ఇకపై తాగి బైక్ నడుపుతామంటే కుదరదు భయ్యా.. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఆట కట్టిస్తుంది.!!
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కొందరిలో మార్పు రావడం లేదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. ఇలా తాగి నడిపేవారిలో టూ వీలర్లే ఎక్కువ. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ఓ విద్యార్థుల బృందం వినూత్న ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ధి చేసింది.
మనదేశంలో ఆవిష్కరణలకు కొదవ లేదు. ముఖ్యంగా యువత.. తమ టాలెంట్‌ను స్టార్టప్‌ల రూపంలో ప్రదర్శిస్తూ వినూత్న ప్రాజెక్టులకు నాంది పలుకుతున్నారు. టెక్నాలజీని అందుకు అనుగుణంగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఆటో మొబైల్ రంగంలో విస్తృత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యూపీకి చెందిన విద్యార్థుల బృందం ఓ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ధి చేసింది. అయితే ఇది మామూలు బైక్ అనుకుంటే పొరపాటే..

అలహాబాద్‌లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNNIT) మరియు సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ (SAE) క్లబ్‌లో ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల బృందం ఓ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ధి చేసింది. ఈ బైక్‌లో ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఆల్కహాల్ డిటెక్షన్(E-Bike Alcohol Detection System) సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ స్పెషాలిటీ ఏంటంటే.. వాహనదారుడు తాగి నడిపితే ఆ బైక్ ముందుకెళ్లదు.
కాగా MNNIT విద్యార్థులు రూపొందించిన ఈ ఇ బైక్ గరిష్ఠంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలరు. ఇంకా ఈ బైక్‌ను 4 గంటలపాటు ఛార్జింగ్ చేస్తే 60 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని చెబుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్‌తో పాటు.. డజన్ల కొద్దీ అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. యాంటీ థెఫ్ట్ అలారం, స్మోక్ సెన్సార్లు వంటి ఫీచర్లను ఇందులో అమర్చారు.
ఈ ఎలక్ట్రిక్ బైక్‌లోని సెన్సార్లు రైడర్ ఎప్పుడు మద్యం సేవించాడో కూడా గుర్తిస్తాయని విద్యార్థులు పేర్కొన్నారు. అంతేకాకుండా హిల్ అసిస్ట్ ఫీచర్ ద్వారా.. ఏటవాలుగా ఉన్న ఎత్తైన రహదారిపై కూడా సులభంగా ప్రయాణించేలా దీనిని రూపొందించారు. ఈ బైక్ తయారీకి రూ.1.30 లక్షలు ఖర్చయినట్లు చెబుతున్నారు.
అంతేకాకుండా ప్రమాదం జరిగినప్పుడు.. ఈ ఎలక్ట్రిక్ బైక్ రైడర్‌కు తగిన రక్షణను అందిస్తుందని మెకానిక్ విద్యార్థులు చెబుతున్నారు. రైడర్ ప్రమాదంలో ఉండి ఎవరినీ సంప్రదించలేని స్థితిలో ఉన్నప్పుడు.. అత్యాధునిక వ్యవస్థ సహాయం ద్వారా ఎమర్జెన్సీ సర్వీస్‌ను కూడా సంప్రదిస్తుందట. MNNITలోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్యవేక్షణలో ఈ-బైక్‌ను రూపొందించినట్లు విద్యార్థుల బృందం చెబుతోంది.
విద్యార్థుల పరిశోధన పట్ల MNNIT ప్రొఫెసర్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల భోపాల్‌లో నిర్వహించిన ఇంపీరియల్ సొసైటీ ఆఫ్ ఇన్నోవేటివ్ ఇంజనీర్స్ (ISIE) నిర్వహించిన ప్రతిష్ఠాత్మక పోటీలో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా వివిధ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి 70 బృందాలు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నాయి. ఈ పోటీలో MNNIT బృందం రెండు అవార్డులను గెలుచుకుంది.
ఉత్తమ డిజైన్ మరియు ఫ్యూచర్ అవార్డును ఈ ఆల్కహాల్ డిటెక్ట్ ఎలక్ట్రిక్ బైక్ సొంతం చేసుకుంది. టాప్ 10 జాబితాలో MNNIT విద్యార్థులు రూపొందించిన బైక్ నిలిచింది. ఈ బైక్‌ను అభివృద్ధి చేయడంలో పుల్కిత్ సింఘాల్, హర్ష మహర్షి, ఆదర్శ్ కుమార్, సుమిత్ మిశ్రా, యశవ్ భారతి, సందీప్ యాదవ్, సూర్యాంశ్ పాఠక్, ప్రశాంత్ తదితరులు కృషి చేశారు.


Click it and Unblock the Notifications








