రూ. లక్షలోపు ధరలో 70 కి.మీల మైలేజ్ ఇచ్చే మిడిల్ క్లాస్ బెస్ట్ బైక్స్ ఇవే.. అన్ని తోపు మోడళ్లే
ఇండియాలో బడ్జెట్ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులకు భారీ డిమాండ్ ఉంటుంది. మధ్యతరగతి ప్రజలు ఇలాంటి వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. రోజు ఆఫీసులకు వెళ్లడానికి, కాలేజ్‌లు, నిత్యవసరాల కొనగోళ్లు, షాపింగ్ వంటి వాటికి అధిక మైలేజ్ ఇచ్చే హీరో, హోండా, టీవీఎస్ వంటి కంపెనీలకు చెందిన పలు బైకులకు దేశవ్యాప్తంగా అత్యంత భారీ డిమాండ్ ఉంది. ఇవి బడ్జెట్ ధరలోనే లభిస్తాయి. కొత్తగా బైకులను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి హోండా షైన్ 125, హీరో సూపర్ స్ప్లెండర్, టీవీఎస్ రేడియన్ బైకులు బాగా సెట్ అవుతాయి. ఇవన్నీ కూడా దేశంలో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను కలిగి ఉన్నాయి. వీటి ధర కూడా దాదాపు అందరు కొనుగోలు చేసే విధంగానే ఉంటాయి. ఇవి రూ.లక్ష లోపు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు వివరంగా కింది కథనంలో తెలుసుకోండి.
Honda Shine 125: హోండా కంపెనీకి ఇండియాలో దిగ్గజ కంపెనీగా పేరుంది. దీని నుంచి వచ్చిన షైన్ 125 మోడల్‌ను ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఇది 123.94 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 10.74 పవర్, 11 nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. భారత మార్కెట్లో ఈ మోడల్ రూ. 81,549 నుండి రూ. 85,550 (ఎక్స్-షోరూమ్) మధ్య కొనుగోలుకు లభిస్తుంది.

రూ. లక్ష లోపు ధర ఉండటం వలన చాలా మందికి ఇది ఫెవరేట్ బైకుగా ఉంది. మైలేజ్ విషయానికి వస్తే, లీటర్ పెట్రోల్‌కు 55 కి.మీ వరకు అందిస్తుంది. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఇది బెస్ట్ బైక్. ఇంజిన్‌కు 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఫీచర్లు కూడా వినియోగదారులకు అవసరానికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఇది జెన్నీ గ్రే మెటాలిక్, బ్లాక్, డీసెంట్ బ్లూ మెటాలిక్ కలర్స్‌లో లభిస్తుంది.
Hero Super Splendor: హీరో సూపర్ స్ప్లెండర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బైకు ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. ప్రతి గ్రామంలో కూడా ఇది కచ్చితంగా కనిపిస్తుంది. రోజు వారి ప్రయాణాలకు అత్యుత్తమైన బైక్‌గా దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుంది. దీని ధర .82,298 నుండి రూ.86,298 ఎక్స్-షోరూమ్ మధ్య ఉంది. లీటర్ పెట్రోల్‌కు దాదాపు 60 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.

ఇంతటి మైలేజ్ అందించే సూపర్ స్ప్లెండర్ వినియోగదారులకు మంచి ఆప్షన్ అయింది. ఇది 124.7 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఈ బైకులో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని అమర్చారు. ఇంజిన్ 10.7 పవర్, 10.6 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో సైడ్-స్టాండ్ కట్-ఆఫ్ ఫంక్షన్, USB ఛార్జింగ్ పోర్ట్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
TVS Radeon: దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ బైకులు సాధారణంగా ఎక్కువ మైలేజ్‌ని ఇస్తుంటాయి. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందించే బైకుల కోసం చూస్తున్న వారి కోసం ఈ కంపెనీకి చెందిన రేడియన్ బైక్ సరిగ్గా సెట్ అవుతుంది. ఇది 109.7 సీసీ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో లభిస్తుంది. దీని ధర ఇండియా మార్కెట్లో రూ. 70,043 నుండి రూ. 83,620 ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

టీవీఎస్ రేడియన్ లీటర్ పెట్రోల్‌కు దాదాపు 73.68 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. బైకు ధర ఇతర మోడళ్లతో పోలిస్తే తక్కువగా ఉండటమే కాకుండా, దీని మైలేజ్ కూడా ఇతర వాటి కంటే ఎక్కువగా ఉండటంతో కొత్త బైకును కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి సరైన ఆప్షన్ అవుతుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉండటంతో పాటు, దీనిలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








