వీటి ధర రూ. 80 వేల కంటే తక్కువే.. 70 కి.మీ మైలేజ్.. అస్సలు మిస్ కాకండి.!!
భారత మార్కెట్లో ఎన్నో రకాల బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధర నుంచి ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌ల వరకూ చాలా ఉన్నాయి. ఈ క్రమంలో మీరు సరసమైన ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల నుంచి అందుబాటులో ఉన్న మూడు అద్భుతమైన బైక్‌ల గురించి ఇక్కడ అందిస్తున్నాం.
హీరో ప్యాషన్ ప్లస్(Hero Passion Plus): అత్యంత సరసమైన బైక్‌ల జాబితాలో హీరో ప్యాషన్ ప్లస్ ఒకటి. భారత మార్కెట్లో ఈ బైక్ ధర రూ. 77,361 గా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్. ఈ బైక్ ఇంజిన్ 97.2 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

హీరో ప్యాషన్ ప్లస్ గరిష్ఠంగా 8.02 PS శక్తిని మరియు 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ఈ ప్యాషన్ ప్లస్ మోటార్‌సైకిల్ లీటర్‌కు సుమారు 70 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. రైడర్ భద్రత కోసం ఇందులో డ్రమ్ బ్రేక్ ఆప్షన్ ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే హీరో ప్యాషన్ ప్లస్‌లో ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది. 11 లీటర్ కెపాసిటి గల ఫ్యూయెల్ ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. బ్లాక్ హెవీ గ్రే, బ్లాక్ గ్రే స్ట్రిప్, స్పోర్ట్స్, బ్లాక్ నెక్సస్ బ్లూ రంగుల్లో కూడా ఈ బైక్ అందుబాటులో ఉంది.
బజాజ్ ప్లాటినా 110(Bajaj Platina 110): మార్కెట్లో అందుబాటులో ఉన్న మరో అత్యంత సరసమైన బైక్ బజాజ్ ప్లాటినా. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.70,451 నుండి రూ.80,012 గా ఉంది. ఇది 115.45 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

బజాజ్ ప్లాటినా 110 బైక్ ఇంజిన్ గరిష్ఠంగా 8.6 PS శక్తిని మరియు 9.81 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఆప్షనల్‌గా అందుబాటులో ఉంటుంది. లీటర్‌కు 70 కి.మీ మైలేజ్‌ని అందిస్తుంది. ఈ బైక్ బరువు 123 కిలోల బరువుగా ఉంది.
బజాజ్ ప్లాటినా 110 లో 10.5 లీటర్ల కెపాసిటీ ఫ్యూయెల్ ట్యాంక్ ఉంది. ట్యూబ్-లెస్ టైర్లు, LED డేటైమ్ రన్నింగ్ లైట్ (DRL), సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వివిధ ఫీచర్లను ఇందులో చూడవచ్చు. ఈ బైక్ భద్రత కోసం డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను కలిగి ఉంది.
హోండా షైన్ 100(Honda Shine 100): దేశంలో అత్యంత ఎక్కువగా అమ్ముడుపోతున్న సరసమైన బైక్‌ల జాబితాలో ఒకటి హోండా షైన్ 100 బైక్. ఈ బైక్ రూ.66,600 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 98.98 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

హోండా షైన్ 100 గరిష్ఠంగా 7.38 PS పవర్ మరియు 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌గా కూడా అందుబాటులో ఉంది. లీటర్‌కు 55 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఇది డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌ను కలిగి ఉంది.
హోండా షైన్ 100 బైక్ 9-లీటర్ కెపాసిటీ గల ఫ్యూయెల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. ఈ బైక్ బరువు 99 కిలోలు. ఇందులో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా వివిధ ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, బజాజ్ ప్లాటినా 100.. షైన్ బైక్‌కు బలమైన ప్రత్యర్థులుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications








