయనుంది. ఈ మూడింటినీ సంబంధించిన కాన్సెప్ట్‌ని వెల్లడించింది. ఇది ముందు చెప్పినట్లుగా ఢిఫరెంట్‌ లుక్‌తో వస్తుండటం చూపరులను ఆకట్టుకోనుంది.

LML Star Electric Scooter

ఇక ఇది డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ వైట్ బాడీ కలర్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్‌, రెడ్ యాక్సెంట్స్ ఉన్నాయి. లవ్ మై లైఫ్ స్టార్ స్కూటర్‌ మిడ్-మ్యాక్సీ స్కూటర్ లాగా కనిపిస్తుందని. స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ మార్కెట్‌లో ఇతర పోటీదారులు అందించని ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది.

గైడ్-మీ హోమ్ ల్యాంప్స్‌తో ఆటోమేటిక్ హెడ్‌లైట్స్‌, పెద్ద ఫ్రంట్ ఆప్రాన్, కస్టమైజబుల్ డిస్ప్లే, వైర్‌లెస్‌ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. స్టార్ ఇ-స్కూటర్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, ఎబిఎస్ వంటి భద్రతా ఫీచర్లను కూడా అందిస్తుంది. అయితే ఈ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లభించలేదు.

LML Electric Scooter Launch

లవ్ మై లైఫ్ బ్యాటరీ కెపాసిటీ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్‌కి సంబంధించిన వివరాలను సైతం వెల్లడించలేదు. అయితే ఇది 2 కిలోవాట్ల సామర్థ్యం గల రెండు సెట్స్‌ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తుందని భావిస్తున్నారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే స్టార్ సుమారు 150 కిలోమీటర్ల రేంజ్‌ అందించే అవకాశం ఉంది. ఇక దీని ధరను చాలా తక్కువ తీసుకువచ్చే అవకాశం ఉందని ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 24, 2024, 7:20 [IST]
English summary
Lml star electric scooter all set to launch this festive season check details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+