యూత్ కోసం క్రేజీ బైక్స్.. ఎంత ఖర్చైనా పర్లేదు తగ్గేదెలే అంటున్న కుర్రాళ్లు!
ప్రస్తుతం మార్కెట్‌లో చాలా కంపెనీలకు చెందిన బైక్స్ మోడరన్ క్లాసిక్ లుక్‌తో అందుబాటులో ఉన్నాయి. యూత్, రైడింగ్ ఔత్సాహికుల కోసం ఈ బైక్స్ సరిపోతాయి. ముఖ్యంగా ఇవి డిజైన్, ప్రీమియం బిల్డ్ క్వాలటీ, హై-ఫర్ఫామెన్స్‌ని కలిగి ఉండటంతో యువత ఈ మోటర్‌సైకిల్స్ కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. యూత్‌కి మార్కెట్‌లో లభించే ఈ బైక్స్ అంటే క్రేజ్ ఎక్కువ. అయితే వివిధ కంపెనీలు భారీ ఫీచర్లతో బైక్స్‌ని విడుదల చేస్తున్నాయి. దీంతో ఏ మోటారుసైకిల్ తీసుకోవాలో తెలియక తికమక అవుతున్నారు. ఇక్కడ మూడు లక్షల లోపు మంచి క్లాసిక్ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ట్రయంఫ్ స్పీడ్ టీ4 (Triumph Speed T4), రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350), హార్లే డేవిడ్సన్ X440 (Harley Davidson X440) మోడళ్లు ఉన్నాయి. ఈ బైక్స్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఈ జాబితాలోని మొదటి బైక్ ట్రయంఫ్ స్పీడ్ టీ4. ఈ కొత్త బైక్ 399 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 30.6 bhp పవర్, 36 nm గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్‌లో 6-స్పీడ్ గేర్ బాక్స్ కలదు. ఆకట్టుకునే డిజైన్‌తో ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ కనెక్టివిటీతో అనలాగ్ డిజిటల్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ బైక్ వైట్, రెడ్, బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. సేఫ్టీ ఫీచర్లలో ABS (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), డిస్క్ బ్రేక్ ఆప్షన్లు ఉన్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.17 లక్షలుగా ఉంటుంది. ఇదే కంపెనీలోని టీ స్పీడ్400, స్పీడ్ స్క్రాంబ్లర్ 400 బైక్స్ కూడా ఉన్నాయి.
ఆ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) ఓ మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఈ బైక్‌లోని 349 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది 20.4 bhp పవర్, 27 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో హాలోజెన్ హెడ్‌లైట్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్ కలవు.

అలాగే బల్బ్ టైప్ ఇండికేటర్స్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆప్షన్ కూడా ఉంది. భారీ ఆకృతితో ఉంటుంది. ఈ బైక్ 170 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. దీంతో మీరు ఆఫ్‌రోడ్ లోనూ సులభంగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఈ బైక్ ధరలు రూ .1.74 లక్షల నుంచి రూ .2.16 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.
ఈ జాబితాలోని మరో బైక్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 (Harley Davidson X440). ఇందులోని 440 సీసీ పెట్రోల్ ఇంజిన్ 27.37 bhp, 38 nm, గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్ బాక్స్ జతచేయబడి ఉంటుంది. ఈ కొత్త హార్లే డేవిడ్సన్ X440 డార్క్ సిల్వర్ , మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇది లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇందులో 13.5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంది. రైడర్ల సేఫ్టీ కోసం డబుల్ డిస్క్ బ్రేక్‌ని కలిగి ఉంటుంది. ఈ బైక్ రూ .2.40 లక్షల నుంచి రూ .2.80 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ప్రీమియం మార్కెట్‌లో ఈ బైక్స్‌కి డిమాండ్ ఎక్కువగా ఉంది.
వీటితో పాటు మార్కెట్‌లో హోండా CB500X, జావా 42 బాబర్ రెడ్ షీన్, యహమా ఆర్3, సుజుకి Gixxer SF250, Husqvarna Svartpilen 250 వంటి బైక్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు మంచి ప్రీమియం, క్లాసికల్ బైక్స్ కోసం చూస్తున్నట్లైతే మా డ్రైవ్స్‌పార్క్ వెబ్‌సైట్‌లో వాటి ఆన్‌రోడ్ ధరలు మొత్తం మోడల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








